అక్షర

శాతవాహన సామ్రాజ్య వైభవ ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమీపుత్ర శాతకర్ణి
(పరిశోధనా గ్రంథము)
రచన: అన్నపూర్ణాపుత్ర
డా.ఈమని శివనాగిరెడ్డి
ప్రతులకు: ఎస్.ఆర్.
బుక్‌లింక్స్
దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4.
***
‘‘వారి గుర్రములు మూడు సముద్రముల నీళ్లు తాగినవి’’ అనే శాసన వాక్యము అత్యుక్తికాదు. నిజంగా వారు త్రిసముద్రాధిపతులు. వారు తొలి తెలుగు రాజులు. వారి పేరే శాతవాహన చక్రవర్తులు. సప్తశబ్దం సాతగా మారిందని లోక వ్యాఖ్యానం. శాతవాహనుల ఆరంభ వికాసాల గూర్చి చాలా కథలున్నాయి. కథాసరిత్సాగరంలోని ఇతివృత్తం మీద కొంత ఆధారపడవచ్చు. మహారథ త్రణ కబరుని కుమార్తె దేవీ నాగనీక. ఇక్కడినుండి వీరి వంశం ప్రారంభమై దాదాపు నాలుగువందల ఏబది సంవత్సరాలు ఈ సామ్రాజ్యం నడిచింది. ఇందులో హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి వారి కాలములు స్వర్ణ ఘట్టములు. లోగడ మారేమండ రామారావువంటివారి శాతవాహన సంచిక వంటివి ఈ సామ్రాజ్య చరిత్రను తెలియజేస్తున్నది. ఇప్పుడు ప్రసిద్ధ పరిశోధకులు డా.ఈమని శివనాగిరెడ్డిగారు గౌతమీపుత్ర శాతకర్ణిపై ఒక పరిశోధనాత్మక గ్రంథం వెలువరించటం ముదావహం. ఇందులో శాతవాహన శబ్ద నిర్వచనం కులం గోత్రం రాజ్యపరిధి, వంశక్రమం సమకాలీన సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులను సంగ్రహంగా ఈ గ్రంథంలో రచయిత పరిచయంచేశారు. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్య పరిస్థితులతోబాటు శాతవాహన సామ్రాజ్య స్థితిగతులను కూడా తెలుసుకునేందుకు ఈ చిన్న గ్రంథం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న శాలివాహన శకం క్రీ.శ.78 నుండి ప్రారంభం అవుతున్నది. అంటే ఇతడు యుగకర్త అని అర్ధం. ఈయన గౌతమీపుత్రునిగా తన పేరును చెప్పుకోవటంతో ఆనాటి మాతృస్వామ్యం తేటతెల్లమవుతున్నది. ప్రభావంగా వీరు వైదిక మతావలంబులే అయినప్పటికీ బౌద్ధాన్ని ఆదరించటం విశేషం. శాతవాహన యుగము ప్రాకృత భాషకు శతత్పూర్ణిమ అనే లోకోక్తి ఉంది. హాలుని గాధాసప్తశతి గుణాఢ్యుని పైశాచీ ప్రాకృత బృహత్క్ధ ఈ యుగంలోనివే. విశ్వవిఖ్యాత మహాయాన బౌద్ధాచార్యుడు ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలానికి చెందినవాడు.
ఈమని శివారెడ్డిగారు స్థపతిగా పురాతత్వ శాసనోద్యోగిగా సుదీర్ఘ అనుభవంకలవారు కావటంతో ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీర్చిదిద్దటంలో కృతకృత్యులైనారు.
ఈ గ్రంథానికి పీఠిక వ్రాస్తూ ‘వరాలమ్మ పుత్ర విజయభాస్కర్ అని పేర్కొనటం రచయిత అన్నపూర్ణా పుత్ర శివనాగిరెడ్డి అని ఉదహరించటం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టుతున్నది. మనకు శాతవాహనులు పశ్చిమ క్షత్రపులపై జయమిత్రశాస్ర్తీ చేసిన పరిశోధన బాగా గుర్తింపుపొందింది. ఐతే తర్వాత తెలుగులో రామారావుగారి విషయసేకరణ కూడా తక్కువదేమీ కాదు. శాతవాహన వంశవృక్షంలో మనకు ముప్పది మంది రాజుల పేర్లు కన్పడుతున్నా వివిధ పురాణములలో వీనిలో కొంత తేడా వస్తున్నది. అందుకు కారణములు అనే్వషింపవలసి ఉంది. మహారధ త్రకబరుని రాజధాని ప్రతిష్ఠానము. ఇది నేటి ఔరంగాబాదు జిల్లా ఉంది. ఇక నేటి అమరావతి నాటి ధాన్యకటకము. ఇది ఆంధ్రుల రాజధాని. మూడవది కృష్ణా జిల్లాలో శ్రీకాకుళము. ఈ కారణముచేత శాతవాహనాంధ్రులు మహారాష్ట్ర వైవాహిక సంబంధాలు కలవారని అంగీకరించక తప్పదు. ఆనాటి దేశి వ్యావహారికంలోని తెలుగు భాషయే.
శాతకర్ణి మరణానంతరం నాగానీక రాజ్యపాలన చేసింది. ఆమె కుమారుడు వేదసిరి (వేదశ్రీ) వీరి ప్రతిమలు చెక్కించాడు. ఈ గ్రంథంలో వేదశ్రీ పాలనాంశం ఉదాహరింపబడింది. దీనిని తక్కిన పురాణాలలోని జాబితాలలో గుర్తించలేము. వేదశ్రీ ఉత్తరభారతం, శక్తిప్రదక్షిణ భారతం పాలించినట్లు ఈ గ్రంథంలో పేర్కొన్నారు. (పుట: 13.)
అసీలకుని తర్వాత కుంతల శాతకర్ణి రాజయినాడు. ఇతని ప్రసక్తి వాత్సాయన కామసూత్ర భాష్యములో ఉంది. ఈ కుంతల దేశము వర్తమాన కర్ణాటక ఉత్తర ప్రాంతము. ఇక శాలిహుండు సాతాని కోట వంటి పేర్లు నాటి శాతవాహన పాలనా చిహ్నములే. అల్లుడైన ఉషభదత్తుడు శాతకర్ణి చేతిలో ఓడిపోయారు. అంటే నేటి గుజరాత్, భరుకచ్ఛ ప్రాంతాలు శాతకర్ణి వశమైనాయి. (ఉషభ అంటే ఋషభ అని అర్థం.) ఋషభ శబ్దంచేత వీరు మతపరంగా వైదికులు కారు అనుకోవలసి వస్తుంది. శకులు యవనులు పల్లవులు పార్ధియనులు కూడా శాతకర్ణిచేత నిర్మూలింపబడ్డారు. అందుకే శకారి విక్రమాదిత్యుని తర్వాత శకారి శాతకర్ణికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ గ్రంథం 75 పుటల పరిమితి గలది. అందులో చాలా ఛాయాచిత్రాలున్నాయి. ఒకటిరెండు శాసన పాఠాలు (నానేఘాట్ వంటివి) ద్వితీయ ముద్రణలో చేర్చవలసి ఉంటుంది. దాదాపు రెండువేల సంవత్సరాలలో తిరిగి ఆంధ్రులకు అమరావతి రాజధాని అయిన శుభ సందర్భంలో ఈ గ్రంథం రావటం ఔచితీవంతంగా ఉంది. శాతవాహనులకు కృతజ్ఞత వెల్లడిస్తూ లోగడ వరుసగా ఆరు చరిత్రక నవలలు వ్రాశారు. ఇప్పుడు శివనాగిరెడ్డిగారు ఈ గ్రంథం ప్రచురించి తొలి తెలుగు రాజులకు ఋణం తీర్చుకున్నారు. 61వ పుటలో గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బలసిరి అని ఉంది. ఈ వాక్యాన్ని గౌతమీ బాలశ్రీ అని చదువుకోగలరు. అలాగే 50వ పుటలో వెజయంతి పదాన్ని 29వ పుటలో నాసిక్ గుహాప్రాకృత శాసనం ఉదహరింపబడింది. 32వ పుటలో వాసిష్ఠీపుత్ర పులోమావి ప్రాకృత శాసనం ఉంది. ఇప్పుడు గౌతమీపుత్రుని కుమారుడు శాతవాహన రాజ్యం నాల్గవ శతాబ్దంలో ముగిసినా ఆ తర్వాత కూడా వీరి జాడలు కన్పడుతున్నాయి.

-ముదిగొండ శివప్రసాద్