అక్షర

సంక్షిప్త గీతావచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్భగవద్గీతా జ్ఞానము-
వల్లభజోశ్యుల
కృష్ణమాలవ్యశర్మ
వెల: రూ.అమూల్యం
ప్రతులకు ఫోను: 0891-6643390
**
ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రభావశీల గ్రంథాలలో శ్రీమద్భగవద్గీత అగ్ర పంక్తిని అలంకరిస్తుంది. సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన బోధ. ఇది దివ్యవాణి. లౌకిక, ఆముష్మిక విషయాలెన్నో దీనిలో నిక్షిప్తమై వున్నాయి. వేదోపనిషత్తుల సారమే గ్రంథరాజం. జ్ఞాన, ధ్యాన, కర్మ, భక్తి, యోగాది అనేక అంశాలను సులభగ్రాహ్యంగా పరమాత్మ పార్థునికి విశదీకరించి, తద్వారా సకల మానవాళికి ఉత్తమ జీవనప్రస్థానానికి దోహదపరచే దిశానిర్దేశం చేశాడు.
ప్రస్తుత గ్రంథం ‘శ్రీమద్భగవద్గీతా జ్ఞానము’ వచన రూపకం అని రచయిత వల్లభజోశ్యుల కృష్ణమాలవ్యశర్మ తెలియజేశారు. ‘మానవ జీవిత లక్ష్యసాధన మార్గము- శ్రీకృష్ణార్జున సంవాదము’అని కూడ పేర్కొన్నారు. తన ఆశయాన్ని ఇలా వ్యక్తంచేశారు; ‘‘ఆ పవిత్ర గ్రంథము (్భగవద్గీత)లోని జ్ఞాన సందేశములు ఈనాడు మనకువున్న కొద్ది కాలపరిధిలో సుళువుగా తెలుసుకొనుటకు అందులోని శ్లోకార్థములు వచన రూపకములో ఈ చిన్ని గ్రంథములో పొందుపరచడమైనది.’’
రచనకు సుయోచిత ప్రణాళికను రూపొందించుకున్నారు. గీతలోని 18 యోగాలను గురించి 18 అధ్యాయాలలో సంక్షిప్తంగా చెప్పారు. ప్రతి అధ్యాయంలో 3 భాగాలుంటాయి. మొదటిది- ప్రస్తావన. దీనిలో వెనుకటి అధ్యాయంలోని అంశం సూచిస్తారు. రెండవది- విషయ సంగ్రహం. దీనిలో ప్రస్తుత అధ్యాయంలోని అంశాన్ని చెబుతారు. ఈ అంశం యోగంలోని ఏ శ్లోకాలకు సంబంధించిందో పేర్కొంటారు. మూడవది- ఈ యోగంలోని అంశం సారాంశముంటుంది. ఆ విధంగా ప్రతి అధ్యాయం చాలా విశే్లషణాత్మకంగా, అత్యంత సుబోధకంగా వుంటుంది. క్లిష్టమని భావించే యోగం కూడా పాఠకులకు సులభంగా అర్థమవుతుంది. అది రచనా సంవిధానంలోని ప్రత్యేకత. ఉదాహరణకు- 6వ అధ్యాయం పరిశీలిద్దాం. ఇది ఆత్మ సంయమ(్ధ్యన) యోగం. ఇందులో 47 శ్లోకాలున్నాయి. 4 పుటలలో రచయిత ఈ యోగం గురించి ముఖ్యాంశాలన్నీ పాఠకులకు అందించారు. వెనుకటి అధ్యాయంలో ఏమున్నదీ, ఈ అధ్యాయం ఏమి బోధిస్తున్నదీ ప్రస్తావనలో స్పష్టమవుతుంది. అది ఇలా వుంది: ‘‘5వ అధ్యాయం కర్మయోగా-కర్మసన్యాస యోగములు రెండునూ ముఖ్యములని, చివరగా ఆత్మసంయమయోగము లేక ధ్యాన యోగము (శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నిగ్రహించు) చేయుట ఆత్మజ్ఞానమార్గమని బోధించెను...’’ రెండవ భాగంలో అన్ని శ్లోకాల భావం పొందుపరచారు. అన్నిచోట్లా శ్లోకాల సంఖ్య ఇవ్వడం విశేషం. మూడవ భాగంలో ఈ అధ్యాయంలోని 6 ముఖ్యాంశాలను సారాంశంగా చేర్చారు. ఆ విధంగా అధ్యాయం సమగ్రరూపం సంతరించుకుంటుంది.
రచయిత సరళగ్రాంథికశైలి ఎంచుకున్నారు. ఆధ్యాత్మిక విషయాలను విశదీకరించేందుకు సాధారణ పదాలను ఉపయోగించడం ప్రశంసనీయం. భగవద్గీత బోధనలు మార్గదర్శకాలని చెబుతూ ‘‘అవి మన నిజ జీవితములో ఆచరించి ప్రయత్నించినపుడే ప్రయోజనము పొందగలము’’అని గ్రంథాంతంలో హితం పలుకుతారు.
ముఖ చిత్రం, వెనుక అట్టపై చిత్రం ఎంత మనోహరంగా వున్నాయి. ముముక్షువులకీ గ్రంథం భాసుర కరదీపిక.

-జిఆర్కె