అక్షరాలోచన

ఎర్రమల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండుటాకుల గలగలల సంగీతంతో
అడుగుకొక నిట్టాడులా నిగిడున్న చెట్లు
ఆ చెట్లకు చేతులు పూసినట్లున్న కొమ్మలు
ఆ కొమ్మలకు విరగబూసిన పచ్చపూలలా ఆకులు
ఆ ఆకుల మధ్యన రంగులన్నీ కలిపి అద్దినట్లు పూలదొంతరలు
అచ్చు అమ్మ పాటలా చిరుగాలుల సవ్వడులు
జీవకోటికి ఆయుష్షు పంచేలా పారే సెలయేళ్లు
పక్షుల రావాలన్నీ మకరందాన్ని రుచి చూపిస్తున్నట్లున్న,
పెట్టని, కట్టని పెళ్లి పందిరి లాంటి అడవి
ఎల్లలు లేని, కపటం తెలియని స్వేచ్ఛా గీతంలా
మనిషికైనా మృగానికైనా ఒక్కటే ధర్మంలా
విశ్వానికంతా ఒక్కటే జెండా, అదే ఎజెండాలా
వినమ్ర విజయంలా సాగుతున్న వేళ..!
మేఘం లేని వర్షంలా, మెరుపుల్లేని ఉరుముల్లా
రాజ్యం నుండి యుద్ధానికై వినవచ్చిన శంఖంలా
రక్షక భటుల బూట్ల చప్పుడు
అడవి ఎదపై మోగుతుంటే
బెదరిన పిల్లవాడు గుక్కపెట్టి ఏడ్చేలా
గర్జించే తుపాకీ చప్పుడులు
గుడిసెలు పెరుకుతూ, గుండెలపై తంతూ
ఆర్భాటపు ఆరాలు
విరిగే లాఠీలు, పేల్చే తూటాలు
పచ్చటాకులపై వెచ్చని ఎర్రమల్లెల్ని పూయిస్తుంటే
చెమట చుక్కలతో పులకరించే నేల
రక్తపు మడుగులో గుండెలు బాదుకుంటుంది
తూటా దెబ్బకు అల్లాడుతున్న ప్రతి హక్కు
రాజ్యాంగపు రక్షణకై అర్రులు చాస్తుంది
రాలిన ప్రతి రక్తపు చినుకు
ఎన్‌కౌంటర్ల ముసుగులో
ఈ భూమి పొరల్లోకి విప్లవాల నాట్లను వేస్తుంటే
రాబోవు తరాలు అందుకొనేది
గుండెల నిండుగా పోరాటాలనే
పోరాటాలతో రాజ్యాధికారానే్న.
*
-అమర్లపూడి కళ్యాణ్‌కుమార్ 8341136796

-అమర్లపూడి కళ్యాణ్‌కుమార్ 8341136796