అక్షర

అపూర్వ కవితలకు అద్భుత అనువాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవ్యయ
ఒరియా కవితలు:
మూలం: సౌభాగ్యకుమార్ మిశ్రా
పేజీలు: 164
వెల: రూ.60/-
ప్రతులకు: విశాలాంధ్ర,
నవచేతన,
నవోదయ పుస్తక కేంద్రాలు.

సుప్రసిద్ధ ఒరియా కవి సౌభాగ్యకుమార్ మిశ్రాగారితో వేలూరి వెంకటేశ్వరరావుగారిది దశాబ్దాలనాటి చెలిమి. కానీ వెంకటేశ్వరరావు వుద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సౌభాగ్య కుమార్‌మిశ్రాగారి పరిచయంవల్ల ఆయన ఒరియా కవితల్ని వెంకటేశ్వరరావుగారు ఆత్మీయంగా తెనుగు చేశారు. ఆ ప్రయత్నంలో వెనిగళ్ళ బాలకృష్ణారావుగారు సహకరించారు.
సౌభాగ్యకుమార్ మిశ్రాగారి కవితల్లో ప్రకృతి ప్రథమస్థానంలో వుంటుంది. రెండవ స్థానం ఆయన్లోని తాత్విక దృష్టి. జీవన దుఃఖపు జీర ప్రతి కవితలోనూ కనిపిస్తుంది. ఆయన భావుకత వాటన్నిట్నీ కవితామయం చేస్తూ అలరిస్తుంది.
ఎప్పుడయినా మనం అద్దం చూస్తాం. కానీ కవి చూస్తే వేరుగా వుంటుంది.
సుమారు రాత్రి పనె్నండున్నరకి/ అద్దంలో నేను నా నిజ ప్రతిబింబం చూస్తాను/ ఒక వేళ నేను హఠాత్తుగా బీటలు వారి ముక్కలు ముక్కలై పడిపోతే/ ఈ అద్దం కూడా బీటలువారి ముక్కలు ముక్కలై నలుపక్కలా
చిందర వందరగా పడుతుందా?’’ అంటూ మార్మికంగా చెబుతారు. మనం అనుక్షణం మారుతూ వుంటాం. యవ్వనంలోని అందం మధ్యవయసు వచ్చేసరికి మాయమవుతుంది. చివరికి మనం అదృశ్యమవుతుంది. మనల్ని ప్రతిబింబించే అద్దానికీ అదే పరిస్థితి వస్తుందా? అని కవి ఆలోచనలో పడతాడు.
కొండ గురించి ఆయన చిత్రమైన కవిత రాశాడు.
నేను మహమ్మద్‌లాగా కొండ దగ్గరికి పోలేదు.
నేను కొండని రమ్మని పిలవలేదు. నా గది తలుపు తెరిచి వుందని తానే దూసుకుని వచ్చింది. సాయంత్రం ఆకాశం మీదుగా దిగి వచ్చి నందివర్ధనం చెట్టుపక్క నించి మా యింటి గుమ్మంకేసి తిరిగింది’. ఆయనకు అన్నీ ఆశ్చర్యమే. ఉదయాస్తమయాలు, రాత్రి నక్షత్రాలు, పచ్చటి చెట్లు, రాలే ఆకులు కంటి చూపులు, కన్నీళ్ళు, నవ్వులు అన్నీ ఆశ్చర్యమే. ఆ ఆశ్చర్యంలో దిగులు తెరవుంది. ఇంత అందమైన అనుభవాలు భూమిలో యింకిన చినుకుల్లా అదృశ్యమవుతాయే అన్న బాధ వుంది.

-సౌభాగ్య