అక్షర

ఆ తాత చెప్పిన ‘గీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా తాత.. గీత...
మా ప్రయాణం
-పి.చంద్రశేఖర్ ఆజాద్,
వెల: రూ.110;
ప్రతులకు: రచయిత
సెల్ నెంబర్: 09246573575

అనిల్ అవార్డు, ఆటా- ఆంధ్రభూమి నవలల పోటీలో ప్రథమ బహుమతి, బాలజ్యోతి, నవ తెలంగాణా, చతుర, ఈ పత్రిక కినిగె, స్వప్న మాస పత్రిక, స్వాతి తదితర పత్రికలు నిర్వహించిన నవలల పోటీలలో బహుమతులు పొందిన చంద్రశేఖర్ ఆజాద్ తెలుగు పాఠకులకు చిరపరిచితుడే. జాగృతి వారపత్రిక నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందిన ‘మా తాత.. గీత... మా ప్రయాణం’ నవల పుస్తక రూపంలో తెలుగు పాఠకుల ముందుకు వచ్చింది.
అనగనగా ఒక తాత.. ఆ తాతకు ఇద్దరు మనవరాళ్లు. తాతగారి మ్యూజింగ్స్ చదివిన అమెరికాలో ఉన్న మనవరాలు స్వర ఇండియాకి వచ్చేస్తుంది. అక్క అమితతో కలిసి తాతగారితో కలిసి కొన్నాళ్లు గడుపుతుంది. అక్కాచెల్లెళ్లు తాత గుండెల్లో ఉన్న తీరని కోరికను గుర్తించారు. ఆ కోరికను తీర్చడానికి వారి ప్రయత్నాల సారమే ఈ నవల ఇతివృత్తం. వారు అనుకున్న లక్ష్యం సాధించారా? ఎదురైన ఇబ్బందులు ఏమిటి? ఇబ్బందులు ఎదుర్కోడానికి వారు ఎన్నుకున్న మార్గమేమిటి? మార్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి వారికి లభించిన సహాయ సహకారాలేమిటి? ఇలాంటి ప్రశ్నలకే కాకుండా అనుబంధ ప్రశ్నలకి సమాధానాలు నవలలో దొరుకుతాయి.
నవలలోని ఇతివృత్తం కథ గురించి తెలుసుకునేముందు ‘తెరవెనక కథ’ తెలుసుకునే అవకాశం కల్పించారు రచయిత. ఒక వాక్యం- ఒక పదం కూడా రచనలకి స్ఫూర్తినిస్తాయి. పుత్రశోకం అనుభవిస్తున్న ఓ తండ్రి రాసిన వాక్యం ‘మా తాత- గీత మా ప్రయాణం’ నవలలకు స్ఫూర్తి. మూడు పత్రికలు నవల ప్రచురణకు అంగీకరించపోయినా, నాలుగవ ప్రయత్నంగా నవలల పోటీకి పంపగా ద్వితీయ బహుమతి గెలుచుకున్నదా నవల. ప్రయత్న లోపం లేకుండా ఉంటే, సగం విజయం సాధించినట్టే అన్న నానుడి నిజమయింది. సాధారణ ప్రచురణకు కూడా కొన్ని పత్రికలు అంగీకరించకపోయినా, నిరుత్సాహపడకుండా, అవసరమయితే స్వయంగా పుస్తక ప్రచురణ చేయాలనుకున్నారు రచయిత. ఆ అవసరం రాలేదు.
ఈ నవలలో పదకొండు అధ్యాయాలు ఉన్నాయి. తొలి అధ్యాయం ఒక తల్లి ప్రసవ వేదనతో మొదలవుతుంది. రెండో అధ్యాయంలో తాత మనవరాలికి ఏర్పడుతున్న ప్రత్యేక స్నేహ బంధం గురించిన ప్రస్తావన ఉంది. తాతకు మనవడు కావాలన్న కోరిక రెండో ప్రయత్నంలోనూ తీరదు. మనవడు పుట్టిన కొన్ని సమయానికే మరణిస్తాడు. మూడోప్రయత్నంలో మనవరాలు పుడుతుంది. తాత ఇద్దరు మనవరాళ్లకి తన ఆలోచనలు (మ్యూజింగ్స్) పంపడం అమెరికాలో ఉన్న మనవరాలు తాతని అక్కని కలుసుకోడానికి ఇండియాకి రావడం జరుగుతుంది.
తాతగారు ఇద్దరు మనవరాళ్లనించీ ఆశించినవి నెరవేరతాయి. ఆశించిన వాటికన్నా ఎక్కువ మనవరాళ్లు తాతగారికి ఆనందం కలిగించే సంఘటనలు. తదుపరి అధ్యాయాలలో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మనవరాళ్లు తాతగారి జన్మదినంనాడు ఊహించని కానుకలు ఇచ్చి ఆనంద పరచడంతో నవల మంగళాంతం అవుతుంది.
రచయిత మానవ మనస్తత్వంలోని బలాలను బలహీనతలను పాఠకుల మనో నేత్రానికి కనిపించేటట్టు చేయడంలో సఫలీకృతులయ్యారు. తాతకి మనవడు కావాలన్న కోరిక తీరిందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఆఖరి పుటలో లభిస్తుంది.

-పాలంకి సత్యనారాయణ