అక్షర

ముచ్చట గొలిపే ముప్ఫైఆరు కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమలతెలివి
వెల: రూ.60/-
ప్రతులకు:
నవ తెలంగాణ బుక్‌హౌస్, హైదరాబాద్

‘చీమల తెలివి’ చిన్నారి కథలు వివిధ రచయిత (త్రు)ల కథల సంకలనం. దీన్లో ముప్ఫైఆరు మంది రచయితల కథలున్నాయి. దేనికదే గొప్పగా వుంది. ఒక్కొక్క కథ ఎంతో వైవిధ్యంగా, హృద్యంగా, రమ్యంగా మనస్సుని రంజింపజేస్తూ సాగుతాయి. పిల్లలకి మంచి ఆలోచన కలిగించేలా చక్కని చిన్నచిన్న మాటలతో వాళ్లలో చదవాలనే ఆసక్తి కలిగించే ధోరణిలో వున్నాయి. మన దేశంలోనూ బాలసాహిత్యం విలువ పెరిగింది. అనేకమైన కథలు పిల్లలను ఆకట్టుకునే విధంగా రచనలొస్తున్నాయి. ‘చీమల తెలివి’, ‘ఉచిత సలహా’ పిల్లిఇక్కట్లు కథలు మార్గదర్శకమైన కథలుగా సాగితే, దెయ్యంకథ పిల్లల్లో భ్రాంతితో కలిగే భయాలను ఎలా తొలగించాలో పిల్లల్లో ముఖ్యంగా ఒంటరిగా పెరిగే పిల్లలో ఒంటరితనాన్ని ఎలా పోగొట్టాలో తెలిపే ‘తోడు’కథ... ఇలా దేనికదే ఎంతో ప్రయోజనాత్మకంగా నిలుస్తాయి. ఇంత మంచి కథాసంపుటిని పిల్లలకందించే ప్రయత్నం ‘నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్’చెయ్యడం ముదావహం. ప్రతీఒక్కరు ఈ కథల సంపుటినికొని పిల్లలచేత చదివించాలి.

- శారదా అశోకవర్థన్