అక్షర

దాట్ల కవితా శిల్ప రీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాత్విక భావాల
సౌందర్య శిల్పి
దాట్ల దేవదానంరాజు
-సౌభాగ్య
వెల: రూ.60/-
ప్రతులకు: రచయిత
8-1-048, జక్రియానగర్
యానాం- 5334641
**
‘నాకు నచ్చిన పుస్తకంలో ఏ పుటనైనా అభిమానంగా స్పర్శిస్తాను. నా పొలం చెక్కల ఏ పచ్చటి తీగనైనా ఆప్యాయంగా ఒంటికి చుట్టుకుంటాను. నా దాహపు ఎడారిలో ఏ దోసిలి కన్నీళ్లనైనా మొత్తం నదిగా చేస్తాను. నా అక్షరాల గవాక్షంలో ఏ అనుభూతులనైనా కవిత్వంగా రాల్చుకొని పరవశిస్తాను.’
అనే మంచి కవి దాట్ల దేవదానంరాజు. వీరి కవిత్వంపై సౌభాగ్య విశే్లషిస్తూ రాసిన విమర్శ గ్రంథమిది. సౌభాగ్య కవి, అనువాదకులు, తాత్వికులు. అందువల్ల ఇందులో దాట్ల కవిత్వపు నాడిని పట్టుకోగలిగారు. రూపకశిల్పి, పసితనం పల్లవించే కవి, మంటలో మాధుర్యం, మరణశాసనం, ఒక నీటి పాట, దిగులు సుందరి వంటి ఇరవై ఐదు అంశాలతో వివేచన చేశారు. కవిత్వం వస్తు శిల్పంతో కూడుకొని ఉండటాన్ని సౌభాగ్య వెల్లడించారు. శబ్ద శిల్పం జోలికి అంతగా వెళ్లలేదు. దాట్ల వారికి- ‘కవిత్వం ఒక తపస్సు - కవిత్వం ఒక దీప స్తంభం’ అన్నది నిజమే. ఈ యానాం కవి, సాహిత్యలో నిరంతర యానం చేస్తూనే ఉన్నారు. సౌభాగ్య వంటి విమర్శకుడి వల్ల దాట్ల కవిత్వంలోని విశేషాలు కొన్ని వెల్లడి అయ్యాయి. తన కవిత్వంపై తాను జీవించి ఉండగానే పుస్తకం వెలువడటం అదృష్టమే. సౌభాగ్య ఈ పంథాను కొనసాగించడం సాహిత్య సేవ అవుతుంది.