అక్షర

పోటీ పరీక్షలకు అగ్రశ్రేణి అక్షర వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పాఠ్యాంశాల్లో తెలంగాణీయతని అద్దవలసిన తరుణంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సమగ్ర విషయ పరిజ్ఞానంతోగల గ్రంథాలు లేని తరుణంలో నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నిరుద్యోగులకు, బాల బాలికలకు, అన్నిరకాల పోటీ పరీక్షలు రాసే వారికి ఉపయుక్త గ్రంథాన్ని వెలువరించారు. ఇది ప్రత్యేక శ్రద్ధతో నూతన సిలబస్‌తో రూపొందించింది. పోలీసు, జర్నలిజం- అన్ని విశ్వవిద్యాలయాల ఎన్‌ఇటి, ఎస్‌ఇటి, ఎం.ఎ.ఎంట్రన్స్, డి.ఎస్.సి., సివిల్ పరీక్షలకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏ ఉద్యోగానికైనా, దానికి సంబంధించిన ఏ పోటీపరీక్షకైనా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ‘‘తెలంగాణ చరిత్ర- సంస్కృతి- సాహిత్యం’’ అనే ఈ పుస్తకంలో పది అధ్యాయాలున్నాయి. పాల్కురికి సోమనాధుని నుండి ఆధునిక కవిత్వం దాకా సమగ్రంగా రచయితలు అందించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రాచీన సాహిత్యం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆధునిక సాహిత్యం, నవలా సాహిత్యం, కథాసాహిత్యం, జానపద సాహిత్యం, సాహిత్య విమర్శ, తెలంగాణ రచయితలు- రచయిత్రులు, తెలంగాణ సాహిత్యం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు- వాటికి ముందు వివరణాత్మక కథనం.
చుక్కా రామయ్యగారు అభినందనల్లో రాసినట్లుగా రష్యా గోర్కీని చూపిస్తే, తెలంగాణ యాదగిరిని, దాశరథిని, వట్టికోటల్ని చూపింది. ‘‘దునే్న వానికే భూమి’’ ఎన్నో దేశాలకు విప్లవాలకు ఊతమిచ్చింది. అక్షరం ముక్కరాని ఆడవాడు ఆనాటి ఉద్యమ పాటలు పాడుతూ నాట్లు వేశారు. ఒకవైపు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతూనే మరోవైపు పోరాటం చేశారు. ఇదే శ్రమజీవుల సాహిత్యం, సాన్నిహిత్యం, జానపద కళాసంపద. ‘‘పోటీ బరిలో గెలిచేదెలా?’’అంటూ చక్కటి విలువైన సందేశాత్మక పీఠిక రాశారు. బ్రతుకమ్మలో వాడే పువ్వు అంటే? తంగేడు అని రాయాలి అంటారు. అలాగే వారు సూచించినట్లుగా తెలంగాణ జానపద విజ్ఞానం, చిందు భాగోతం, ఒగ్గుకథ, మంద హెచ్చులు, కినె్నర వాద్యాలు, జాంబ పురాణం, సర్వాయి పాపన్న లాంటి చరితలు రేపటి తరానికి తెలియజెప్పాలి. అవే అంశాలు పాఠ్యాంశాలు- ప్రశ్నలు కావాలి.
సమగ్రత నుంచి సంక్షిప్తం: సంక్షిప్తత నుంచి సమగ్ర అధ్యయనానికి చేరడమే లక్ష్యం కావాలి.
విద్యా ఉద్యోగ రంగాల్ని గెలవడమేగాక, సామాజిక- సేవారంగాన్ని... నాటితరం పెద్దల త్యాగాలు.. అధ్యయనం ద్వారా ఉత్తమోత్తమ పౌరులుగా రాణింపు. ఇలాంటి గ్రంథాలు ఎంతైనా ఉపయోగం. పడాల వారి కృషి అభినందనీయం. హాలుని- గాథాసప్తశతి; గుణాఢ్యుని- బృహత్క్థ; సోమదేవ సూరి- కథా సరిత్సాగరం. దీన్ని ఆంగ్లంలో టోనీ అనువాదం- బాణబట్టు- వెబర్‌ల నుండి గద్దర్ దాకా సాహిత్య సంపదను పొందుపరచిన బృహత్తర రచన తెలంగాణ చరిత్రను అవగాహనకోసం అందించిన ‘నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్’ ప్రయత్నం ప్రశంసనీయం.

-తంగిరాల చక్రవర్తి