అక్షర

హిందూ ధర్మ కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ నాగరికత- -ప్రాచీనత -వైశిష్ట్యము
-ఇంద్రకంటి
వెంకటేశ్వర్లు
వెల: రూ.80/-;
ప్రతులకు: ఫ్రెండ్స్ బుక్‌డిపో షాపు నెం.14
పార్కురోడ్,
మునిసిపల్ బిల్డింగ్,
కర్నూలు- 518001.
**
ప్రపంచంలో గ్రీకు-రోమన్- ఈజిప్టియన్, మెసపొటేమియన్ సంస్కృతుల వంటివి ఎన్నో ఉద్భవించి కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా సజీవంగా ఉండటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ప్రపంచంలో ప్రతి మతానికి ఒక గ్రంథం ఒక ప్రవక్త ఒకే మోక్ష మార్గం ఉన్నాయి. కాని భారతదేశంలో అలాలేదు. ఎన్ని కన్నులో అన్ని తెన్నులు అన్నారు. హిందూధర్మం యొక్క ప్రాచీనత- వైశిష్ట్యం అనే అంశాలపై చాలా పరిశోధనలు జరిగాయి. బ్రహ్మశ్రీ ఇంద్రకంటి వెంకటేశ్వర్లుగారు ఇప్పుడు మరొక పరిశోధనాత్మక గ్రంథం వెలువరించారు. ఇందులో వారు భిన్నాంశాలను శాస్ర్తియంగా స్పృశించారు. హిందువుల సాంఘిక నిర్మాణ ప్రత్యేకత-కుటుంబ జీవనం షోడశ సంస్కారాలు స్వదేశాభిమానం పరిపాలనా పద్ధతులు సాహిత్యం లిపి వైద్యం, గణితం, ఖగోళశాస్త్రం ఇలా అన్ని రంగాలల్లోను ఎలా పరిపూర్ణత సాధించారో ఆయా అధ్యాయాలల్లో వివరించారు. అంతేకాదు హిందూ సంస్కృతిపై పాశ్చాత్యులు చేసిన వివిధ వ్యాఖ్యానాలు కూడా రచయిత సేకరించి ఈ గ్రంథంలో పొందుపరిచారు. మరి ఇంతటి మహోన్నత జాతికి పతన కారణాలేమిటి? వీటిని కూడా వెంకటేశ్వర్లుగారు శోధించారు. హిందూ రాజులు స్వీయ సామ్రాజ్య విస్తరణకోసం చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకునేవారు. ఈ కారణంచేత విదేశీ శత్రువులు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ చిన్న రాజులు కక్ష సాధించి- శత్రురాజులకు సహాయంచేశారు సరిగ్గా ఇదే పరిస్థితి నేడు మన ఫెడరల్ వ్యవస్థలో కొనసాగుతున్నది. ఇక వెంకటేశ్వర్లుగారు భారత ప్రజల రాజభక్తిని ఉదహరించారు. రాజభక్తియే దేశభక్తి అని చాలా సందర్భాలల్లో భ్రమించారు. అంతేకాదు బైబిలు ప్రకారం సృష్టి జరిగి ఐదువేల సంవత్సరాలు దాటలేదు. కాని వేదములు ఉపనిషత్తులు పుట్టి వేనకు వేల సంవత్సరాలు దాటాయి కదా? ఇలా పాశ్చాత్య కాలగణనలోని లోపాలను రచయిత ఎత్తిచూపారు. వేదము ఇన్ని వేల సంవత్సరాలైనా ఒక్క పొల్లుకూడా పోకుండా ఎలా సమగ్రంగా ప్రక్షిప్తరహితంగా ఉంది? అందుకు కారణం పద-క్రమ-జట-ఘన వంటి పఠన ప్రక్రియలు. అయితే జరిగిన లోపం ఏమిటంటే పఠన పాఠములపై చూపిన జాగ్రత్త అర్ధ వివరణపై ప్రదర్శింపక పోవటం. అందుకు విదేశీ దండయాత్రలు బహిరమైన కారణం. స్వదేశీ పండితుల అవైదిక విజ్ఞానం ప్రత్యక్ష కారణం. ఈ గ్రంథంలో అలెగ్జాండరు కాలంనుండే భారతీయులకు గణితం, ఖగోళశాస్తం, విజ్ఞానం అలవడిందనే ఆ భాసను ఖండించి వాస్తవాలను ప్రదర్శించారు. ఆర్యభట్టు భాస్కరాచార్యుల వంటివారి ప్రాచీన విజ్ఞానాన్ని ఎత్తిచూపారు ప్రపంచంలోనే తొలి జ్ఞాన గురువు న్యాయశాస్త్ర ప్రదాత మనువు. ఆర్థికశాస్త్ర ప్రదాత చాణక్యుడు. పాశ్చాత్యులు బట్టకట్టుకోవటం నేర్చుకోని రోజులలో ఇక్కడ ప్రామాణిక సంస్కృతి వికసించింది. సుశ్రుతుడు చరకుడు వైద్యశాలలు ఏర్పాటుచేశారు. శాతవాహన రాజుల కాలంలో పాదరసంతో కాయకల్ప చికిత్సచేశారు.
క్రీస్తుకు పూర్వం సాలమ్మ అనే ఇజ్రాయిల్ రాజు మూడు ఓడలను భారతదేశానికి పంపి పిండి బంగారం ఏనుగు దంతాలు నెమళ్లు రత్నాలు ఆఫిర్ జాతివారి నుండి తెప్పించుకున్నాడు (10000 బి.సి.) ఈ దేశ ప్రజలకు దొంగతనాలు అంటే తెలియదు. అబద్ధములాడరు. వీరికి నోటి మాట చాలు. ప్రాంసరీ నోట్లు అక్కరలేదు. మనం నమ్మలేని ఈ నిజాలన్నీ ఈ గ్రంథంలో శాస్త్రప్రమాణాలతో ఉదాహరించారు. ఇదొక సంకలన గ్రంథము. ఎంతో శ్రమించి చరిత్ర- సాహిత్యము బహుళ శాస్త్ర పరిశోధనలు జరిపి సామాన్య పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని రూపొందించారు.

-శివప్రసాద్