అక్షరాలోచన

అంతిమ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆలోచన
నాలో ఓ తీర్పు!
సుదూరపు అలల పోట్లు మధ్య ప్రయాణం
చేసిన నన్ను లాగి
ఒడ్డున పడేసింది
ఈ ఆలోచన నాలో
ఓదార్పు!
దుఃఖసాగరం మధ్య వెలువెత్తే కన్నీటి
కడలిని రెప్పలమాటున పొదివిగా దాచుకుని
పైకి స్థిరంగా నిలదొక్కుకునే
మనోస్థయిర్యం ఇచ్చింది
ఈ ఆలోచన నాలో మార్పు!
దుర్మార్గపు చేష్టలుడిగి అనేకానేక చర్యలతో
క్రూరమృగంలా విర్రవీగుతున్న నాకు
ఓ విపత్కర సందర్భం ఎదురుపడితే,
నాలో వ్యక్తిని తీసింది
నన్నో మనిషిని చేసింది
ఈ ఒక్క ఆలోచనే అంతిమంగా
వివిధ కోణాల్లో స్పృశిస్తూ నన్నో
గెలుపు బాటలో నిలుచోబెట్టింది
నాకో కొత్త జీవితం ఇచ్చింది!!
*

-శ్రీశైలపు రామకృష్ణ 9704558263