అక్షర

చదివించే ‘సాక్షి’ వ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనుగింటి బాల రసాలు
పానుగంటి సాక్షివ్యాసాలు
తాళ్లూరి లాబన్‌బాబు
వెల: రు.110/-
పుటలు: 148;
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ

పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాల పట్ల ఆకర్షణ నేటికీ తగ్గలేదనడానికి లాబన్‌బాబుగారి ఈ గ్రంథమే ఒక నిదర్శనం. బహుముఖీనమైన ప్రజ్ఞాపాటవాలు ఆవేశపూరిత వాక్య నిర్మాణం, పరిహాస పేశలత్వం, ఉపమాన పరంపర, చిన్న చిన్న పదాలు దానితోపాటే సుదీర్ఘ సమాస చాలనం, అంత్యప్రాసలు, సమపద పునరావృత్తి, ధార్మికాగ్రహం, సంస్కరణప్రియత్వం, పురోగమన దృక్పథం పానుగంటివారి వ్యాసాలను నేటికీ జగజ్జేగీయమానం చేస్తున్నాయి. ఎటొచ్చీ వాటిని చదివి ఆస్వాదించి ఆనందించే పాఠకులే కరువయ్యారేమో! ఉన్న వారేమో షష్టిపూర్తికి చేరువలోనో, దాటినవారో అయి వుంటారేమో!
తాళ్లూరి లాబన్‌బాబు మళ్ళీ ఒకసారి సాక్షివ్యాసాల సౌరభాన్ని ఈ తరానికి అనువైన వ్యాఖ్యానంతో, అన్వయంతో 12 అధ్యాయాల్లో అందించి అభినందనీయులయ్యారు. సాక్షి వ్యాసాలు కేవలం హాస్య వ్యాసాలనడం వాటి విలువను తగ్గించడమేకాక తెలియనితనాన్ని ప్రదర్శించడమేనంటూ లాబన్‌బాబు నేటి అవసరాలకు, ఆలోచనలకు వర్తించే
వాటిని సోదాహరణంగా అందించారు.
సాక్షి వ్యాసా లు విజ్ఞానదాయకాలు. వానిలో వేదాం త చర్చలు, సాహితీ చర్చలు, విద్యావిషయక వ్యవహారాలపై చర్చలు, వినోదాత్మక , విన్యాసా లు. సంఘదురాచార ఖండనం, మానసిక రుగ్మతల నెత్తిచూపడం, దేశభక్తిప్రబోధం, సామాజిక చైతన్యప్రబోధం, (పుట 16) ఇలా ఎనె్నన్నో ఈ తరానికి కావలసినవి ఉన్నాయి. కాస్త ఓపిగ్గా చదువుకోవాలని లాబన్‌బాబు పిలుపునాలకిద్దాం. సాక్షిలోనివి వ్యాసాలా? ఉపన్యాసాలా? నాటకాలా? అని చేసిన చర్చ యుక్తియుక్తంగా విద్యాత్మకంగా కొనసాగింది. విద్యావ్యాప్తి, బాహ్యాచార ఖండనం, అస్పృశ్యతా ఖండనం, డాంబికాచారాలు, అప్రయోజనకరమైన కోర్టు వ్యాజ్యాలు, అపాండిత్య ధోరణులు, ఆచరణ శూన్య ఉపన్యాస వాచాలత్వాలు, ఆశ్రీత పక్షపాతాలు, సొంత ఖర్చులతో సన్మానాలు చేయించుకోవడాలు, ఇలా ఎన్నోఎనె్నన్నో మరొకసారి స్మృతిపథంలో నిలిచిన లాబన్‌బాబుగారికి మరొకసారి అభినందనలు.

-ఆచార్య వెలుదండ నిత్యానందరావు