అక్షర

ఒంటిమిట్ట ఆలయ వైభవం ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట రాముడు
కోదండరాముడు
- అలపర్తి పిచ్చయ్యచౌదరి
వెల: రూ.అమూల్యం
ప్రతులకు: రచయిత, జాయింటు సెక్రటరీ, రిటైర్డు
ఇంటర్ విద్యామండలి
- ఆంధ్రప్రదేశ్
42/169; జయనగర్ కాలనీ, కడప- 516002.

శ్రీరాముడు జగదభిరాముడు- ఒంటిమిట్ట రాముడు కోదండరాముడు అనే పుస్తకాన్ని అలపర్తి పిచ్చయ్య చౌదరిగారు రచించారు. రామాయణం గురించి, రాముని గురించి ఎంత విన్నా, ఎంత వ్రాసినా, ఎంత చదివినా ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయనిపిస్తుంది. అదే రామాయణ మహాత్మ్యం. రాముడు జగదభిరాముడు అనే అంశంలో రామాయణం గొప్పదనం, రాముని గుణగణాలు వివరింపబడినాయి. రామాయణం వినడానికే కాదు నిత్యజీవితాన్ని సంస్కరించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎలా బ్రతకాలో రామాయణం నేర్పుతుంది అని చెప్పి రచయిత నిత్యజీవితంలో రామాయణంలో సంఘటనలను, పాత్రలను ఎలా అన్వయించుకోవాలో సూచించారు. భార్యను ఎలా చూసుకోవాలో రామాయణం నేర్పుతుంది. తమ్ముళ్ళనెలా వాత్సల్యంగా చూసుకోవాలో నేర్పుతుంది. పెద్దల పట్ల మెలగాల్సిన విధానాల్ని నేర్పిస్తుంది. రామ రాజ్యం, రాజధర్మం, రాజనీతి, రామనామ వైశిష్ట్యం మొదలైన అంశాలు విశే్లషింపబడినాయి. ఒంటిమిట్ట శ్రీరాముని కథ విపులంగా వుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయం అతి ప్రాచీనమైనది. ఇది ఏకశిలా నగరంగా పిలువబడుతోంది. ఈ దేవాలయంలో ఒకే శిలలో రాముడు, లక్ష్మణుడు, సీత సాక్షాత్కరిస్తారు. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. రచయిత ఈ ఆలయ చరిత్రను, ఆలయ విశేషాలను, శిల్పకళావైభవాన్ని వివరించారు. శేషాచల మధ్యభాగంలో దండకారణ్య క్షేత్రం ఒంటిమిట్ట వుంది. రాముడు నడయాడిన పరమ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఒంటుడు, మిట్టడు అనే బోయలు కోదండ రామాలయాన్ని కట్టించమని రాజును కోరుకున్నారు. వారి కోరికపైన ఈ ఆలయం వెలసింది. రెండవ అయోధ్యగా ప్రసిద్ధిని పొం దింది. ఆంధ్ర ప్రాంతంలో భద్రాచలంగా భాసిల్లుతోంది. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, సీతారాముల కల్యాణం, ఒకప్పటి ఏకశిలా నగరంగా వెలుగొందిన తీరు, ఆలయ విశేషాలు, ప్రస్తుతం శిథిలమవుతున్న శిల్ప సంపద, ఆ ప్రాంతంలో మరికొన్ని విషయాలు రచయిత ప్రస్తావించారు. శృంగి శైలం మొదలైన ప్రాంతాలను, చుట్టుపట్లగల ప్రాంతాలను తెలిపారు. ఒంటిమిట్టలో శ్రీరాముని కల్యాణం రాత్రిపూట జరపడానికి గల కారణాలను తెలిపారు. ఆలయ అభివృద్ధి విశేషాలను చర్చించారు. ఎందరో భక్తులు, కవులు రాముని అనుగ్రహానికి పాత్రులైనారు. పోతన, వావిలికొలను సుబ్బారావుగారు, అయ్యలరాజు రామభద్రుడు, తిప్పకవి, ఇమాం బేగ్ వంటివారు ఈ ప్రాంతంలో నివసించారు. వారి వివరాలను కూడా రచయిత అందించారు. ఒంటిమిట్టలోగల కైఫియత్తులు, శాసనాలు, ఒంటిమిట్ట పద ఆవిర్భావాలను పేర్కొన్నారు. రామనామ విశేషాలు, రామకోటి మహాత్మ్యం, భజన బృందాలను తెలుపుతూ అక్కడ సేవలందించే వారి పరిచయాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఒంటిమిట్ట రాముని సేవిస్తూ తరిస్తున్న భక్తులను గురించి రచించారు. స్వామివారి కళ్యాణం ముత్యాల తలంబ్రాలతో అధికార లాంఛనాలతో జరిగే విధానం కొనసాగాలని, దేవాలయం మరింత పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. మొల్ల, తులసీదాసు, వివేకానందుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, చాగంటి కోటేశ్వరరావుగారలు చెప్పిన రామసంబంధ వాక్యాలను కొన్నింటిని అందించారు. ఈ ప్రకారంగా ఈ పుస్తకం ద్వారా రాముని గుణగణాలు లోకానికి మరోసారి వెల్లడికావడంతోపాటు ఒంటిమిట్ట రామాలయ స్థలవైశిష్ట్యం కూడా తెలుసుకునేందుకు అవకాశమేర్పడుతోంది.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ