అక్షర

మురిపించే జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలు సమీక్ష ధోరణిలోకి పడేలోగా ఒక విషయం చెప్పాలని ఉంది. బుచ్చిబాబుగారు ఆనందంగా బతికేవారని ఈ పుస్తకం మరీమరీ చెపుతుంది. ఆయన ‘వోహోహో’అంటూ నవ్వారని సుబ్బలక్ష్మిగారు చాలాచోట్ల రాశారు. ఆయన అంత బాగా నవ్వడము, ఈవిడగారు అనుమానం లేకుండా ఆ సంగతి చెప్పడం! ఎంత మంచి మనుషులు! వారి గురించి, వారే రాసిన సంగతులు అంతకంటే బాగుంటాయి గదా!
శివరాజు సుబ్బారావుగారనే బుచ్చిబాబుగారు పేరున్న రచయిత. ఆయనగారి భార్య సుబ్బలక్ష్మిగారు ఆయనతో సమానంగా పేరుకోసం పాకులాడని రచయిత్రి. ఆమెలోని గొప్ప రచయిత్రి ఈ పుస్తకం ద్వారా బయటపడడం ఆనందం. అలాగని ఆమె మరేమీ రాయలేదని కాదు. జ్ఞాపకాలు రాయడానికి పెద్దవయసులో (రచయిత్రికి ప్రస్తుతం 91 సంవత్సరాలు! చల్లగా బతుకుతల్లీ! అనాలనిపించడం లేదూ?’) ప్రయత్నం చేయడం చాలా బాగుంది.
పుస్తకానికి అంపశయ్య నవీన్ ముందుమాట రాశారు. (చిత్రకారుడు బాపు ఈ రచయిత్రిని పిన్నమ్మ అని ప్రేమగా అన్నారా? లేక ఈమె నిజంగా పిన్నమ్మగారా?) రచయిత్రి, బుచ్చిబాబు ఇద్దరూ మంచి చిత్రకారులు కూడా. ఇక వారు తమ రచనలలో బొమ్మ గీసినంత అందంగా, వివరంగా విషయాలను, సన్నివేశాలను అందిస్తారనడంలో అనుమానం ఉంటుందా?
కొందరి జీవితాల్లో ప్రతి సంఘటన, ప్రతి దినం ఒక మరుపురాని విషయంగా మిగిలిపోతాయి. రచయితగా, ఆకాశవాణి అధికారిగా బుచ్చిబాబు గడిపిన జీవితం అచ్చంగా అటువంటిది. ఎందరో పెద్దలు, ఎన్నో సంఘటనలు! అన్నీ మనమంతా విని ఆనందించదగినవి, (వలసినవి కూడా), మహామహులు ఆఫీసు పనిమీద వచ్చినాసరే, ఇంటికి తెచ్చి ఆతిథ్యం ఇచ్చిన ఈ దంపతుల అనుభవాలు, జ్ఞాపకాలు కల్పించిన కథలకన్నా బాగున్నాయి. వాటిని రచయిత్రి చెప్పినతీరు మరింత బాగుంది. (ఆమె అమాయకత్వం, మంచితనం అడుగడుగునా చదువరిని ఆనందంలో ముంచెత్తేవిగా ఉన్నాయి. అసలు, ప్రతి శీర్షిక కింద కనిపించే పేర్లన్నీ పట్టిక వేస్తే, సాహిత్య రంగంలో ఆనాటి మేటి వ్యక్తులు వరుసగా ఎదుట నిలబడతారు. వాళ్లలో ఎవరిని ప్రస్తావించినా, మిగతావారిని వదిలిన భావం కలుగుతుంది. కవర్ పేజీ మీద, వెనుక కవర్ మీద రచయిత్రి చిత్రాలున్నాయి. అవి జీవితంలోని పరిణతిని చెప్పకుండానే చెపుతున్నాయి.
‘జ్ఞాపకాలనేవి కేవలం వ్యక్తిగతమయినవే అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు’అన్నారు. ‘ఆమె మన పక్కన కూర్చొని, మనతో ముచ్చటిస్తున్నట్లుగా ఉంది’ అన్నారు. పుస్తకం చదివినంత సేపూ ఈ భావనలు మనసులో మెదులుతూనే ఉన్నాయి!

-కె.బి.గోపాలం