అక్షర

అసలు అర్థాన్ని వివరించే పరిభాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాంత పరిభాష
- కుప్పా వెంకట కృష్ణమూర్తి,
పేజీలు: 360,
వెల: రూ.200/-
ఎమెస్కో ప్రచురణలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

ఏ శాస్త్రానికైనా దాని ప్రత్యేకమైన పరిభాష ఉంటుంది. సామాన్య శబ్దం చెప్పే అర్థం కంటె పరిభాష ఆయా శాస్త్రాలకు సంబంధించిన విశిష్టమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఆయా శాస్త్రాల పరిచయం లేకుండా ఆ పరిభాషను చూచి సామాన్య భాషగా భ్రమపడిన వారికి ఆ శబ్దము శాస్తమ్రు ఉద్దేశించిన అర్థాన్ని తెలియజేయలేదు. భారతీయ శాస్త్ర అధ్యయన సందర్భంలో ఆరంభంలో ఆ శాస్తప్రరిభాషను విశిష్టంగా నిర్వచించే ప్రయత్నం జరుగుతుంది. ఆ పరిభాష మార్గదర్శనం చేయగా దానిలోనికి సూటిగా ప్రవేశించి అర్థంచేసుకొనే అవకాశం అధ్యేతకు లభిస్తుంది. ఉదాహరణకు బాలవ్యాకరణంలో సంజ్ఞాపరిచ్ఛేదం- పరిభాషను నిర్వచించేందుకే వచ్చింది. అట్లాగే సంధి ప్రకరణం మొదట సంధిని నిర్వచించటం కూడా ఈ ఉద్దేశంతోనే చేయబడింది.
నా చిన్నతనంలో మా తాతగారి (కోవెల రంగాచార్యగారి) గ్రంథాలయంలో పరిభాషేందుశేఖరం అనే గ్రంథం ఉండేది. ఆనాడు ప్రాచ్య విద్యాధ్యయనంలో విద్యార్థులు ఆయాశాస్త్రాల ప్రాథమిక గ్రంథాలను అధ్యయనం చేసేందుకు పరిభాషతో పరిచయం పెంచుకోవడం నాకు గుర్తున్న విషయం.
సాధారణంగా అదృష్టం అన్న మాటకు లోకంలో కానరానిది అనే శబ్దార్థం. లక్కీ అనేది సిద్ధార్థము. కానీ మీమాంసాశాస్త్రంలో అదృష్ట శబ్దానికి మనం చేసిన కర్మకు ఫలాన్నిచ్చే విశిష్టమైన శక్తికి అదృష్టమని పేరు. ఇట్లాగే ప్రతి శాస్తప్రు సరిహద్దుల్లో శబ్దాలు విశిష్టమైన అర్థాన్ని సంక్రమింపజేస్తాయి.
మన కాలంలో విశిష్ట విద్వాంసులైన కుప్పా వెంకట కృష్ణమూర్తిగారు అద్వైత వేదాంత పరిభాషను వీలైనంత సరళమైన భాషలో మనకు అందజేయడానికి వేదాంత పరిభాష అనే ఈ గ్రంథాన్ని నిర్మించి అందించారు. ఈ గ్రంథంలో అనేకాంశాలు తర్కబద్ధంగా నిర్వచింపబడుతూ వచ్చాయి. ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనలో ఉన్న లోపాలను ఎన్ని వైపులనుండి ప్రశ్నించేందుకు ఆక్షేపించేందుకు వీలుంటుందో ఆ రకంగా ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబట్టుతూ, మళ్ళీ ప్రశ్నిస్తూ, మళ్ళీ సమాధానాలు రాబట్టుతూ చర్చకు అవకాశం లేని స్థితిదాకా సాగదీసి చివరికి ఒక నిశ్చయానికి చేరటం ఈ గ్రంథంలో అనుసరించిన పద్ధతి. భారతీయ శాస్తప్రరంపరలో మహాభాష్యము మొదలైన గ్రంథాలలో ఈ చర్చా పద్ధతిని అనుసరించి ప్రతివాదుల ఆక్షేపణలకు ఏ రకమైన అవకాశం ఇవ్వని పద్ధతిలో పూర్వపక్ష సిద్ధాంతాలు కొనసాగిస్తూ పోవడం జరుగుతుంది. ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యము ఇట్లా కొనసాగిన సిద్ధాంత స్థాపక గ్రంథమే. రామానుజుల శ్రీ్భష్యములో జిజ్ఞాసాధికరణము పూర్తయ్యేసరికి విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనకు సంబంధించిన ప్రతిపాదన లఘుపూర్వపక్షము లఘుసిద్ధాంతము, మహాపూర్వపక్షము మహాసిద్ధాంతము పూర్తిఅయ్యేసరికి అధ్యేతకు విశిష్టాద్వైత సిద్ధాంత నిర్ణయమే కాకుండా అద్వైత సిద్ధాంతంలోని వౌలికాంశాలు వాటికి ఖండన రూపంలో వెలువడిన సప్తవిధ అనుపపత్తులు విశదమవుతాయి.
ప్రస్తుత గ్రంథమైన ‘వేదాంత పరిభాష’లో కూడా 174 అంశాలు పూర్వపక్ష సిద్ధాంతాలతో క్షుణ్ణంగా చర్చించి సారమతులైన విద్వాంసులకు కానుకగా సమర్పించినారు కృష్ణమూర్తిగారు.
ఈ గ్రంథంలో ప్రత్యక్ష అనుమానం, ఉపమాన, ఆగమ, అర్ధాపత్తి, అనుపలబ్ధి, విషయ, ప్రయోజనములనే ఎనిమిది పరిచ్ఛేదాలలో అనేకాంశములు సునిశితంగా చర్చింపబడ్డాయి. ఈ అంశములన్నీ తెలుసుకున్నవారికి వేదాంత శాస్త్రంలోనికి రాజద్వారం నుండి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. వాదానికి ప్రధానమైన ఆధారం రెండు పక్షాలకు నడుమ సమాన ప్రమాణాలు ఉండటం- ఈ ప్రమాణాలు నిశ్చయింపబడితే వాదానికి దారి ఏర్పడుతుంది. సమానమైన ప్రమాణాలు లేనపుడు వాదానికి అవకాశమే ఉండదు. కొన్ని శాస్త్రాలు ప్రత్యక్ష, అనుమాన, ఉపమానాది ప్రమాణాలను అంగీకరిస్తే కొన్ని అంగీకరించవు. బౌద్ధ చార్వాకాది దర్శనాలకు జైమినీయ వైయాసిక దర్శనాలకు ఈ ప్రమాణ భేదం స్పష్టంగా శాస్త్రాల నడుమ చీలిక తెస్తుంది. వేదమును అంగీకరించుట, అంగీకరించకపోవుట అనే భేదం మీద ఆస్తిక నాస్తిక దర్శనాలు ఏర్పడుతున్నవి. అందువల్ల శాస్తవ్రాదానికి ప్రమాణ నిర్ణయం అత్యంతావశ్యకం. వెంకట కృష్ణమూర్తిగారు గ్రంథ రచనలో వ్యావహారిక భాషను ప్రయోగించినా చర్చలోని జటిలతవల్ల గ్రంథం శాస్తమ్రార్గంతో అంతో ఇంతో పరిచయంలేని వారికి సులభగ్రాహ్యం కాదు. గ్రంథం నిండా పారిభాషిక శబ్దాలు ప్రయోగింపబడటంవల్ల పాఠకుడు కొంత అధ్యయనాధికారాన్ని సంపాదించవలసి ఉంటుంది.
ఇంత కాలానికి తమ పితృపాదులైన శ్రీశ్రీశ్రీ జనార్థనానంద సరస్వతీస్వామి వారి అనుగ్రహంవల్ల ఈ గ్రంథాన్ని రచించిన, శాస్త్ధ్య్రాయనానికి ఎంతో ఉపకారం చేసిన కుప్పా వెంకట కృష్ణమూర్తిగారికి అభినందనలు.

-కోవెల సుప్రసన్నాచార్య