అక్షర

ఈ యజ్ఞం.. వీరభద్ర విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బమ్మెర పోతన రచించిన
వీరభద్ర విజయము
(కాశీభొట్ల సత్య
నారాయణ వ్యాఖ్యానంతో)
వెల: రూ.225/-;
ప్రతులకు:
ఎస్.ఆర్.బుక్ లింక్స్
దానయ్య వీధి, మాచవరం, విజయవాడ-4
మరియు ఆంధ్ర-
తెలంగాణాలలో అన్ని ప్రముఖ పుస్తక కేంద్రములు.
**
‘‘వీరభద్ర విజయం’’ నాలుగు ఆశ్వాసాల కావ్యం. పోతనామాత్యుని ప్రథమ కావ్యం. భాగవతానికి చాలాముందుగా వ్రాయబడింది. ‘‘్భగినీ దండకం’’కంటె కూడా ముందే కావచ్చు. వ్యాఖ్యానకర్త కూడా ఈ మాటనే తన ‘‘ఒక్క మాట’’ (పేజజజ) లో చెప్పారు. రెండు మన్యంతరాలలో రెండుసార్లు జరిగిన దక్షయజ్ఞ ధ్వంస రచనే ఈ ‘‘వీరభద్ర విజయం.’’ ఒక యజ్ఞం ‘‘చాక్షుస’’ మన్వంతరంలో జరిగితే మరొక యజ్ఞం. ‘‘వైవస్వత’’ మన్వంతరంలో జరిగింది. ఈ వైనాన్ని వ్యాఖ్యాత తన ముందుమాట (ఒక్కమాట)లో వివరించారు. ఎప్పుడో యాభై ఆరు సంవత్సరాల క్రిందట వావిళ్ళవారు ప్రచురించిన ప్రథమ ప్రచురణానంతరం ఇప్పుడు శ్రీరాఘవేంద్ర ప్రచురణ సంస్థ సవ్యాఖ్యగా తిరిగి ప్రచురించారు. సంతోషించదగిన విషయం. పోతన కవిత్వాన్ని సమీక్షించవలసిన అవుసరం న్యాయంగా లేదు. నిజానికి బమ్మెరపోతన సహజ కవి. భాగవత పద్యాలు కొన్నైనా రాని తెలుగువాడు తెలుగువాడుకానే కాదు. ముఖ్యంగా రుక్మిణీ కల్యాణం గజేంద్రమోక్షం. ప్రహ్లాద ఘట్టం నారాయణ కవచం తెలుగువారి (తెలుగునాట) భక్తిసామ్రాజ్యం. ఐతే భాగవతమంత ప్రసిద్ధి చెందిన కావ్యం వీరభద్ర విజయంకాకపోవటానికి కారణం కవిగారి భక్తిజ్ఞాన వైరాగ్యాలు వీరభద్ర విజయాంతర్వాహినిగా జాలువారలేదు. వీరభద్ర విజయం నాటికి పోతన భాగవత కృతికైనంత కూర్పరి కాలేదు. భాగవతంలో దక్షయజ్ఞ ధ్వంస సందర్భమున పోతన చేసిన శివ నిందా దోషము సమసిపోవటానికి పోతన ‘‘వీరభద్ర విజయాన్ని’’ వ్రాసినట్లు లోకంలో ఒక విచిత్రోక్తి వుంది. ఆ విషయం వీరభద్ర విజయంలో షష్ఠ్యంతములకు పూర్వం ఒక పద్యం (ప.నెం.41)లో వుంది. ఆ పద్యం ఇది.
‘‘్భగవత ప్రబంధ మలభాసురతన్ రచించి దక్షదు
ర్యాగ కథా ప్రసంగమున నల్పవచస్కుడనైతి తన్నిమి
త్తాగత వక్త్రదోష పరిహారముకై యజనైక శైవశా
స్త్రాగమ వీరభద్ర విజయంబు రచించెద వేడ్కణమదిన్’’
(పే.27 ప.41)
ఈ పద్యము వావిళ్ళవారి ప్రతులలో లేదు. లేని మాటయే నిజమైనచో ఇది ప్రక్షిప్తమే అయి వున్నట్లైతే గ్రంథ రచనా వివాదము మూడువంతుల ముప్పాతిక పరిష్కారమైపోతుంది. ఇది ప్రక్షిప్తమే అన్నది నిజమే అనుకొందాం. ఈ గ్రంథాన్ని వ్రాయడానికి పోతనను ప్రోత్సహించిన వాడాతని గురువు ఇవటూరి సోమశేఖరుడు. ఆ గురువు పోతనతో
‘‘.. ఇప్పుడు మాకెల్ల నూహలోన/
వింత పండువు బోలెను వీరభద్ర
విజయమెల్లను విన గడువేడక్కయయ్యె
అది తెలుంగున రచియింపు మభిమతముగ’’ (ప.20)
‘‘పిన్నవాడననియు పెక్కు సంస్కృతులను
వినని వాడననియు వెఱపు మాను
మత్ప్రసాద దివ్య మహిమచే నెంతైన
కవిత చెప్పులావు కలదు నీకు’’ (ప.21)
అని అన్నాడు. దీనినిబట్టి పోతన చిన్ననాటనే ఈ ‘వీరభద్ర విజయం’ వ్రాసినాడనుటయే జరిగుండును. ఉపరి ఆ వయసు నాటికతడు వీరశైవుడు. అందుకు నిదర్శనంగా అవతారికలో పద్యాలున్నాయి. తండ్రి తన విద్యాగురువైనట్లు ‘‘జనక శిక్షిత నిహితాక్షరాభ్యాసుండను’’ అని చెప్పుకొనెను. భాగవతము నాటికతడు స్మార్తుడయ్యా డు. పాండితే గరిమ పతాక స్థాయికి చేరింది. భాగవతమున కనిపించు కవితా లక్షణములు, మొదటే చెప్పుకున్నట్లు వీరభద్ర విజయమున లేవు. ఇది నిస్సంశయముగా పోతన చిన్ననాటి కృతియే. ఎడనెడ భాగవత స్థితి వీరభద్ర విజయమున అంకురమునకు రాని బీజములుగానే కనిపిస్తాయి. పరిణామ క్రమములో వీరభద్ర విజయము తొల్లిటిదైనను; పరమేశ్వర భక్తి ప్రపత్తులు అంతటా కనిపిస్తునే వుంటుంది. శ్రీ కాశీభొట్ల సత్యనారాయణగారి వ్యాఖ్య సులభశైలిలో జనగ్రాహ్యంగా ఉంది.

-సాంధ్యశ్రీ