అక్షర

మైమరపించే మట్టి వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనగర్ర (కవితా సంకలనం)
సంపాదకులు:
కొండి మల్లారెడ్డి,
మహమూద్‌పాషా,
పేజీలు: 114,
వెల: రూ.100/-
ప్రతులకు: 9441905525
**
మెతుకు సీమగా పేరొందిన మెదక్ ప్రాంతం కవులదంతా ఒకే ఆలాపన, ఒకే ఆరాటం. అక్షర ధూళిలో ఒకటే మట్టివాసన. కవులందరూ ఒక సైన్యంగా తమ ఊరిని, ఆ మట్టిని, అక్కడి మనిషిని జెండాగా చేసుకొని చేస్తున్న కవాతు వీరి కవిత్వం.
నేలదంతా ఒకటే రూపు, కష్టాల్లోనూ సారూప్యం, కవులను ఒక కుటుంబంగా మార్చింది. గొంతు బృంద గానమైంది. తెలంగాణ కష్టాలు పాలమూరు, మెదకులతోనే మొదలవుతాయి. కృష్ణా, మంజీరాలు బాహువుల్లా ఉన్నా అవి ఈ సీనలో శక్తిహీనులవుతాయి. లోకం తెలిసిన కవులు, కళాకారులు, రచయితలు తమ కష్టాలకు కంజెరలవుతారు. కవి-కష్టజీవి బతుకుకు రెండు ముఖాలని ఋజువుచేస్తారు. మెదకుకు చినుకు కొరత ఉన్నా అక్షర సేద్యం మాత్రం ముక్కారు పంటలే. మంచి రచయితల మాగాణి మెతుకు సీమ.
అన్ని కాలాలూ విరబూసే రీతిలో ఉద్యమానంతరం కూడా అక్కడి పరిస్థితులను వివరిస్తూ కొత్తలో ఉన్న మంచీచెడులను మాయమర్మం లేకుండా తమ బాధ్యతను కొనసాగించారు.
‘ఎనగర్ర’ ఓ ఆశావహ కవిత్వం, బాధలు బాపే రోజులు వచ్చాయని, బహుపరాక్ సుమా అని హెచ్చరించే కవిత్వం. దాదాపు యాభై మంది కవులు తమ ధీమాను, నమ్మకాన్ని వమ్ముకాకుండా తొలి కోడిలా ప్రజల్ని జాగృతిచేసే కవిత్వం ఇందులో పొందుపరచారు.
రైతు బాధల్ని ఎనగర్రగా చేసుకున్న అల్లుకున్న ఈ కవిత్వ పొదరిల్లులో వస్తువైవిధ్య బదనికలు కూడా ఉన్నాయి. కవుల్లో స్థారుూభేదాలు, అవగాహనా తారతమ్యాలు, కవిత్వీకరణలో భిన్న తరగతులు ఉన్నా అందరిదీ ఒకే పాఠశాల, జిల్లాయే వారి కేంద్రబిందువు.
ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు ‘తడిమడి’లో జాగ్రత్తలు చెబుతాడు. ‘సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఫలితం/ అవహేళన కాకూడదు/ చెమటోడ్చి కష్టపడ్డ శ్రమ నెర్రలు పడకూడదు; ‘చెట్టుకింద నిల్చున్న వాటికి/ కాయోపండో రాలుతున్నదన్న ఆశ/ ఆశ ఉండాలి/ ఆశ పడాలి’ అంటూ ఆశను ఓ హక్కుగా ప్రకటించారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జాతుల్లోంచి వచ్చిన కవులకు ఈ సందేహాలు వెంటాడుతున్నట్లు వారి రచనలే చెబుతున్నాయి.
రైతు కష్టాలను కంటికి ధారగా పలవరించే కవి కొండి మల్లారెడ్డి. అటు ప్రభుత్వం నడకను, ఇటు రైతు కష్టాల పీడను కనిపెడుతూ ‘నాగలి కర్రుమీద..’ కవిత రాశాడు. ‘గొంతు పెగలని రాజ్యం/ పరిహారాల/ పరిహాస పథక రచన చేస్తూ/మృత్యువుకు/ కొత్తదారులు తెరుస్తుంది’ అంటూ దుష్ఫలితాల్ని ఎత్తిచూపుతాడు.
మట్టికి రైతుకున్న ‘అనుబంధం’ పర్కపెల్లి యాదగిరి అక్షరాలు దృశ్యమానం చేస్తాయి. ‘కాలం కానిదైనప్పుడు/ భృకుటి ఏరుల్లోపారే సేద్యమో/ అశృనదులతోనో నారుమడిని/ పచ్చదనంతోనో పరిఢవిల్ల జేస్తానని/ ధీమా పడుతుంటాడు’ రైతంటూ తన కావ్య ప్రతిభను జోడించాడు.
కుమ్మరి బిక్షపతి ‘’కృషీవలుడు’లో అంతిమవాక్యంగా ‘విత్తనంపై పెత్తనం... రైతుకే ఉండాలి’ అంటూ మార్కెటు రహస్యం విప్పుతాడు. తాటి కిషన్ ‘రైతు వలపోత’ను ‘స్వేదం ఆవిరై వెలుగుతుంది మిద్దెమీది దీపంలో’ అని ముగిస్తాడు.

-బి.ఎన్.