అక్షర

లలితా సౌందర్యలహరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లలితాసహస్ర నామ స్తోత్రము
డాక్టరు లంకాశివరామప్రసాద్
మూల్యం: రూ.200/- లు
ప్రతులకు: రచయత
శ్రీజన లోకం/ రైటర్స్ కార్నర్
ప్రశాంత్ హాస్పిటల్
శివనగర్, వరంగల్-506002
8897849442
**
చల్లనిచూపుతో అమ్మలగన్న అమ్మ కామేశ్వరుని అంకపీఠాన్ని అలంకరించి ఉండగా ఆమె దృష్టి తనపై పడాలని ప్రతిభక్తుడూ కోరుకుంటాడు. శ్రీమత్సింహసనేశ్వరిని గూర్చి ఏమి తెలియని వారు సైతం అమ్మరూపును భావించి పరవశిస్తారు. అటువంటి అమ్మ సౌందర్యమూ, అమ్మ అనురాగదృక్కుల గురించి రహస్యాలను తెలిసిన వారు అమ్మను సౌందర్యాన్నో, అమ్మ కరుణామృతాన్నో ఆస్వాదించాలని ఇంకెంతగా అభిలషిస్తారో కదా. అమ్మ గురించి తెలిసిన వారు ఆ అమ్మ పంచే ఆనందాబ్ధిలో మునిగిన వారు తమ పక్కవారికీ ఆ ఆనందాన్ని పంచాలనే ఉత్సుకతను ప్రదర్శించడమూ సహజమేకదా.
అటువంటి వారే లంకాశివరామప్రసాద్‌గారు. ఎన్నో కావ్యాలను, మరెన్నో గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించారు. పరమాత్మగురించి తెలుసుకొని అమ్మ ఆరాధనలోని ఆనందాన్ని చవిచూచారు. అమ్మ కరుణను పొందిన వీరు ఆ కరుణామృతాన్ని నలుగురికీ పంచాలని యోచించారు. ఆ యోచన ఫలితమే ఈ ‘‘శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము’’ .
భారతీయ సంప్రదాయం అటు పండితులను, ఇటు పామరులను కూడా దైవం వైపు మరల్చడానికి అటు సగుణారాధనను, ఇటు నిర్గుణారాధనను కల్పించింది. సగుణారాధన కొన్ని దినాలకు నిర్గుణారాధనకు దారితీస్తుంది. అట్లానే అఖిలభువనాలను తన కనుసన్నలలో కదలాడించే శ్రీమాతను ఉపాసించడానికి సగుణారాధనను ఆరంభించి రూపపరిమితిని దాటి గుణపరిమితిని చేరి అక్కడ నుంచి ముందుకు జరిగి నిర్గుణస్థాయికి ధ్యాన సోపానాన్ని నిర్మిస్తుంది అనే కోవెల సుప్రసన్నాచార్య గారి మాట అక్షరీకరించడానికి శివరామప్రసాద్ గారు లలితా సహస్ర నామావళిని సామాన్యులకు కూడా సులభంగా అర్థమవడానికి
‘‘షట్చక్రములను భేదించి చేరును సహస్రారము
చంద్రమండలమున కురిపించు అమృత వర్షము
డెబ్బది రెండు వేల నాడుల అద్భుత ప్రవాహము
మరల అధోగమనయై త్రిపురాల మీదుగా చేరును మూలాధారము’’
ఇంత చక్కని అలతి అలతి పదాలతో అమ్మ ను వర్ణించారు. ఇది చదివిన వారికి సూటిగా హృదయగతవౌతుంది. ఆనందాబ్ధిలో అలవోకగా మునకలు వేయడం జరుగుతుంది. అమ్మ అనురాగసుధామృతాన్ని గ్రోలడం మినహా మరేమీ చింత లేకుండా చేస్తుంది.
నవమాసాలు పెరిగిన శ్రీయంత్ర వృక్షం
ఇరవై నాలుగు రేకుల పుష్పమాయెను
భూప్రస్తార యంత్రమది రేఖానిర్మితం
మేరు ప్రస్తార యంత్రమది పర్వత రూపం
అంటూ అమ్మను సునిశితంగా లలితాసహస్ర నామావళికి భాస్కరరాయ ‘సౌభాగ్య భాస్కర’, భట్టనారాయణుని ‘జయమంగళవాఖ్య’ లలితాసహస్రనామావళిని అర్థం చేసుకోవడానికి ఇవి సులభమైనవి అంటూనే లలితాసహస్రనామస్తోత్రము అన్న పేరిడి ఆ నామావళి హృదయోల్లాస వ్యాఖ్య చేశారు రచయిత. అంతేకాక శ్రీ లలితా సహస్రనామార్థాలను ఇచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి గురించి అన్ని వివరాలను సంగ్రహంగా ఇచ్చారు. శ్రీ చక్రనిర్మాణం గురించి విపులీకరించారు. నవ రంధ్రాలున్న ఈ మానవ దేహమే అమ్మ నివసించే నవద్వారాలున్న మణిపురం అంటూ లలితా సహస్రనామం గురించిన అనేకానేక విషయాలను వివరంగా చెప్పి ఇంకా ఇంకా అమ్మ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసను సామాన్యపాఠకులకు కూడా కల్పిస్తున్నారు. శ్రీవిద్య, శ్రీ చక్రము గురించిన విజ్ఞానాన్నంతా ఈ చిరుపొత్తంలో వివరించడం ...
పంచభూతాలు శక్తి రూపాలు
మాయాదులు శివసంబంధాలు
చరమైన పిండాండం అచర బ్రహ్మాండం
యాభై ఒక్క తత్వాల మహాభాండం - లంకాశివరామప్రసాద్ చెప్పిన ఈ ‘‘శ్రీలలితాసహస్రనామస్తోత్రము’’ సంపూర్తిగా చదవాల్సిన పుస్తకం అని ప్రతి చదువరికి అనిపిస్తుంది. ఏకబిగిన చదివించే శైలితో సులభగ్రాహ్యమైన పదాలతో ఉన్న ఈ లలితా సహస్రనామ స్తోత్రము జిజ్ఞాసువులందరూ ఆసక్తిని కలుగచేస్తుంది.

-రాయసం లక్ష్మి