అక్షర

పసిపాపల భాషా జ్ఞానపు తొలిమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండువెనె్నల
నవతరంతో యువతరం
కతలు, కవిత్వాలు,
అనుభవాలు
వెల: రూ.100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

చిట్టిపొట్టి చిన్నారుల చిలుక పలుకులు ముద్దు ముద్దుగా వుంటూ అందరినీ అలరిస్తాయి. ఆ పలుకులలో ఉన్నతమైన, నిర్దోషమైన జ్ఞానం వుండడం గమనార్హం. వారిలోవుండే జ్ఞానానికి భాషని జోడించి ప్రకటిస్తున్నప్పుడు ఆ భావ వ్యక్తీకరణ అమోఘమైన కవిత్వంగా అవతరించవచ్చు.
విరిసిన వెనె్నల పూసిన వసంతంలో కోకిల పిలుపులా హృదయాన్ని తెల్లనిదో, చల్లనిదో ఏదో తెలియని శాంతి గలిగింతలు పెట్టి సమ్మోహితుల్ని చేస్తుంది. పుట్టింది మొదలు చివరిదాకా సాగే జీవితాన్ని అర్ధం చేసుకునే దిశగా సాగే అనే్వషణలో చిన్ని కవుల కవిత్వ ధ్వనులు వెల్లువగా వినీలాకాశంనుంచి మెరుస్తుంటే ధారలై కురుస్తుంటే కళ్లు విప్పార్చి చూస్తూ అమితానందంతో ఆస్వాదించడం ఇక పాఠకుల పని.
‘నవతరంతో యువతరం’ అన్న పేరుతో వెలువడిన ఈ పుస్తకానికి సందాదకులు డా.కె.ఎన్.మల్లీశ్వరి, కె.పద్మ, నిశాంత్‌గార్లు. పిల్లల కవితల్ని వారి అనుభవాల్ని, కథల్ని ఉటంకిస్తూ రాబోయే మణిదీపాలుగా అభివర్ణించారు వీరు. నిజానికి లోపలికి తొంగి చూసి చదివితే ఆ పదాల సొగసు, అర్ధం, భావావేశం, సమాజం పట్ల బాధ్యత వహించాలనే పిల్లల దూరదృష్టి అభినందనీయం అనేది చాలా చిన్నమాట. ఇక్కడ విశేషంగా చెప్పాల్సిన సంగతి ఎందరో యువ రచయితలు, రచయిత్రులు కలిసికట్టుగా వివిధ రాష్ట్రాలనుంచి వచ్చి ఈ చిన్నారులను ప్రగతిపథం వైపు, సమాజంలో జరుగుతున్న విషయాలవైపు తీసుకెళ్లి వారిలోని ప్రతిభాపాటవాల్ని వెలికి తీసే వర్క్‌షాప్ నిర్వహించడం ముదావహం. కలం పట్టాల్సిన పరిస్థితులున్నాయని తట్టి చెప్పడం, వివరించడం గొప్ప విషయం. ఈ సంపుటిలో ఈ యువరచయితల మనోభావాలు కూడా పొందుపరచబడ్డాయి. ఇంక ఈ బుడుగులు ఏమంటున్నారో చూద్దామా!
అరుకులోయ అందాలకంటే అక్కడ నివసించే అమాయక గిరిజనుల సంపద చాలాభాగం పట్టణాల కోసం తరలి వెళ్లిపోతోంది. కానీ వారి సమస్యల్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ‘మళ్ల పృధ్వి’ తన రాతలో విచారాన్ని వ్యక్తం చేస్తాడు.
స్నేహపరిమళం ఎంత తియ్యనిదో..స్నేహంలో ఒకరికొకరు ఏమవుతారో’ కొన్ని కేరింతలు..కాసిని కన్నీళ్లు’ అనే బహుచక్కని టైటిల్ పెట్టిన మహాలక్ష్మీ..
‘ప్రతి పోట్లాట చివరా మనస్నేహం ఎంతో ఎత్తుకు ఎదిగింది/నీ స్నేహం నాకొక విజయతీరం/నా స్నేహం నీకొక కళల హారం/జీవితమంతా ఉల్లాసకర క్షణాలని ఇస్తానని/వాగ్దానం చేస్తున్నాను..అంటుంది.
శ్రీనిహిత ‘పుస్తకాలు వౌనంగా, స్థిమితంగా మనతోనే ఉంటాయి. ఉపాధ్యాయులకన్నా, సహనంగా మనకి బోధిస్తాయి. అటువంటి పుస్తకాలు రాసిన రచయితలతో తాము గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనివి అనడం ఒక గొప్ప సంగతి. పుస్తక పఠనం విజ్ఞానాన్ని పంచి ఆలోచనా సరళికి పదును పెడుతుంది. భవిష్యత్తుకి బాటలు వేస్తుంది అని తెలుసుకుంటూ తన శీర్షికకి ‘కొండమీద పాలరాళ్లు’ అనే టైటిల్ పెట్టడం హాయిగా తోస్తుంది.
అభినయ్ తానో ‘రైజింగ్ స్టార్’గా ‘ నా తొలి అడుగు/ఎంతో చల్లని అమ్మఒడి. నా మలి అడుగు/ప్రయత్నించి అందుకునే నాన్న చెయ్యి. తర్వాత పాఠాలెన్నో నేర్పే చక్కని బడి/అక్కడినుంచి పరుగులిడతా. వెలుగులీనే రేపటిలోకి/రేపటిలోని ఎదిగే తారను నేనే! అన్నాడు హైస్కూలు ఆరంభభించిన ఈ పిల్లవాడు.
యువతరం ‘రెండు గంటలపాటు రెక్కలొస్తే’ అనే అంశాన్ని నవతరానికి ఇచ్చినప్పుడు ‘కనిష్క’ అనే అమ్మాయి తన ఆలోచనలని రాస్తూ ‘వికలాంగులైన చిన్న పిల్లలకి బాల్యంలో వారు చూడలేకపోయిన ప్రకృతి అందాలను నా రెక్కలతో తిప్పి చూపిస్తాను’ అంటూ తనలోగల మానవత్వాన్ని వెలికి తీసి రాయడం ఆశ్చర్యపడాల్సిన విషయమే!
సాహిత్యం అనే నది సంద్రంలో ఒంటరిగా వదిలివేయబబడి వుండగ నవతరంతో యువతరం తీరం వలె కనబడి సాహిత్యంపట్ల మాకున్న భయాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యువతరంతో మేము గిరిజనుల గ్రామాల్ని, వారి జీవన పోరాటాల్ని చూసాం. ఇంకా మేము రాయడం కొత్త జీవితానికి ఆరంభం’ అంది మహాలక్ష్మి.
ప్రకృతి అంత అందమైనదని మరొకటి లేదు/దాని విధ్వంసం వంటి విపత్తు ఇంకొకటి లేదు అంది మన్విత.
‘అనే్న నేర్చుకున్నాను/తను లేకుండా ఎలా బతకాలో తప్ప. అందర్నీ ప్రేమిస్తాను/ప్రేమించడం ఎలాగో నేర్పింది కనుక. నేనెంతో కుంగిపోతాను/ఆమె నలత చెందినట్లయితే. తొమ్మిది నెలలు గర్భంలోను/మూడేళ్లు సందిటిలోను/జీవితాంతం తన హృదయంలోను మోస్తుంది...అని చెప్పడం...ఆ లోచూపు అత్యద్భుమైన విశేషం. అలాగే కవిత్వం మనసు, భాషల కలయిక’ అంటాడు దివాకర్.
‘పుట్టుక నిజం/చావు నిజం/ మధ్యలో బతకడమే కష్టం. మనిషిగా బతకడం మరీ కష్టం. అంటూ తన కవితలో అప్పటి అన్యాయాల అక్రమాల విషయాలపై విచారిస్తూ ‘ప్రకృతి రచయిత’ అనే శీర్షిక ద్వారా నిజాలను ప్రశ్నించిన సోనా-శాంతి రచన చదువదగినది.
‘తెల్లకాగితం’ చిట్టి కవితలో ఆకాశాన్ని మన ముందు నిలుపుతుంది/ ఆ ఆకాశం మీద కవిత్వం రాస్తాను, మబ్బుల మీద బొమ్మలు గీస్తాను/ తెల్లకాగితం మీద ఎగిరే పక్షుల్ని చూస్తాను...అన్న సత్యం మాటలు నిజమవాలి. నవతరంతో ఈ యువతరంలో అన్నీ చదవదగినవే..పుస్తకమంతా ‘పండు వెనె్నల’

-బులుసు సరోజనీదేవి