అక్షర

అర్చన (నవల)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్చన (నవల)
అత్తలూరి విజయలక్ష్మి
వెల: రు.200/-
ప్రతులకు: తెలుగు బుక్‌హౌస్
నవోదయా బుక్‌హౌస్
కాచిగూడ,
హైద్రాబాద్
**
‘కౌముది’ వెబ్ మాసపత్రికలో ఈ నవల రెండేళ్లపాటు సీరియల్‌గా వచ్చిందనీ, పాఠకులు ఎంతో ఉత్కంఠతతో చదివారనీ ప్రచురణకర్తలు తెలిపారు.
నవల ప్రారంభం: ఒక పల్లెటూళ్లోని గుళ్లో పూజారిగా ఉంటాడు కృష్ణస్వామి. ఆయన భార్య తాయారమ్మ. బాగా చదువుకొని, ఉద్యోగం చేస్తూ పట్నంలో ఉంటాడు వాళ్ల కుమారుడు వేణు.
ఇంట్లో పెద్దవాళ్లిద్దరికీ తోడుగా వాళ్లు చేరదీసి పెంచిన నీలవేణి అనే అమ్మాయి ఉంటుంది.
అర్చన అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకొని, స్వగ్రామానికి తెస్తాడు వేణు. అమ్మానాన్నలకు కోడల్ని చూపిస్తాడు. కొన్నాళ్ల తర్వాత భార్యతో పట్నం వెళ్తాడు.
కొంతకాలం తర్వాత తెల్లవారుజామున బస్సుదిగిన అర్చన, చేతుల్లో ఉన్న కొడుకును గుడి మెట్లమీద పడుకోబెట్టి, అక్కడ ఒక ఉత్తరం పెట్టి వెళ్తుంది. ఆ ఉత్తరం కృష్ణస్వామి పేరుతో ఉంది. అందులో ‘ఈ పిల్లవాడు మీ మనవడు. వీడిని మీరే పెంచండి’ అని రాస్తుంది. ఇక్కడినుంచి కథలో అనేక మలుపులు. అర్చనకు సమస్యలు మొదలవుతాయి. ధైర్యంగా సమస్యలన్నిటినీ ఎదుర్కొని చివరకు జిల్లా కలెక్టరవుతుంది అర్చన. నవలలు రాయటంలో రచయిత్రికి విశేషమైన అనుభవం ఉన్నందువల్ల శైలి బాగుంది.

-ఎం.వి.శాస్ర్తీ