అక్షర

జిజ్ఞాసను పెంచే బతుకమ్మ చరిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రతుకమ్మ సంస్కృతి
ఆచార్య కసిరెడ్డి
మూల్యం: రూ.100/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం
రచయత
12-5-91/101, సాయనివాస్,
విజయపురి, తార్నాక
సికిందరాబాద్-500 017.
9866956250
040-27017207
**

తెలంగాణా విస్తృత ప్రచారానికి బహుళ వ్యాప్తిలో ఉన్న బతుకమ్మ పండుగ గురించి పరమార్థాన్ని, పారమార్థిక తత్వాన్ని అతి చిన్న పదాలతో ఆచార్య కసిరెడ్టి వెంకటరెడ్డి ‘‘బ్రతుకమ్మ సంస్కృతి’’ అన్న చిరుపుస్తకంలో వివరించారు. ఈ బతుకమ్మ ఓ ప్రాంతానికి పరిమితమైనదే కాదు. ఈ బతుకమ్మనే అఖిలలోకాలను పాలించే శ్రీరాజరాజేశ్వరిగా సంభావించారు. బతుకమ్మ పాటలలో బాల్యంలోనే ఇతర అంశాలను జోడిస్తూ బతుకమ్మ పాటలను నిర్మించడం చేతనైన కసిరెడ్డి ఇప్పటివరకు ఎన్నో వ్యాఖ్యానాలను, ఎన్నో ఉపన్యాసాలను బతుకమ్మ పాటలగురించి వివరించే ఉన్నారు. నేడు తెలంగాణా రాష్టప్రండుగగా అభివృద్ధి చెందుతున్న ఈ బతుకమ్మ పండుగ లో బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలగురించి వివరిస్తూ ఈ బతుకమ్మ .. ‘్భరతీ సతివయ్యు బ్రహ్మ కిల్లాలివై/ పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీ లక్ష్మి వయ్యూ గౌరమ్మ/ భార్యవైతివి హరికినీ.... అంటూ బతుకమ్మ ‘‘శ్రీరామ నామాలు శతకోటి’’ అయినా అవి ఎలా ఒక్క రామునికి చెందుతాయో అట్లానే ఈ బతుకమ్మ ప్రతీ ప్రాంతంలో వేర్వేరు పేర్లతో పిలిచినా ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండనాయికి ఈమెనని ఈమెకే ఆ ఆటపాటలు పూజలు పునస్కారాలు చేరుతాయని స్థిరీకరించారు.
దాన్ని నిర్ధారించేవే ఈ బతుకమ్మ పాటల్లోని వైవిధ్యాలని బతుకమ్మ పాటల గురించి ఉదాహరణలతో చెప్పారు. ఈ బతుకమ్మ పాటల్లో దైవాంశకు సంబంధించిన విషయాలతో పాటు దైవీ మహిమలు కూడా కనబడుతాయి. వాటితో పాటు సామాజికాంశాలు, సాంఘికాంశాలు కూడా చోటు చేసుకొన్నాయ.
స్ర్తీ శౌర్యమూ, త్యాగమే బతుకమ్మ అనే కసిరెడ్డి శైవ , వైష్ణవ, గాణాపత్య, సౌర, కాపాలిక మతాలకు తోడుగా నిలిచిన శాక్తేయం నుండే బతుకమ్మ ఆవిర్భవించిన బతుకమ్మను కోరి కొలిచిన వారికి శతాయుష్షు, సదా ఆనందాలు కలుగుతాయని అంతర్లీనంగా ప్రబోధించే ఈ చిరుపొత్తం ప్రతివారు చదవాలన్న జిజ్ఞాసను కలిగించేదే. అమెరికా తెలంగాణా సంఘం అధ్వర్యంలో ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభల్లో అమెరికాలోని డెట్రాయిట్‌లో ఆవిష్కరించబడిన ఈ పుస్తకం సర్వులు తెలుసుకోదగిన వస్తువుతో పాటుగా ద్రాక్షారసశైలిని కలిగి ఉంది.
***

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-రాయసం లక్ష్మి