అక్షర

నూరేండ్లనాటి సంస్కృత రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఙ్కణబన్ధ రామాయణమ్
-చర్ల భాష్యకార శాస్ర్తీణా
వెల: తెలుపలేదు,
ప్రతులకు: చర్ల కృష్ణమోహనశాస్ర్తీ
కాకరపర్రు,
పెరవలి మండలం,
ప.గో.జిల్లా.
***
చిత్ర కవిత్వము బంధ కవిత్వము ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. అప్ప కవీయంలో వీటి వివరాలు చూడవచ్చు. ఇవి రచించడానికి ప్రతిభ మాత్రమే చాలదు. అత్యంత పాండిత్యము కావాలి. ఇక సంస్కృతములో బంధ కవిత్వము వ్రాయాలంటే ఆ వ్యక్తి ఎంతటి విద్వాంసుడో ఊహించుకోవచ్చు. నేటికి సుమారు నూరు సంవత్సరాల క్రితం చర్ల భాష్యకారశాస్ర్తీ అనే విద్వాంసుడు సంస్కృతంలో కంకణబంధ రామాయణము రచించారు. ఇందలి ప్రతి శ్లోకము మనం చేతికి ధరించే కంకణ రూపంలో కూర్చబడుతుంది. ఈ కవిగారు లోహిత గోత్రోద్భవుడు నూజివీడు జమీందారుగారైన మేకా వేంకట రంగయ్య అప్పారావుపై గల అపార గౌరవంతో మేకాధీశ పదప్రయోగంలో దీనిని రచించారు. (ఇందలి మేక- పదము తెలుగు కాదు.) విద్వాంసులైన దోర్బల ప్రభాకరశర్మగారు ఈ గ్రంథ పునర్ముద్రణ, వ్యాఖ్యానువాద బాధ్యత స్వీకరించటం ముదావహం. వీరు కొవ్వూరు సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు. చర్ల భాస్కరరామశాస్ర్తీ ఇతర కుటుంబ సభ్యులు పూనికతో ఈ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు. పెరవలిలో భాష్యకార శాస్ర్తీగారికి మేకాధీశశాస్ర్తీ అనే పేరు ఉంది. కారణం మే-కా-్ధ-శ- అనే నాలుగు బీజాక్షరములను తీసుకొని సందర్భోచితంగా మేకా రంగయ్య అప్పారావుగారిని స్ఫురింపజేయటం విశేషం. ప్రతి శ్లోకము పుష్పమాలికా రూపంలో ఉంటుంది. మూలకథ సుపరిచితమే అయినా బంధ కవిత్వము కాబట్టి సాధారణ పాఠకులకు వ్యాఖ్యానము అవసరమే. ఈ కొరతను ప్రభాకర పండితులు తీర్చారు. ద్వాత్రింశత్ శ్లోక పరిమాణ గ్రంథము వ్యాఖ్యానముచే విస్తృతినందింది. భాష్యకారశాస్ర్తీగారి వద్ద శృంగేరీ పీఠాధిపతులు తర్క వ్యాకరణ శాస్తమ్రులు అభ్యసించారు అంటే భాష్యకారశాస్ర్తీగారి గొప్పతనం మనకు తెలుస్తుంది. వీరు రచించిన ఇతర గ్రంథములు వీరి జీవిత విశేషములు క్రమంగా వీరి కుటుంబ సభ్యులు వెలుగులోనికి తీసుకొని రావలెనని సంకల్పించి అట్టి సమాచారం తెలిసినవారు తమకు పంపవలసిందిగా కోరుతున్నారు. విలోమం అనులోమమైనా అనులోమం విలోమమైనా ఏకరూపంలో ఉన్న ఈ 31వ శ్లోకం చూడండి.
శ్రీశ్రీ శాధీ కామేరసా రాధారాధీ దా భూజారా
రాజా భూదాధీరా ధారా సారా మేకా ధీశాశ్రీశ్రీ22
ఈ శ్లోకం వెనుకనుండి ముందుకు ముందునుండి వెనుకకు ఎలా చదివినా సరిపోతుంది. ఇలాంటి అద్భుత చమత్కృతులు ఆనాటి పండితులు ప్రదర్శించారని ఈతరం వారికి తెలియదు. ఇతివృత్తంకోసం కాదు ప్రాచీన కవుల పాండిత్యంకోసం ఇలాంటి గ్రంథాలు నేటి విద్యార్థులు అధ్యాపకులు కూడా పఠించాలి.

-ముదిగొండ శివప్రసాద్