అక్షర

‘‘ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆచార్య కొండా
లక్ష్మణ్ బాపూజీ’’
సంపాదకుడు:
తడ్క యాదగిరి
వెల: రు.100/-
పేజీలు: 96
ప్రతులకు: సంఘమిత్ర
పబ్లికేషన్స్, హైదరాబాద్

నిజాం నిరంకుశ పాలననుండి విముక్తిపొందిన హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి చట్టసభలో అడుగుపెట్టిన తొలితరం నాయకుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక విప్లవ సేనానిగా, ప్రముఖ న్యాయవాదిగా వెలుగొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ పీడిత తాడిత బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికోసం చట్టసభల్లోనూ, వెలుపల న్యాయస్థానాల్లోనూ గొంతెత్తిన సామాజిక దార్శనికుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం తృణప్రాయంగా మంత్రి పదవిని త్యజించారు. పద్మశాలి కులభూషణుడిగా చేనేత కార్మికులలో చైతన్యం కలిగించి, ఎన్నో పోరాటాలు నడిపించి కులస్తుల్లో ఆర్థిక, రాజకీయ, విద్యావిషయాల్లో వికాసం కోసం ఎనె్నన్నో కార్యక్రమాలు చేపట్టిన సామాజిక చైతన్యం ఆయనది. కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన వ్యక్తిత్వం- రాజకీయ జీవితంలోని వివిధ పార్శ్వాలను పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో 18 మంది రచయితలతో వ్రాయించిన వ్యాస సంపుటి ఇది. సంపాదకుడిగా తడ్క యాదగిరి కృషి ప్రశంసనీయం.

-కె.