అక్షర

నిర్దిష్ట వస్తు స్పృహ.. ప్రయోగాత్మక శైలీ శిల్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీలవేణి’
(కథల సంపుటి)
- పి.వి.సునీల్‌కుమార్
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
---
కథా నవలా రచయితగా తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితులు పి.వి.సునీల్‌కుమార్. వారు రాసిన 15 కథల సంపుటి ‘నీలవేణి’. అన్నీ 2010-2015 మధ్య ప్రముఖ పత్రికల్లో వచ్చినవి. కథారచనని సాహిత్యావసరంగానూ, సామాజిక బాధ్యతగానూ స్వీకరించిన సృజనశీలి సునీల్‌కుమార్. ‘నీలవేణి’లో వున్న కథలన్నిటా రచయితకుగల ఈ నిబద్ధత పారదర్శకమవుతోంది. ‘చీకటి’, ‘్థ’, ‘దేవదాసు 2015’ ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథలు దళిత జీవన నేపథ్యంతో పటిష్టమైన నిర్మాణంతో, స్పష్టమైన సందేశంతో వచ్చినవి. ప్రతి కథ వెనుకా- సమాజగతంగానూ, మనిషి పరంగానూ నెలకొని ‘ఉన్న’నిజాన్ని ఆవిష్కరించటంలో రచయిత నిక్కచ్చితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఉదాహరణకి ‘్థ’కథ ఒక డైనమైట్! ‘కిందికోర్టులో శిక్ష పడిందని సంబరపడ్డాం. కానీ, పెద్దకోర్టులో ఆళ్ల కులపోడి దగ్గరకే మళ్లా ఎళ్లింది కేసు. పేద్దకోర్టు. పేద్దజడ్జి. అన్యాయం జరగదనుకున్నాం......’ ‘..... దొంగకేసు అన్నాడాయన. నినె్నప్పుడైనా ఎవుడైనా తరిమాడా? నీ అమ్మని మానం మీద తన్నాడా? పొలంలో మీ ఇంటి ఆడబిడ్డని చెయ్యట్టుకు లాక్కెళ్లాడా?.. అయి జరిగినప్పుడు ఎలా ఉంటదో నీకు తెలుసా అని అడుగుదామని నోరు తెరిచా... నోట్లోంచీ మాటరాలే. మాట బదులు ఉమ్మొచ్చింది. ఊశా. అదాయన మొహంమీద పడిందయ్యా.. ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది... థూ...’ కథ అంతా ఈ ముగింపుతో అర్థమవుతోంది. ఒక అమానుషాన్ని చూస్తూ మానవత్వం నిలువుగుడ్లేసుకుని చూస్తూ నిలబడిన వైనాన్ని శక్తివంతంగా వ్యక్తీకరించారు రచయిత. ధర్మాగ్రహం పరాకాష్టని ‘్థ’లో అక్షరీకరించారు.
‘దేవదాసు-2015’ కూడా ఇలాంటి సత్యావిష్కరణని చేసిచూపి ఆలోచనల్ని రగిలించే కథే. మిగిలిన కథల్లోనూ సామాజిక వాస్తవికత వివిధ పార్శ్వాల్ని తన నిశిత పరిశీలనతో నిగ్గుతేల్చి పాఠకుల ముందుంచారు రచయిత. సంపుటిలో రెండు దెయ్యం కథలున్నాయి. ‘దెయ్యం’ కథలో బతకనేర్చిన సత్యానందం దెయ్యాన్ని సృష్టించి, అరవై వేలు చేసే ఇంటిని రెండువేలకే ‘కొట్టేసిన’ తెలివిని చూస్తాము. అందుకనే ‘ఉంటాది.... నమ్మితే దెయ్యంవల్ల ఉపయోగం’ అనుకుంటాడతను సంతోషంగా! ‘దెయ్యం-2’లో మనుషులు యాంత్రికంగా తయారై మానవ సంబంధాల్ని నీడల్లో కలిపేసుకుని మరుగుపరచుకుంటూ ఎలాంటి శూన్యంలోకి కూరుకుపోతున్నారో చిత్రించారు సునీల్‌కుమార్. ‘గతంతో పోలిస్తే దయ్యాల జనాభా పెరిగింది’అనేది తిరుగులేని తీర్పు! రచయిత చెప్పినట్టు ఈ దుస్థితి గురించి ‘ఎవరికివారు ఆలోచించుకోవాలి’.
సంపుటిలోని మరో మంచికథ- ‘నీలవేణి’. రమణకి తన కథ చెబుతూ అంటుంది నీలవేణి, ‘సాటి స్ర్తిలయి కూడా పూర్తిగా చెడిపోయి ఇంకో రెండేళ్లకంటే బతకని సంపత్‌ని నాపై ప్రయోగించి చూశారు మా అత్తగారూ, ఆడపడుచూ. వాళ్లు ఓ మంచి తల్లీ, చెల్లెలూ అయిపోయారు. మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగాలు చేస్తాయి. అందుకే ఓ వయసూ, ఇంగితమూ వచ్చాక మన మంచీచెడూ ఏదో మనమే చూసుకోవాలి. దానికోసం తల్లిదండ్రులని ఎదిరించాల్సి వచ్చినా సరే’ అని. ఈ ఇతివృత్తాన్ని పాత్రపరంగా క్రమోన్మీలనం చేస్తూ ముగించిన విధానం మంచి కథాశిల్పగుణ విశేషానికి మోడల్‌గా చెప్పవచ్చు. వస్తు శిల్పాలపరంగా, ప్రత్యేకించి క్లుప్తతనీ పాటిస్తూ వెలువడిన అతి తక్కువ తెలుగు కథల్లో నిక్కమైన నీలం- ఈ ‘నీలవేణి’!
‘అందం’ కథనిండా అందమైన పోలికలూ, వర్ణనలూ, వ్యంగ్య శరపరంపరలూ, అలతి నవ్వుతో పెదవుల్ని కదిపే హాస్యపు తునకలూ చదువరిని అలరిస్తాయి. ‘్భయానందం’ కథలో అడవిని చూసి, అక్కడి రిస్క్‌ల మధ్య బతుకుల్ని సాగిస్తున్న మనుషుల్ని చూసి- నేర్చుకొనే పాఠాలు నాగరికులకు చాలా గుణపాఠాలు చెబుతాయి. ‘మహామాయ’ అతి అమాయకత్వాన్ని మాయ ఎక్స్‌ప్లాయిట్ చేసే ఒక విధానానికి కథారూపం. ఇలాంటి విశేషాలే మిగిలిన కథల్లోనూ చూస్తాము. మనిషి జీవితపు కల్లోలాల్ని ఆవిష్కరిస్తూ సాంఘిక దౌష్ట్యాల్ని నిరసిస్తూ, మానవీయ విలువల్ని కాపాడవలసిన అవసరాన్ని స్పష్టీకరిస్తూ ‘నీలవేణి’లోని కథలన్నీ ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. శైలీ శిల్పాల్లో రచయిత సాధించుకున్న ప్రయోగసాఫల్యానికి నిదర్శనంగానూ ఉన్నాయి.

-విహారి