అక్షరాలోచన

బోధివృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ చెట్టు అయినా
బోధివృక్షం కావచ్చు
దాని కింద
నిజంగా బుద్ధి వెలిగితే.

మెరుపు మెరిసేది
త్రుటికాలమే కావచ్చు
దాని కోసం
ఎన్ని చీకట్లను మింగిందో!

ఆ చెట్టు
నీడకు సృష్టికర్త
ఒక్కొక్క ఆకునే తొడిగి
దట్టంగా అల్లిన ఛాయాఛత్రం
ఆ అల్లికకు కారణం
నేలలో రాలిన విత్తనం కావచ్చు
ఆ విత్తనం మట్టిలో చేసిన
నిశ్శబ్ద యాత్ర కావచ్చు
ఆ యాత్ర సారాంశమే
తపస్సు.

ఆ సారాంశంతోనే
ఆగిపోతే
అది కేవలం నాంది.
అది జనంలోకి ప్రవహించాలి
కాంతి పరావర్తనం చెంది
దృశ్యంగా రూపొందాలి
ఆ దృశ్యంలో మనిషికి
తనకు తాను కనిపించాలి.
*

-డా.ఎన్.గోపి