అక్షర

చేనేత వ్యథల కథల దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావనాఋషిగా పేరొందిన భావనారాయణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. పద్మశాలీ వంటి చేనేత వస్తద్రారులకి ఆరాధ్యదైవం. ఇతని దేహ భాగాల్నుండి మగ్గంని తయారు చేశాడని వస్తక్రారుల విశ్వాసం. వీళ్ళ సంతతికి ‘పద్మ’ అని పేరు. సాలె పురుగు అల్లినట్టుగా బట్టనేస్తారు కాబట్టి ‘సాలీ’గా వ్యవహరిస్తారు.
షాజ్‌హాన్ కుమారుడు ‘దారా’ వివాహ వేడుకలు సందర్భంగా రాకుమారి జహనారా కోసం వంగదేశ నేతగాడు ‘ఖాన్‌సాబ్’ పాలనురుగులాంటి తెల్లని మేలి ముసుగుని తీసుకొస్తాడు. దానిని సర్దడానికి ముందు ‘గూంఘట్’తో సమస్య మొదలవుతుంది. విశ్రాంతి మందిరంలోకి తండ్రిని కలవడానికి వెళ్ళబోతూంటే మేలిముసుగు కొసకి కాగడామంట అంటుకుంటుంది. వైద్యులు ఇచ్చిన వేపనాలు, లేహ్యాలు, మందులతో కాపాడబడుతుంది. అప్పుడు తలెత్తిన సందేహం - ఆ మేలిముసుగులోని ఆరు పొరలే రాకుమారి ప్రాణాన్ని కాపాడాయా అని! ఖాన్‌సాబ్‌ని గజారోహణ చేయించి, కానుకలిచ్చి పంపుతాడు చక్రవర్తి.
మొగలుల కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన నేతకారులు నెయ్యడానికి నూలు, పట్టు లేక, నేసిన వస్త్రాలు కొనేవాళ్ళు లేక అల్లాడిపోయారు. ఎగుమతులు ఆగిపోయాయి. బ్రిటీష్ - ఫ్రెంచ్ వాళ్ళ మధ్య అధికారం కోసం జరిగిన పోరులో ఆర్థిక మాంద్యం ప్రబలిపోయింది. ‘పలషి యుద్ధం’లో సిరాజుద్దౌలాని హతమార్చిన రాబర్ట్ క్లైవ్ సైనికులతో ఒక అర్ధరాత్రి నేత కార్మికులవీ, వాళ్ళ పిల్లలవీ బొటనవేళ్లు కత్తిరింపజేశాడు. సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలోని చేనేత కార్మికులంతా చెల్లా చెదురైపోయారు. ఇంగ్లాండ్‌లో మిల్లు వస్త్రాలే దిక్కయ్యాయి. పత్తిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసి, నేత బట్టల్ని ఎగుమతి చెయ్యకుండా ఆంక్షలు విధించడంతో, తంతీల వేదనకి అంతులేకుండా పోయింది. అయినప్పటికీ ఒక దాకా తంతీ సన్నని మస్లిన్ బట్టతో ఆరు నెలలు శ్రమపతి ‘ఆరుగజాల చీర’ని నేసి అగ్గిపెట్టెలో పెట్టి విక్టోరియా రాణికి కానుకగా పంపాడు. భారతదేశాన్ని పూర్తిగా వ్యవసాయాధారిత దేశంగా మలిచి, పంధొమ్మిదో శతాబ్ధాంతానికి పల్లెల్ని పనిలేని వస్త్ర, ఇతర కార్మికులతో నింపేసింది. ఈలోగా గాంధీజీ ‘ఖాదీ ఉద్యమ’ మొదలై మిల్లు వస్త్రాలను తగలబెట్టి నిరసనను వ్యక్తం చేశారు. ఫలితంగా పల్లెల్లో రాట్నాలు తిరగడం మొదలయ్యాయి. ఆర్థిక మాంద్యం వల్ల ఖాదీ ఉద్యమం ప్రపంచ నలుమూలలకీ విస్తరించి లాంక్‌షైర్ మిల్లులు మూతపడ్డాయి. స్వాతంత్య్రానంతరం ఖాదీ బోర్డు వంటి సంస్థల ఏర్పాటుతో చేనేతకారులకి రాయితీలు, సహకార సంఘాలు, ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. 1989లోని ఆర్థిక విధానం నేత కార్మికుల జీవితాలను అంధకారంలో ముంచెత్తింది. దేశం నలువైపులా ఆత్మహత్యలు, వృత్తి మార్పులు, విషాదగాథలు చోటుచేసుకున్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రపంచ స్థితిగతులనే మార్చివేసింది. సేలం, బెంగాల్, ఆంధ్రపద్రేశ్‌లలో ఆత్మహత్యలు సంభవించాయి. బెనారస్, అస్సాం, మణిపూర్, ఒరిస్సాలలో ఇతర వృత్తులతో రోజుకూలీని ఆశ్రయించారు చేనేత కార్మికులు.
ఈ ఇతిహాసిక, చారిత్రక పరిణామాల నేపథ్యంతో కథాంశాన్ని ఆధునిక ఇతివృత్తంగా మలచుకుని ‘‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’’ నవలను చిత్రీకరించారు రచయిత్రి మంథా భానుమతి. వస్తక్రారుల జీవన స్థితిగతుల చిత్రానే్వషణలో భాగంగా ఈ కథాకథనం కొనసాగుతుంది. కథాంశం విషయానికొస్తే ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల మూల కథన ఇతివృత్తంతో ఈ నవలా రచన ప్రారంభమవుతుంది.
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట సెంటరు వాసి భద్రం. కథానాయకుడు. బలాదూర్‌గా తిరిగే సినిమా పిచ్చోడు. అసలు పేరు వీరభద్ర స్వామి. కోనసీమ గ్రామం ‘శ్రీలంక’లో మాస్టర్ వీవర్ సోమశేఖర్రాజు పెద్ద కొడుకు. ఇతని రెండో కొడుకు దేవరాజు. చాలా జాగ్రత్తపరుడు. వంద కుటుంబాలకు ఉపాధి కలిగిస్తున్న వ్యక్తి సోమశేఖర్రాజు. అతిపెద్ద బట్టలషాపుకి ఓనరు. గుంటూరు జిల్లాలోని మరొక చిన్న పల్లె ‘సిరిపాలెం’. పద్మశాలీ కార్మికులున్న వందగడపల ఊరు. ఈ పల్లెలో ఉంటోంది కథానాయకి లక్ష్మి, ఈమెకి అన్న సాయి. రావమ్మ తల్లి. ఈ గ్రామం వస్తక్రారుల సంఘం కార్యదర్శి వీర్రాజు. లక్ష్మి కుటుంబాన్ని తలలో నాలుకలా కాపాడుకొస్తున్న పెద్ద మనిషి. భావనాఋషి ఉత్సవంతో ఇక్కడ కథ మొదలవుతుంది.
జగన్ - జెన్నిఫర్ జంట శ్రీలంకలో తమ బంధువర్గాలతో అడుగుపెడతారు. జగన్ అమలాపురం వాసి అయినా, కాకినాడలో మెడిసన్ చదివి అమెరికా వెళ్ళి, డాక్టరుగా స్థిరపడ్డాడు. జెన్నిఫర్‌ని పెళ్ళి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ప్రాక్టిసనర్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థలో వాలంటీర్లు. బీద దేశాలకు కూడా వైద్య సేవలందిస్తుంటారు. బట్టల షాపులో గోపి తన తండ్రి అనారోగ్య పరిస్థితి చెప్పగానే మీనాతో సహా అక్కడికి ప్రయాణం కడతారు. గోపి తండ్రి సుబ్బన్నకి టీబీ ఉందని గ్రహించి, జ్వరం రాకుండా ఇంజెక్షన్ ఇస్తాడు జగన్. అక్కడ సమస్యలకు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటాడు.
జిల్లాకే టెంత్‌లో ఫాస్టొచ్చిన లక్ష్మిని తల్లి రావమ్మ చదువాపేయబోతే కోడలు ఉమ, కార్యదర్శి వీర్రాజు అండగా నిలుస్తారు. విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో జాయినవుతుంది లక్ష్మి. దేవరాజుకి జె.ఇ.ఇ.లో రేంకు రావడంతో భద్రం, సోంరాజులతో కౌన్సిలింగ్ కోసం మద్రాసు బయల్దేరుతాడు. మంగళగిరి బస్టాండ్‌లో దిగి వీర్రాజుంటికి వెళ్ళడానికి ఆటో బేరమాడుతుండగా, బస్సు దిగిన లక్ష్మి అరటిపండు తొక్కమీద కాలేసి జారిపోతుంది. సోంరాజు ఆమెను లేవదీసి అసలు విషయం చెబితే ఆమె వాళ్ళని వీర్రాజుకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళను కార్లో పంపిస్తాడు వీర్రాజు. కానీ దేవ్‌కి అనుకున్న సీటురాదు. చెన్నై ప్రయాణంలో బస్సులో కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్ శివకుమార్ పరిచయం కొత్త మలుపుని తిప్పుతుంది.
లక్ష్మిని లైబ్రరీలో దేవ్ కలుసుకుంటాడు. అప్పటికే భద్రానికి కొమరపాలెంలో ఫీజు కట్టేసి, దేవ్‌ని గుంటూర్ విజ్ఞాన్‌లో చేర్పిస్తాడు సోంరాజు. ఈలోగా భద్రం పాలిటెక్నిక్ పూర్తిచేసి డిప్లమా తీసుకుని నాలుగేళ్ళవుతుంది. దేవ్ టి.టి. ఇంజనీరింగ్ కానిచ్చి, ఢిల్లీలో యమ్‌టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లక్ష్మి బి.టెక్ అయ్యాక ఢిల్లీ ఐఐటీలోనే టీటీ యం.టెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. యువకుల ఉపాధి పథకం కింద భద్రం బేంకు లోను తీసుకుని బైర్రాజు, రాంరాజులతో కలిపి అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో చేనేత వస్త్రాల షాపులు తెరిచాడు. మీనా సోంరాజుగారి షాపులో పి.ఆర్.ఓ.గా చేస్తుంది. భద్రం ‘సిమ్వ’లో చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టాడు. ఈలోగా వీర్రాజు బృందం బెనారస్ వచ్చారు. అక్కడి నుండి కాశీకి ‘పుల్లు’సాబ్ పడవమీద తిరగసాగారు. ‘2020-హాండ్‌లూమ్ విజన్’ అనే ఉద్యమానికి స్నేహితులతో చేతులు కలిపాడు భద్రం. దేవ్, లక్ష్మిలు రీసెర్చి ప్రారంభించారు. లక్ష్మి నూలుదారంలోని సెల్యులోడ్ నాణ్యతని పెంచే పరిశోధన చేస్తోంది. దేవ్ ముడిప్రత్తి నుండి నూలు యాన్ తయారు చేయడంలో మార్పులకి కృషి చేస్తున్నాడు. ఇలా అనేకానేక మలుపులతో సాగిన కథలో చివరికి -‘ఆల్ ఇండియా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్’ ప్రారంభికులు - ‘వీరభద్రం-లక్ష్మి’ దంపతులకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చారు రాష్టప్రతి. పరంధాములు, నారాయణప్ప ఇద్దరూ చెరోటీ అగ్గిపెట్టెల తీసుకొచ్చి లక్ష్మి చేతిలో పెట్టారు. సభలోనివారంతా చూస్తుండగా, భద్రం ఒక్కొక్క అగ్గిపెట్టెలోంచి ఆరుగజాల సిల్కు చీరని తీసి, లక్ష్మి భుజాల మీంచి కప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. చనేతకారుల జీవన స్థితిగతులపై ఇంత మంచి నవలను విశే్లషణాత్మకంగా రాసిన రచయిత్రి మంథా భానుమతిగారిని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం!
..........................................................................................

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-మానాపురం రాజా చంద్రశేఖర్