అక్షర

పిల్లలకూ... పెద్దలకూ బాలశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్డ్రన్ అండర్‌స్టాండింగ్
(పెద్దలకోసం బాలశిక్ష)
రచయిత:- బ్నిం.
వెల: రు.65/-
ప్రతులకు:- శ్రీపీఠం ఆధ్యాత్మిక కేంద్రాలు
బ్నిం, 12-11-448
వారాసిగూడ, సికిందరాబాదు- 61
-8341450673

ప్రముఖ రచయిత, కార్టూనిస్టు ‘బ్నిం’రాసిన 25 వ్యాసాలతో ఈ పుస్తకం వెలువడింది. ఇవన్నీ ‘శ్రీపీఠం’ ఆధ్యాత్మిక మాసపత్రికలో ఇంతకుముందు అచ్చువేయబడినవి.
స్వామి పరిపూర్ణానంద ఆశీస్సులతో వెలువడిన ఈ పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలనేకం ఉన్నాయి.
64 పేజీలతో ఉన్న ఈ చిన్న పుస్తకంలో ఉన్న ఒక విశేషమేమిటంటే వెల స్వల్పం, ఫలమధికం. పిల్లలతోపాటు పెద్దలు కూడ చదివి ఆలోచించవలసిన సంగతులు ఇందులో కనిపిస్తాయి.
స్పీడుయుగంలో ఉన్న ఈనాటి అమ్మలకు పిల్లలకు అన్నం తినిపించటానికి సమయం సరిపోవటంలేదనే సంగతి నిజం. అయినప్పటికీ తమ పద్ధతిని కొద్దిగనైనా మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ‘చిలకముద్ద- పిచిక ముద్ద’ వ్యాసం చదివినప్పుడు తెలుస్తుంది.
టి.వి.చూసి పిల్లలు చదువుకోవటం లేదని కేబుల్ తీసెయ్యటంవల్ల ఉపయోగం లేదని ‘బాలల టివి హక్కులు’ వ్యాసంలో తెలిపారు. సమస్యకు పరిష్కారం కూడ సూచించారు.
‘అమావాస్య కాదు.. దీపావళి’ వ్యాసం ప్రశంసనీయంగా ఉంది. ‘ఏదైనా మంచిపని తలపెట్టి, ఫలితం తగినంత పొందలేకపోయినప్పుడు మనం వాళ్లని ఎంకరేజి చేస్తూ ముందుకు సాగిపొమ్మని ఊతమివ్వాలి’అంటారు రచయిత. ‘డిస్కరేజిగాళ్ల’వల్ల వచ్చే ప్రమాదాన్ని గురించి ఇందులో విశే్లషించారు.
పిల్లలు పాఠాలు చదివేటప్పుడు శ్రద్ధతో చదవాల్సిన అవసరాన్ని ‘ఇష్టమే ఏకాగ్రత’ వ్యాసంలో వివరించారు. ఇందులో పిల్లలకోసం ఇచ్చిన సూచనలు బాగున్నాయి.
ఏ విద్య కూడ తక్కువది కాదు- దేనికదే గొప్పది అని ‘చదువులమ్మ పండుగ’ వ్యాసంలో చెప్పిన సంగతి బాగా ఆలోచించతగ్గది. విజయదశమినాడు ఆయుధ పూజ కార్యక్రమం చెయ్యటంలోని అంతరార్ధాన్ని ఈ వ్యాసం బోధపరుస్తుంది.
వేలకువేలు ఫీజులుకట్టి పిల్లలను స్కూళ్లలో చేర్పించే అమ్మానాన్నలు, పిల్లలుపడే కష్టాలను గురించి ఆలోచించరు. తగిన కారణంలేకుండా పిల్లలను కొట్టే టీచర్లు చాలమంది ఉన్నారు. తన్నులు తిన్నట్లు పిల్లలు ఇంట్లో చెప్పుకోరు. చెప్పుకున్నట్లు తెలిస్తే టీచర్లు మళ్లీ తంతారు. ఇక పెద్ద క్లాసు పిల్లలకు ప్రాజెక్ట్‌వర్కు పేరుతో మరో పనికిమాలిన కార్యక్రమం. పిల్లల కష్టాలను తెలిపే ‘బాబోయ్ ప్రాజెక్ట్ వర్కులు’ వ్యాసం ఆలోచించ తగ్గది.
మిగతా వ్యాసాలలోనూ మంచి మంచి విషయాలు అనేకం ఉన్నాయి. పిల్లలకూ, పెద్దలకూ పనికొచ్చే పుస్తకం.

-ఎం.వి.శాస్ర్తీ