అక్షర

విద్యార్థులకు సన్మార్గం చూపే వ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థి వ్యాసాలు
-ఒంటెద్దు
రామలింగారెడ్డి
వెల: రు.100/-
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజయవాడ
మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు
***

రామలింగారెడ్డిగారి విద్యార్థి వ్యాసాలలో యాభై రెండు వ్యాసాలున్నాయి. విద్యార్థులకు పరీక్షల్లో సామాన్య వ్యాసం అనేది ఒక అంశంగా ఉంటుంది కాబట్టి సామాన్య వ్యాసాలు విద్యార్థులకు తప్పకుండా ఉపయోగపడతాయి. భావి భారత పౌరులైన విద్యార్థులకు ఉపయుక్తమయ్యే వ్యాసాలను రాయడాన్ని మహదావకాశంగా భావించి విద్యార్థులను దృష్టిలో వుంచుకుని చాలావరకు వాడుక భాషలో సులభశైలిలో వ్యాసాలను వ్రాసానని రచయిత తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలను, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కల్పించాలనే రచయిత ఉద్దేశం ప్రశంసనీయమైనది. అందుకు తగినట్టుగా కొన్ని వ్యాసాలు ఇందులో ఉన్నాయి. గ్రంథాలయాల గొప్పదనం, సెల్‌ఫోన్‌లు మితిమీరి వాడడంవలన కలిగే ఇబ్బందులు, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, పాఠశాల వార్షికోత్సవాలు, మాతృభాష ద్వారా విద్యాబోధనలోని సౌలభ్యం, అవినీతిని నిర్మూలించాలన్న ఆశయం, ఆరోగ్య పరిరక్షణ, ర్యాగింగ్, మంచి అలవాట్లు, సామెతలు-పొడుపు కథలు, మాటనేర్పు, సహనం, ఇంద్రియ నిగ్రహం మొదలైన వ్యాసాలు విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని, సందేశాన్ని అందించేవిగా ఉన్నాయి. స్వచ్ఛ్భారత్ పాటించడంతోపాటు స్వచ్ఛమైన విలువలను కూడా కాపాడుకోవాలి, కులవృత్తులను పరిరక్షించుకోవాలి. కవుల ప్రాంతమేదైనా వారిని మనం తెలుగువారమనే స్పృహను కలిగి గౌరవించాలి వంటి వాక్యాలు నీతిని బోధిస్తున్నాయి. వ్యాసం పూర్తయిన వెంటనే వ్యాసానికి సంబంధించిన విషయాలను సారాంశాన్ని పద్యరూపంలో రచించి అందించారు రచయిత. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడానికి విద్యార్థి వ్యాసాలు దోహదపడగలుగుతున్నాయన్న సదుద్దేశాన్ని రచయిత విజ్ఞప్తి ద్వారా తెలియజేసా రు. అయితే ఆ రకమైన ప్రయోజనం ఈ వ్యాసాల ద్వారా నెరవేరిందా అని పరిశీలించి చూస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పటి కాలంలో కొందరు గురువులు ఆ పదవికే గౌరవ భంగాన్ని కలిగిస్తున్న మాట వాస్తవమే. ఆ అవలక్షణాలను తొలగించుకోవాలన్న సూచనతో ఉత్తమ గురువు అనే వ్యాసం ఉంది. పత్రికలను గురించి వ్యాసంలో పత్రికలు పక్షపాత వైఖరిని అవలంబించడం తగదని,పత్రికలలో ప్రమాణాలు కొరవడుతున్నాయని తెలిపారు. ఇటువంటి విషయాలవల్ల విద్యార్థుల్లో వ్యతిరేక భావనలు కలిగేందుకు అవకాశముంది. భక్తి పత్రికలు, ఆరోగ్యానికి సంబం ధించిన పత్రికలలోని లోపాలను తెలిపారు. ఇదే పుస్తకంలో యోగాసనాలు, ప్రాణాయామం గురించి వాటివల్ల కలిగే సత్ఫలితాలను వివరించి వాటిని ఆచరించాలని తెలిపిన తరువాత చివరలో డాక్టర్లను సంప్రదించాల్సిందని చెప్పడాన్ని విమర్శించారు. నిజానికి ఏ రకమైన సాధనకైనా నిష్ణాతులైన వారి పర్యవేక్షణ లేదా సలహాలు, శిక్షణ అవసరమై వుంటాయి. వ్యాసాలలోని కొన్ని విషయాలను నిర్ధారించుకుని వ్రాసి ఉంటే బాగుండేది. నన్నయ రచన చాముండికా విలాసము అని ప్రాచుర్యం పొందింది. రచయిత వ్రాసిన దాన్ని బట్టి చౌడేశ్వరీ విలాసము అనే పాఠాంతరం కూడా ఉండి ఉండవచ్చు. సహజ పాండిత్యుడైన పోతనను గురించి చెబుతూ ‘ఏ మార్గంలో ఆయన అంతటి ప్రతిభా పాటవాలు సంపాదించాడో తెలియదు’, ‘తిక్కన కుటుంబ వివరాలు పెద్దగా తెలియరావడం లేద’న్నారు.‘సంక్రాంతి రోజున భీష్ముడు తనువు చాలించి పరమపద ప్రాప్తినందాడు’ ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని వాక్యాలు అర్ధవంతంగా లేవు. ‘రంజాన్ పండుగనాడు మహమ్మదీయుల ఇంట్లో జరిగే విందులకు ముస్లింలు వెళతారు’, ‘జూన్ రెండవ తేదీ 2014సం.ఆంధ్రప్రదేశ్‌నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 1956 నవంబర్ ఒకటికి పూర్వమున్న ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోయింది’. ఇటువంటి వాక్యాలన్నింటినీ సరిచేసి ఉండవలసింది.
కులము, మతము, పండుగలు, ఆచారాలు, శాస్ర్తియ దృక్పథం, ఉగాది, సంక్రాంతి మొదలైన అంశాలపై వ్యాసాలున్నాయి. ఇతర మతాలవారిని వ్యాసాలలో సోదరులంటూ చెప్పిన వ్యాసకర్త మతసహనం మెచ్చు కోదగినదే. కొన్ని వ్యాసాలలో పరిధులను దాటిన విమర్శలున్నాయి. ఒకటి రెండు చోట్ల విమర్శలుంటే సరిపెట్టుకోవచ్చు కానీ సందర్భాన్ని కల్పించి మరీ కొన్ని వర్గాల వారిని తీవ్రంగా విమర్శించారు రచయిత. ‘వేదాలలో చెప్పబడిన విషయాలను స్వార్ధపరులైన వారు తమకు అనుకూలంగా చేసుకున్నారు మిగతావారంతా తమ అధీనంలో ఉండాలనుకున్నారు’, ‘ఒక కులం వారు వేదాలను వెలుగు చూడనీయకుండా చేసి పుట్టుకయే గొప్పతనంగా చెలామణి అయినారు’, ‘దేవుడికి నైవేద్యం అవసరమా? అని ప్రశ్నించి అది ఎవరి కోసమో తెలిసిన పూజారులు అవసరమేనంటారు’ అని చెప్పి కించపరచడం తగినది కాదు, భక్తిపత్రికలు, పుణ్యతీర్ధాలు, స్నానాదికాలు, పిండప్రదానాలు వల్ల వచ్చే పుణ్యాలను ఏకరువు పెడతాయనడం సరికాదు. అర్చకులకు హారతిపళ్లెంలో పడే కాసులపైనే ధ్యాస ఉంటుందట. ఈ రకమైన అభిప్రాయాలతో వ్యాసకర్త వ్యాసాలు ఉన్నాయి. కొన్ని పొరపాటులు లేకుండా ఉన్నట్టయితే ఈ పుస్తకంవల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగేది.

-కె.ఎల్.ఎ.