అక్షర

కుమార సంభవం.. రసరమ్య కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమార సంభవం
(వచనకావ్యం)
ననె్నచోడుని పద్య కావ్యానికి
అనుసృజన
రచన: పింగళి వేంకట కృష్ణారావు మూల్యం: రూ. 120/-లు
ప్రతులకు
పింగళి వేంకట కృష్ణారావు
పి.వి.ఎస్. రామారావు
42-3-3 ఎ/2 రామకృష్ణాపురం,
2వ లైను, విజయవాడ-520003
ఫోన్: 0866-2533232
సెల్:9949138127
**
పరమేశ్వరుని కథలు బహుప్రీతిగా శివభక్తులు వింటుంటారు. శ్మశాన వాసి, బూడిద పూసుకుని తిరిగేవాడు, పుఱ్ఱెను భిక్షాపాత్రగా పట్టుకున్నవాడు, పులిచర్మాంబరధారి అయిన శివుణ్ణిమంగళకరుడు అని కీర్తిస్తారు. ఆయన ఆహార్యంలోను, ఆహారంలోను, వాచికంలోను అసలు ఆయన రూపమే పండితోత్తములకేకాక విరించి కూడా వర్ణించటం సాధ్యంకాదు. అట్లాంటి అర్ధనారీశ్వర స్వామి కుమారసంభవానికి నాంది పలికాడు అని కవిరాజ శిఖామణి నన్నచోడుడు రచించిన కుమారసంభవమను పద్య కావ్యాన్ని అలతి అలతి పదాలతో నడక తప్పకుండా మనోహరంగా రమ్యంగా కడు హృద్యంగా ఏకబిగిన చదివించే నేర్పున్న శైలిలో పింగళివేంకట కృష్ణారావుగారు ‘‘కుమార సంభవం’’ అన్న వచనకావ్యాన్ని అనుసృజన చేశారు. పింగళివారు సృజించిన కొత్తవంగడాలన్నీ కూడా ఎక్కడికక్కడ చిన్ని చిన్ని మార్పులలాగా కనిపించినా సందర్భానికి అతికినట్లుగా ఆనాటి కావ్యంకూడా నేటి కంప్యూటర్ యుగంలోను ఆనందించదగ్గ వచనరూపంలో సృజియించడం పాఠకులకు పీయూషాన్ని పిస్తాలతో అందించడమే. ఎందుకంటే కొత్త పదాలని కాక కాస్తకఠినంగా ఉన్న పదానికైనా విడవకుండా అర్థాలను ఇచ్చి, చదువరులకు కథాగమనంలో ఆటంకం లేకుండా చేశారు.
తెలుగు నుడికారాలు, సామెతలు, పదబంధాలను కూడా జోడిస్తూ ధరణీదేవి భర్తయైన దక్షునితో నాటి ఆడబిడ్డల సంసారాన్ని వర్ణించడంలో నేటి ఆడకూతుర్ల సంసారచిచ్చును ధ్వనింపచేశారు. అంతేకాక దక్షుడు కోపావేశంలో శివవర్ణన ఎంత ఆలోచనామృతాన్ని కురిపిస్తుందో అట్లానే భక్తావేశంతో దక్షుడు చేసిన ‘‘స్వామీ! కైలాస శిఖరాన ప్రదోష కాలంలో నీవు నాట్యం చేస్తుంటే, ఆకాశాన్ని ఆవరించిన ఎర్రని నీ జడలు, రాక్షసులను దహించే నీ మూడవ కంటి మంటల్లాగా భ్రమ కలిగిస్తాయి...’’(పేజి నెం.38) శివవర్ణన శివభక్తులకే కాక పాఠకజన మొత్తాన్ని శివప్రియులను చేస్తుంది. అట్లాంటిదే- మరుని ఆహ్వానించి ఇంద్రుడు మహేశ్వరునిలో మన్మథావేశం కలిగించమని చెప్తుంటే కందర్పుడు పలికిన పలుకులు తరువాతి కథలో పరమేశ్వరుని ఆగ్రహావేశంలో మన్మథుడు ఎందుకు మాడి మసియినైనాడో భావికథార్థసూచికగా కనిపిస్తుంది. ఇట్లా ప్రతి సంఘటననూ సందర్భోచితంగా రసరమ్యంగా వర్ణిస్తూ రచయిత పాఠకాదరణ కలిగించే ఆమోదయోగ్యమైన వర్ణనలు ఈ చిరుపొత్తంలో అనేకం కనిపిస్తాయ. అంతేకాక గణపతి దక్షుని దండించి ఈశ్వరుని దగ్గరకు తీసుకు రావడం, తారకశ్రీ కార్తికేయ వివాహం మార్గశిర శుద్ద పంచమి నాడు జరిపి, తిరిగి కుమార దేవసేనల పెళ్లి మార్గశిర శుద్దషష్ఠినాడు జరుపడం ఇట్లాంటి సంఘటనలకు ఉన్న ఆకారానికే సరికొత్తరూపునిస్తూ ‘‘కుమారసంభవం’’ అన్న వచనకావ్యాన్ని పింగళివేంకట కృష్ణారావు రచించారు.
***

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-రాయసం లక్ష్మి