అక్షర

పాఠకుల భాగస్వామ్యం కోరే పైడిపాల కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిద్దుబాట
- డా.పైడిపాల కథలు-
వెల: రు.100/-
పుటలు: 174;
ప్రచురణ- మట్టి
ముద్రణలు అలగడప.
**
కథ ముద్రణకు నోచుకోవడానికి ముందుగా రచయితకు నచ్చాలి. తర్వాత ప్రచురించబడే పత్రికా సంపాదకునికి నచ్చాలి. వీరిద్దరి తర్వాతే పాఠకులకు నచ్చేవి. రాసిన కథను తిరిగి దిద్దాలనుకున్న రచయితలకు తమ రచనలలోని లోపాలను తొలగించే అవకాశంతోబాటు, మెరుగులు దిద్దే సౌలభ్యం కూడా లభిస్తుంది. పైడిపాల కలం పేరుగల పి.సత్యనారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన కథల సంపుటి ‘దిద్దుబాట’ చదువరుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో పదిహేను కథలున్నాయి. అన్ని స్వాతి, నవ్య, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రదేశ్ తదితర పత్రికలలో ప్రచురితమైనవే.
తల్లీకొడుకుల సంబంధం ఇతివృత్తంగా రాయబడిన కథ ‘నిన్నటి కొడుకు’. ‘బతికీ, చచ్చీ ననే్నడిపించిన నా మొగుడు చేసిన ఒకేఒక మంచి పని వజ్రంలాంటి పిల్లాడ్నివ్వడం’ అనుకుని పెంచిన తల్లికి, కోడలు వచ్చిన తర్వాత ఎదురైన అనుభవాలు చేదుగా ఉన్నప్పటికైనా మారుతుందేమోనన్న ఆశాభావంతో ఉంటుంది. చలనచిత్రాలలో మారినట్టుగా నిజజీవితంలో మారరు అన్న విషయం తెలుసుకున్న కథానాయకుడి నిర్ణయంతో కథ ముగుస్తుంది.
రైలు ప్రయాణాలు అనేక చిత్రమైన అనుభవాలు కలిగిస్తాయి. సికింద్రాబాదు నుంచి కాకినాడ వెడుతున్న కథానాయకుడికి ప్రయాణం పూర్తిఅయిన తర్వాత తన చెప్పుల జతలో ఒక చెప్పు తనది కాదని తెలుస్తుంది. రెండు చెప్పులూ పారేసిన రెండు రోజులకి సహా ప్రయాణీకుడు కష్టపడి చిరునామా కనుక్కుని మర్చిపోయిన చెప్పు తిరిగి ఇస్తాడు. నిదానం ప్రధానం అనీ ఇతరులకి ఉపన్యాసం ఇచ్చిన కథానాయకుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతాడు.
భార్యాభర్తల అనుబంధంలో ప్రేమ వ్యక్తీకరణకు భార్యకు పువ్వులు కొనడం రివాజుగా ఉన్న పురుషోత్తం అర్ధాంతరంగా పువ్వులు కొనకపోడం అతని మిత్రబృందానికి అర్ధం కాదు. ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా? అన్న సందేహం కూడా కలుగుతుంది. పురుషోత్తం పూలు కొనకపోడానికి ఉన్న అసలు కారణం ‘పురుషోత్తం పూలు కొనలేదు’ కథలోని కొసమెరుపు.
అమెరికా సంబంధాల మోజు తెలుగువారిలో ఎక్కువగా కనబడుతుంది. సోదరి అభ్యర్థన మేరకు, పెళ్లి మేనకోడలికి వరుణ్ణి వెతికే బాధ్యత స్వీకరిస్తాడు కథనాయకుడు. కానీ ఎన్ని సంబంధాలు సూచించినా అక్కగారికి నచ్చవు. ‘అమెరికా సంబంధం ఒకటి లైన్‌లో ఉంది. అది తేలిన తర్వాత ఆలోచిద్దాం’ అంటుంది. అమెరికా సంబంధం నిశ్చితార్థం కూడా అయిన తర్వాత ఆ వరుడు ఇద్దరు పిల్లల తండ్రి అన్న విషయం బయటపడుతుంది. అమెరికా మోజు నించి బయటపడి ఇండియాలో ఉన్న వరుడికోసం ప్రయత్నం మొదలవుతుంది. ‘‘అలివేలు కూతురు- అయిదేళ్ల పెళ్లి క(ళ)ల’’ కథలో.
కయ్యానికైనా వియ్యానికైనా సమాన ఫాయా ఉండాలన్నది నానుడి. బీద కుటుంబంలో స్వయంకృషితో పైకి వచ్చిన ‘వాసు’కి బిజినెస్ మాగ్నేట్ సంపద రావు కూతురితో పెళ్లి జరుగుతుంది. వ్యాపారంలో కోట్లు సంపాదించవచ్చునన్న నమ్మకం ఉన్న భార్య బలవంతంమీద ఉద్యోగం మానేసి వ్యాపారం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. చెప్పుకోలేనట్టి చిత్రహింస పెట్టే భార్య విడాకులకు అంగీకరించదు. ఈ సమస్యకు రచయిత చూపిన పరిష్కారం ఆభిజ్ఞులయిన పాఠకులకు నచ్చకపోవచ్చును.
ఈ పుస్తకంలో అనుబంధం ఒక నూతన ప్రక్రియ. ప్రచురణకు ముందు రాసిన మూడు కథలను యథాతథంగా చదువరులముందు ఉంచి, ప్రచురితమైన కథలతో పోల్చి అభిప్రాయాలను తెలియచేయనున్నారు రచయిత. ‘జీజఆజశ జఒ ఆ్దళ ఘూఆ యఛి గళతీజఆజశ’’ అన్న ఆంగ్ల సాహితీకారుఢి అభిప్రాయంతో ఏకీభవించి పైడిపాల కలం నుంచి ఆలోచనాత్మక కథలు జాలువారుతాయని ఆశించవచ్చును.

***
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-పాలంకి సత్యనారాయణ