అక్షర

లేపాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి
చిత్ర శిల్పకళా కాణాచి
-లేపాక్షి నళినాక్షి
సంపాదకుడు
కల్లూరు రాఘవేంద్రరావు
వెల: రూ.50/-
ప్రతులకు: నంది పబ్లికేషన్స్, లేపాక్షి
9701843319

లేపాక్షి దేవాలయ స్థానిక, పౌరాణిక, చారిత్రాత్మక, వైజ్ఞానిక, చిత్రకళా చరిత్రలను గూర్చి ఎందరో పరిశోధించి ఎన్నో విషయాలను గ్రంథాల ద్వారా వెలువరించినా అవేవీ పాఠకులకు సంతృప్తి నివ్వలేదన్నది సత్యం. అందుకు బలమైన కారణం విరుపణ్ణ చేసిన త్యాగం వెనుకగల చారిత్రాత్మక నేపథ్యాన్ని కచ్చితంగా స్పష్టీకరించకపోవడమేనని తెలుస్తూంది.
లేపాక్షి దేవాలయంలోని ప్రతి స్తంభం, గోడ, పైకప్పు, నేల ప్రతి దిక్కు, ప్రతి మూలలోని శిల్పాలు కూడా ఏదో ఒక గొప్ప కథను తెలియజేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడివన్నీ నిలువెత్తు సజీవ శిల్పాలే. ఆ చరిత్రకి సంబంధించిన ఎనె్నన్నో అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

‘నా పుస్తకం’ శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల.. 9493271620