అక్షర

ప్రయత్నం మంచిదే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ బుద్ధుని జాతక కథలు:
రచన- సేకరణ కావూరి శ్రీనివాస్
ప్రచురణ:తెలంగాణ రాష్ట్ర పర్యాటకశాఖ, హైదరాబాద్
పేజీలు: 90;
వెల: రూ.100/-
**
బుద్ధుని జాతక కథలు అయిదువందలకు పైబడి ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్న కథలు. కొన్ని మాత్రం మరీ విస్తారంగా సాగేవి కూడా ఉన్నాయి. మొత్తం కథలు తెలుగులో చాలాసార్లు వచ్చినట్టుగా చెపుతారు. కానీ అవేవీ అంగళ్లలో కనిపించవు. ఒకప్పుడు వారపత్రికలో ఒక పేజీ కార్టూన్ కథలుగా జాతక కథలు వచ్చాయి. తెలంగాణ పర్యాటకశాఖలో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే పండితుడు ప్రస్తుతం 41 కథలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు అందించారు. పుస్తకాన్ని ఆ శాఖవారే ప్రచురించడం గుర్తించవలసిన విషయం.
జాతక కథలు అంటే గౌతమబుద్ధుడు గతంలో రకరకాల రూపాలలో పుట్టిన సందర్భాల గురించిన వివరణలు. అటువంటి కథలలో కొన్నింటిని ఎంచుకుని రాసే ప్రయత్నం చేశారు శ్రీనివాస్. ప్రతి కథకు ఒక శిల్పం బొమ్మ పూర్తి పేజీలో ఉంది. ఇది పర్యాటక శాఖవారికి వచ్చిన ఆలోచన అయ్యుండాలి. శిల్పులు అని నలుగురి పేర్లుకూడా యిచ్చారు. కానీ, ఈ శిల్పాలు ఎక్కడివి అనే సమాచారం ఇవ్వలేదు. ఒక కథను నమూనాగా గమనిస్తే సంగతి బయటపడుతుంది. గతంలో జాతక కథలన్నీ, బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఫలానాగా ఫలానాచోట పుట్టాడు, అని మొదలయినట్లు అందరికీ తెలుసు. వనరింద జాతకం అనే కథలో ‘రాజు బ్రహ్మదత్త, కాశీని పరిపాలిస్తున్న రోజుల్లో బోధిసత్త్వుడు(తవత్తు) ఒక కోతి వంటి జీవితం వచ్చింది! అన్నది మొదటి వాక్యం. ఇంగ్లీషు వాక్యం వినిపించే ఉంటుంది వెనుక నుండి! పన్నింది, పెరిగింది అంటూ మామూలుగా కథ సాగి (్ఫల్‌స్టాప్‌లు లేకుండా) సగం పేజీతో ముగుస్తుంది. తరువాతి కథలు మాత్రం విఫలులైరి, పాటించు చుండెను లాంటి మాటలుంటాయి. అగ్నిహోత్ర కావ్యము, మూడూ కలిసి ఒకే మాట కదా కాదా? కాదేమో? పండితులను అడగాలి! శిల ఫలకమా? శిలాఫలకమా? పుస్తకమంతా ఉండగా, చేయగా అంటూ వాక్యాలు.
మంచి పని చేయాలన్న ప్రయత్నంలో, పెద్దల సాయంకూడా తీసుకుంటే బాగుంటుంది!

-డి.స్వాతి