అక్షరాలోచన

చీకటి వేటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం అనాగరిక దృశ్యంగా
ఎందుకు మారింది?
పైకి ఆధునికత లోపల పురుగుల పెంట
తెల్లబట్టల వెనుక దాక్కొన్న
పచ్చనోట్ల వేట సంగతేమిటి?
వాడు చదువుకున్నోడే
పట్టాలు డిగ్రీలు ర్యాంకులు పతకాలు
వాడు చదువుకున్నోడే
స్కూలు మెట్లే కాదు
సాహిత్య మెట్లు ఎక్కిన వాడే
శ్రీశ్రీ, చలం, విశ్వనాథ
ఎన్నో చదివాడు వాడు
పచ్చనోట్ల పిచ్చేమిటీ?
కడుపుంది కనుక మేత కావాలి
రెండు మెతుకులు చాలా
నగ్న శరీరానికి
రెండు నూలుపోగులు చాలా
లక్షల కోట్లు అవసరమా?
వాడు భగవద్గీత వల్లిస్తాడు
క్షణం కృష్ణుడవుతాడు
వాడికి భూములు - భవంతులు
వాడు డాక్టర్ యాక్టర్ సెక్టర్
అన్నీ వాడే
చదువు నేర్పని సంస్కారవంతుడు
సేవ, కళ, మానవత్వం
మాటలకేం జోరు..
వీడికి లక్షల కోట్లు కావాలి
వీళ్లు జనం వేటగాళ్లు తప్ప
జగతి మల్లెమొగ్గలు కాదు.
*

-సిహెచ్.మధు 9949486122