అక్షర

అష్టాదశ పురాణాల సంక్షిప్త పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టాదశ పురాణములు
-యం.వి.నరసింహారెడ్డి
వెల: 300/-;
ప్రతులకు: గోపాల్ బుక్‌హౌస్,
ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా,
కాచిగూడ ఎక్స్‌రోడ్స్,
హైదరాబాదు-27.

యం.వి.నరసింహారెడ్డిగారు తెలుగువారు గర్వింపదగిన విద్వన్మణి- లోగడ వేదములు ఉపనిషత్తులపై అపార పరిశ్రమచేసి కొన్ని గ్రంథములు వెలువరించారు. ఇప్పుడు అష్టాదశ పురాణం పరిచయ గ్రంథము వచ్చింది. వీరి వేదభక్తి అపారము. దేశభక్తి అమేయము. భారతీయ సంస్కృతీ పరిరక్షణ వీరి ధ్యేయము. భారతీయ సాహిత్యంలో వేదములు ఉపనిషత్తులు తర్వాతి స్థానము అష్టాదశ పురాణములదే. ఇవి వ్యాసప్రోక్తము. మత్స్యకూర్మ వరాహనుండి వైష్ణవ పురాణములు శివపురాణములు శక్తిపారమ్యమును బోధించేవి ఇందులో ఉన్నాయి. పురాణం పంచలక్షణమ్ అన్నారు పెద్దలు. మన పురాణములు కథా ప్రధానములే అయినప్పటికీ అందులో భారతదేశ చరిత్ర-్భషలో విజ్ఞానము వంటి ఎన్నో అంశాలు అంతర్లీనంగా ఉన్నాయి. ఇందలి కథచే తర్వాతి కాలములో కావ్యములందున్నాయి. నరసింహారెడ్డిగారు ఈ గ్రంథములో ఒక్కొక్క పురాణము తీసుకొని దానిని సంక్షిప్తంగా పాఠకులకు పరిచయం చేయాలని ప్రయత్నించారు. దీనివలన మూలపురాణములు సంపూర్ణ చరిత్ర చదువుకోవాలనే కోరిక పాఠకుల హృదయాల్లో మొలకెత్తుతుంది. పురాణములు లోగడ తెలుగు పద్యరూపంలో (మార్కండేయ పురాణము) గద్యరూపంలో (శివపురాణము నిర్మల శంకరశాస్ర్తీ) వచ్చాయి. ఇది సరళ వచనములో వెలువడిన సంక్షిప్త పరిచయము. పురాణ సంఖ్య గూర్చి ప్రక్షిప్తముల గూర్చి కొన్ని వివాదాంశాలు ఉన్నాయి. రచయిత వాటి జోలికి వెళ్లలేదు. లోగడ వీరు భాగవతము వెలువరించారు కాబట్టి ఇప్పుడు దానిని వదలిపెట్టి దేవీ భాగవతమును ఇందులో చేర్చారు. కొందరు విద్యార్థులు మూలగ్రంథములు చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. మరి కొందరు నేడు చదివి లాభపడుతారు. మూలము సంస్కృతము లేదా ఆంధ్రములో చదువుకోవాలని వారికి ఈ గ్రంథము సహకరిస్తుంది. నరసింహారెడ్డిగారు ఉప పురాణములపై కూడా దృష్టిసారిస్తారని ఆశింపవచ్చు. మానవ జీవన విధానానికి పురాణములు దిక్సూచి వంటివి అని వారు పీఠికలో చెప్పిన మాట నిజము.

-ముదిగొండ శివప్రసాద్