అక్షర

సాదాసీదా కుటుంబాల్లోనూ విలక్షణ చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాయారావులు-
సామాజిక సాంస్కృతిక
వంశ చరిత్ర
-ఆర్.రామమోహనరావు
పుటలు: 200,
వెల: రు.300/-
ప్రతులకు: రచయిత,
ప్లాట్ నెం.204,
దుర్గాబాయిదేశ్‌ముఖ్ కాలనీ
హైదరాబాదు-7.

ఈ రాయారావు మూలాలను ఎన్నో చారిత్రక గ్రంథాలనుండి వివరాలు సేకరించి రామ్మోహనరావు పొందుపరచారు. గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీకుతుబ్‌షా (1550-1580) వద్ద రాయారావు నరసన్న సైన్యాధ్యక్షుడట. నరసన్న రాయారావు సేవలకు, ప్రభుభక్తికి మెచ్చి ఇబ్రహీం కులీకుతుబ్‌షా మెదక్ జిల్లా నర్సాపురం గ్రామానికి దేశ్‌ముఖ్‌గా నియమించారట. అలా ఏర్పడిందే మెదక్ జిల్లాలో నర్సాపురం గ్రామం. కులీకుతుబ్‌షాను గద్దె నెక్కించడంలో నరసన్న రాయారావు కీలక భూమిక వహించారు. దాంతో నర్సాపూరుకు చుట్టుప్రక్కల గ్రామాలను కూడ హక్క్భుక్తం చేశారు. ఆ విధంగా రాయారావు నరసన్నగారి జాగీర్ తూర్పున చెన్నాపూర్ మొదలుకొని పడమట 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాదు దాక విస్తరించింది. ఆదుకున్నవారే తప్ప ప్రజలను పీడించిన దేశ్‌ముఖ్‌లు కారు వీరు. ప్రజల బాగోగులు చూడడం. పన్నులు వసూలుచేయడం, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించడం ఈ దేశ్‌ముఖ్‌ల బాధ్యత.. హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఈ వ్యవస్థ అంతరించింది.

ఈ పుస్తకంలో ఏముంది? రచయిత కుటుంబ సభ్యుల వివరాలే గదా! అని పెదవి విరవ వచ్చు. రాజుల వంశ చరిత్రలే చరిత్రలు కానక్కర లేదు. ప్రతివారు రామకృష్ణ పరమహంసలో, అబ్దుల్‌కలామ్‌లో కావలసిన అవసరం లేదు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు సైతం ‘‘తమదైన’’ విలక్షణ చరిత్ర ఉంటుంది. ఆ ‘‘తమదైన’’చరిత్రను గ్రంథస్థంచేసే హక్కు కూడ ఉంటుంది. అలెక్స్ హేలీ రూట్స్ నవల ఎలా విఖ్యాతమైంది.? ఏడు తరాల పూర్వీకుల వృత్తాంతాన్ని పునర్నిర్మించుకోవడమేగదా! రామ్మోహనరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూగోళ శాస్తశ్రాఖలో సీనియర్ ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. భూగోళశాస్త్ర సంబంధమైన ఎన్నో ప్రామాణిక గ్రంథాలు రాశారు. వారి వయస్సు కారణంగా భారత స్వాతంత్య్రోద్యమం, నిజాం వ్యతిరేకోద్యమం, జమీందారీ వ్యవస్థ అనుభవంలోకి రాకపోయినా సన్నిహితంగా తెలిసినవారు. ఆ వాతావరణంలో ఎదిగినవారు. రామ్మోహన్‌రావు తండ్రిగారు రాయారావు శేషారావు మెదక్ జిల్లా నల్లవెల్లి దేశ్‌ముఖ్‌లు, పెద్దగడీ వారి సొంతం. ఈరోజు గడీలు, జమీందారీలు అన్నీ పోయాయి. చదువుకుంటే ఉద్యోగప్రాప్తి. ఈ దేశం ఉద్యోగానికి తిరస్కరిస్తే అమెరికా శరణం. మరి అత్యధిక విద్యావంతులై అమెరికాలో జీవిస్తున్న తమ మనుమలకు, ముని మనుమలకు రామ్మోహనరావు ఆర్థికసాయం చేయాల్సిన అవసరం లేదు. చేయిచాచి అడగాల్సిన స్థితిలో వారూ లేరు. ఇచ్చి ఆదుకోవాల్సిన పైస్థాయిలో వీరూ లేరు. కాని ఈ పుస్తకం- రాయారావు వంశ చరిత్ర రాసి మాటలతో చెప్పరాని ఉపకారం చేశారు. మునిమనుమలకు తమ వంశ ప్రతిష్ఠలు ఎంత గొప్పవో నమోదుచేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతంచేశారు. ఇప్పుడు రామ్మోహనరావుగారు రాయకపోతే ఈ పుస్తకాన్ని వారి వంశీయులు రాయలేరు. అలాగే డెబ్బయి దాటిన పెద్దలకే ఆనాటి అనుభవాలు, జీవన విధానం తెలిసే అవకాశం ఉంటుంది. ఇలాగ ఎవరికివారు తమ వంశ చరిత్రలను గ్రంథాలు రాసే మార్గాన్ని చూపించారు. వర్తమాన చరిత్ర గ్రంథానికి వర్తమానంలో విలువ వుండదు. ఓ రెండు దశాబ్దాల తర్వాత దీనికి విలువ వస్తుంది. అవసరమైనవారికి రిఫరెన్సు గ్రంథవౌతుంది.
బ్రాహ్మణుల్లో కరణీకం, పరిపాలనం చేసేవారు నియోగులు. పౌరోహిత్యం, వేదాధ్యాయనం చేసేవారు వైదికులు. ఈ రెండు ప్రధాన శాఖలు, విశిష్టాద్వైతం, అద్వైతం, లింగధారణం లాంటి భక్తిమార్గాలవల్ల వైష్ణవులు, స్మార్తులు, ఆరాధ్యులు అనే తెగలు ఏర్పడ్డాయి. రాయారావు ఇంటిపేరు గలిగిన వీరు ఆరువేల నియోగులు. వైష్ణవులు. మహారాష్ట్ర మూలాలున్నవారు. ఈ రాయారావు మూలాలను ఎన్నో చారిత్రక గ్రంథాలనుండి వివరాలు సేకరించి రామ్మోహనరావు పొందుపరచారు. గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీకుతుబ్‌షా (1550-1580) వద్ద రాయారావు నరసన్న సైన్యాధ్యక్షుడట. నరసన్న రాయారావు సేవలకు, ప్రభుభక్తికి మెచ్చి ఇబ్రహీం కులీకుతుబ్‌షా మెదక్ జిల్లా నర్సాపురం గ్రామానికి దేశ్‌ముఖ్‌గా నియమించారట. అలా ఏర్పడిందే మెదక్ జిల్లాలో నర్సాపురం గ్రామం. కులీకుతుబ్‌షాను గద్దె నెక్కించడంలో నరసన్న రాయారావు కీలక భూమిక వహించారు. దాంతో నర్సాపూరుకు చుట్టుప్రక్కల గ్రామాలను కూడ హక్క్భుక్తం చేశారు. ఆ విధంగా రాయారావు నరసన్నగారి జాగీర్ తూర్పున చెన్నాపూర్ మొదలుకొని పడమట 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాదు దాక విస్తరించింది. ఆదుకున్నవారే తప్ప ప్రజలను పీడించిన దేశ్‌ముఖ్‌లు కారు వీరు. ప్రజల బాగోగులు చూడడం. పన్నులు వసూలుచేయడం, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించడం ఈ దేశ్‌ముఖ్‌ల బాధ్యత.. హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఈ వ్యవస్థ అంతరించింది.
ఈ నర్సాపురం రాయారావులు ఉర్దు పర్షియన్ భాషల్లో పండితులు పరోపకార పారీణులు. వీరి అధికార కేంద్రాలు మెదక్ జిల్లాలోని నల్లవల్లి, వెంకటారావుపేట, మద్దూర్, చెన్నాపూర్, రామచంద్రాపూర్ ప్రాంతాల్లో పెద్దపెద్ద హవేలీ (్భవనాలు), నర్సాపూర్‌లో ఐదెకరాల సువిశాల స్థలంలో పెద్ద గడీ(కోట) నిర్మించారు. ఇప్పటికీ నర్సాపూర్ గడీ చిన్నచిన్న మరమ్మత్తులు చేయడంతో సురక్షితంగా ఉంది. వేటకు వెళ్ళేవారు. తుపాకీలు ఉండేవి. మందుగుండు సామాను స్వయంగా తయారుచేసేవారు. 1948 ప్రాంతంలో కమ్యునిస్టులు, రజాకార్లు ఒకసారి దాడిచేయాలని యత్నించడం, స్థానిక ప్రజల్లో వీరి పట్ల ఉన్న సద్భావన కారణంగా వెనుదిరగడం జరిగాయి.
220 ఏళ్ళ కిందట ఈ కోట మహారాణి (దొరసాని) ఒంటరిగా పోరాడి 220 కిలోల బంగారు నగలను దొంగలపాలు కాకుండా కాపాడిందట. ఈ పోరులో కాపాలాదారులు ఆయుధాలు వదిలేసి పారిపోయారు. ఈమె ఒక చేయి పోగొట్టుకుంది. ఇదంతా కోటలోని ఒక దాసి చేసిన కుట్ర ఫలితమని చెప్పిన సంఘటన చదువరునెంతో ఆకర్షిస్తుంది.
రచయిత రామ్మోహనరావు తండ్రిగారు కిషన్ రావు (1919-1959) పర్షియనులో కవితలు రాసినవారు. ఆ కాలంలో పర్షియన్‌లో నేటి బియ్యెతో సమానమైన ‘‘మున్షిపజిల్’’డిగ్రీ పొందినవారు. రామ్మోహనరావు అన్నగారు శేషారావు అధిక దిగుబడి సాధించినందుకు 1956లో ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా కృషి పండిట్ పురస్కారమందుకున్న వ్యక్తి. రామ్మోహనరావుగారు విశ్వవిద్యాలయాచార్యులు. వీరి తమ్ముడు ప్రముఖ పాత్రికేయులు. వివిధ పత్రికలో రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేసిన ఆర్.వి.రామారావు, రామ్మోహనరావులు తదితర సోదరుల సంతానం అమెరికాలో ఉన్నతోద్యోగాల్లో రాణిస్తున్నవారు. వారందరి వివరాలు, వంశీయుల జనన మరణాలు, అభిప్రాయాలు పొందుపరిచారు.
రాయారావు రామ్మోహనరావుగారు అన్ని వివరాలు ఇచ్చారు. గోత్రాన్ని ఈ సమీక్షకునికి వదిలేశారు. ఈ వంశీయులది భరద్వాజ గోత్రం. ఒక ఇంటి పేరుకు ఒకే గోత్రం ఉండాలన్న నియమమేమీ లేదు. సాధారణంగా ఉంటుంది. ఆ మాటకొస్తే భిన్న భిన్న కులాల వారికొకే ఇంటి పేరుండవచ్చు. ఇంటి పేర్లు లోకాచారం. ఋషి గణాల్లో ఏర్పడ్డ వైవిధ్యం గోత్రంగా మారుతుంది. అది ప్రవర ద్వారా తెలుస్తుంది. ఈ మెదకులోనే రాయారావు ఇంటి పేరు గలిగిన కాశ్యపగోత్రీకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు దేవిప్రసాద్‌రావు మామగారు జనార్థనరావుగారిది రాయారావు వంశమే. ఉస్మానియా మెడికల్ కాలేజి ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు. అమ్మంగి వేణుగోపాల్ సాహిత్యంపై పరిశోధించి డాక్టరేటు గ్రహించిన అధ్యాపకుడు సూర్యప్రకాశ్‌రావుదీ రాయారావు ఇంటి పేరే. మెదక్ జిల్లా బోనాలకుంట, కొండాపూర్, చేగుంట, చిన్న శంకరంపేట లాంటి ప్రాంతాల్లో కాశ్యప గోత్రీకులైన రాయారావులున్నారు. వీరితో నేరుగా బంధుత్వాలు లేకపోవడంతో, జాతాశౌచ, మృతాశౌచాలు లేకపోవడంతో కాబోలు ప్రస్తావించలేదు అట్లే ఆంధ్ర ప్రాంతంలో కూడ ఉంటే వుండవచ్చు.
ఈ తీరుగనే భిన్నభిన్న వ్యక్తులు భిన్నభిన్న స్థాయిల్లో తమ చరిత్రలు రాస్తే సమగ్ర చరిత్ర రచనకు మరికొంత దోహదం చేసినవారవుతారు.

-వెలుదండ నిత్యానందరావు