అక్షర

వ్యక్తిత్వ వికాసానికి ఇదో సుభాషితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ఫూర్తి పథం
108 -ళ్ఘూఒ యచి తీజఒజ్యూౄ
సంకలనం: బి.ఎస్.శర్మ; ఆంగ్లానువాదం:
గిరిధర్ మామిడి.
ప్రతులకు: 1) సాహిత్య
నికేతన్, బర్కత్‌పురా,
హైదరాబాదు-27,
27563236
2) నవోదయ బుక్‌హౌస్, హైదరాబాదు-27
24652387
216 పేజీలు- రూ.150/- (ఎంపీత్రీ సీడీతో సహా)
**
‘‘పృథివ్యాం త్రీణి రత్నాని- జలమన్నం సుభాషితమ్’’అని ఆర్యోక్తి. ప్రపంచంలోవున్న ఉత్కృష్టమైన వస్తువులు మూడు. అవి ఆహారం, నీరు, సుభాషితం. దీన్నిబట్టి మనిషిని సంస్కరించే ‘మంచిమాటల’ ప్రాధాన్యత తెలుస్తోంది.
‘‘అపారమైన సుభాషిత వాఙ్మయం సంస్కృత భారతి విశ్వానికి అందించిన మహోపకృతి.’’ అట్టి సుభాషితాలను లోగడ ఎందరెందరో సంకలనాలుగా అందించారు. స్ఫూర్తి పథం 108 -ళ్ఘూఒ యచి జీజఒజ్యూౄ అనే పేరుతో బి.ఎస్.శర్మ సంకలనం గావించిన పుస్తకం (ప్రజ్ఞ్భారతి ప్రచురణ) అనేక ప్రత్యేకతలను సంతరించుకొంది.
వ్యక్తిత్వ వికాస పాఠాలుగా పనికివచ్చే శ్లోకాలను (108) ఎంపిక చేయటం, వాటిని దేవనాగరి, తెలుగు లిపిలో అందించటం ఓ విశేషం. ప్రతీ శ్లోకానికి ఓ శీర్షిక- కొంత ఉపోద్ఘాతాన్ని ఇవ్వటం- ఒక పేజీలో ఇమిడేలా శ్లోక భావాన్ని, వివరణని (వ్యాఖ్యానం) ఆంగ్ల, ఆంధ్ర భాషలలో ఇవ్వటం ఓ ప్రత్యేకత. పుస్తకంతోపాటు ఓ ‘ఆడియోబుక్’ (ఎంపీత్రీ సీడీ)ని ఇవ్వటంవల్ల ‘విని, శ్లోకాన్ని’ నేర్చుకొనే సౌకర్యం వుంది.
‘అ’కరాది క్రమంలో అందించిన 108 శ్లోకాలను పది విభాగాలుగా విభజించారు సంకలనకర్త. ఉదాహరణకు ‘స్నేహం’ విషయంలో ఏయే శ్లోకాలు వున్నాయో, వాటి సంఖ్యను- విషయ సూచికగా ఆదిలో ఇచ్చారు.
సంకలనకర్త చేసిన వివరణ వ్యాఖ్యానం సంస్కారయుతంగా భావం మనస్సుకి హత్తుకొనేలా వుంది. సందర్భానుసారంగా శ్లోకానికి తగిన కథలను కొన్ని జోడించటం మరో ప్రత్యేకత. ఉదాహరణకి ‘‘సహసాలిద ధీత న క్రియామ్’’ అనే మహాకవి భారవి (కిరాతార్జునీయం) శ్లోకాన్ని వివరిస్తూ, పంచతంత్రంలోని ‘పాము-ముంగీస కథను, సత్యంబ్రూయాత్ అనే మనుధర్మశాస్త్ర శ్లోకాన్ని వివరిస్తూ ప్రసిద్ధమైన ‘‘స్ర్తిరక్షణ చేసిన ఋషి కథను’’, మణీషినస్సంతి నతేహితైషిహో’’ అనే భోజ చరిత్రలోని శ్లోకానికి, బుద్ధిహీనతో కోతి, తన యజమానికి ‘ఈగ’బారినుండి రక్షించేందుకు- రాయితో మోదిన మరో ప్రసిద్ధ కథను ఉల్లేఖించారు వ్యాఖ్యాత.
ఆంగ్ల-అనువాదం చేసిన గిరిధర్ మామిడి ప్రశంసనీయుడు. సరళమైన అనువాదం, పుస్తకాన్ని ‘బహుళ ప్రయోజ కారిణి’గా చేసింది.
ఆచరించ తగిన, తెలుసుకోతగిన, సభలలో (ఉపన్యా సాల లో) ఉదహరింపదగిన ఈ శ్లోకాలు సాధకులకు బాగా పనికివస్తాయి. నవతరంకోసం చేసిన ఈ ప్రయత్నం వచ్చేలా, పెద్దలు కృషిచేయాలి.
లబ్దప్రతిష్టులైన డా.కరణం అరవిందరావు, డా.హనుమాన్ చౌదరి, సామవేదం షణ్ముఖశర్మ మొ.వారు ముందుమాటలందించి, ప్రశంసించిన ఈ పుస్తకాన్ని సంస్కృతాభిమానులు, సంస్కృతం నేర్చుకొందామనుకొనేవారు తప్పక చదవతగినది. విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతిగా ఇవ్వటానికి బాగుంటుంది.

-టి.శర్వాణి