అక్షర

చిన్నారులు మెచ్చే చక్కటి పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్చి పుల్లయ్య
-లియోటాల్‌స్టాయ్
అనువాదం: కె.సురేష్,
పేజీలు: 50,
వెల: రూ.30/-
ప్రచురణ:
మంచి పుస్తకం,
తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 9490746614
***
ప్రసిద్ధ రష్యన్ రచయిత పేరు చెప్పగానే, వార్ అండ్ పీస్, అనాకెరివినా లాంటి రచనలు గుర్తుకువస్తాయి. ఆ రచయిత బాలసాహిత్యం రాశాడంటే ఆశ్చర్యం. ఈ 50 పేజీల రచనను ఆయన 1886లో వెలువరించాడు. అతను యిటువంటి రచనలు చేయడం గురించి అప్పట్లో, ఆ తరువాత పెద్ద చర్చ జరిగింది.
పిచ్చి పుల్లయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు కూడా ఉంటారు. అనువాదంలో అసలు పేర్లను వదిలి వీళ్లకంతా తెలుగు పేర్లుపెట్టారు. పుల్లయ్య నిజంగా అమాయకుడు. అందిన దానితో సంతృప్తి చెంది, కష్టపడి బతుకుతాడు. ఒక తమ్ముడు సైనికుడు. మరొకడు వ్యాపారి. అప్పట్లో యుద్ధాలు, డబ్బుపిచ్చి మంచివికావని చెప్పడానికి టాల్‌స్టాయ్ ఇటువంటి కథలు రాశాడని కొందరు అన్నారు. అది నిజం కూడా. కథలో మనుషులను కష్టపెట్టే దయ్యాలు, పిశాచాలు కూడా ఉంటాయి. పిల్లలు యింకా, ఈ రకం కథలనే ఇష్టపడుతున్నారా? అన్నది ప్రశ్న. పిశాచాలు లేవని చెప్పవలసిన కాలమిది. ఈ పుస్తకంలో బొమ్మలుకూడా ఉన్నాయి. వాటిల్లో దయ్యం, పిశాచాలు కూడా కనిపిస్తాయి. పిశాచాలు పంది పిల్లల లాగున్నాయి.
పిల్లల కథల పుస్తకాలు ఎప్పుడూ నీతి గురించే ఉండాలని ఒక పద్ధతి తయారయింది. సరదాగా చదువుకుని మరిచిపోయేందుకు కూడా పుస్తకాలు ఉండవచ్చుననడానికి ఈ పిచ్చిపుల్లయ్య ఒక ఉదాహరణ. నీతిగా ఉండే రైతుబతుకే మంచిది, అని ఇక్కడి నీతి! అమాయకులను గురించి కథచెప్పి నవ్వుకోవడం అన్ని భాషలలోనూ ఉండనే ఉంది. ఈ పిచ్చిపుల్లయ్య నిజానికి తెలివయినవాడని చివరికి అర్ధమవుతుంది.
అనువాదం బాగా సాగింది. ఇది తెలుగు రచనే అనిపించినా అనుమానం లేదు. టాల్‌స్టాయ్ లాంటి రచయితలు రైతులకు, వారి పిల్లలకు తమ సందేశాన్ని అందించడానికి రచనలుచేశారు. ప్రస్తుతం మళ్లీ రచయితల దృష్టి పిల్లల పుస్తకాలవేపు తిరిగినట్టు అనిపిస్తుంది. అందంగా పుస్తకాలు అందించడానికి, వీలవుతున్న ఈ కాలంలో మంచి బొమ్మల పుస్తకాలు రావాలి. పాత పుస్తకాలను కూడా అచ్చువేసి అందించడం మంచిదే. రచనలు ప్రస్తుత కాలానికి సరిపడేట్టు ఉంటే మరింత బాగుంటుంది. పిచ్చిపుల్లయ్య అనే ఈ పుస్తకం పిల్లలకు నచ్చుతుంది.

-కె.బి.గోపాలం