అక్షర

ఆత్మకథలో అసలు చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా సిరిచుక్క సికింద్రాబాద్
-శారదా అశోక్‌వర్ధన్
వెల: రు.100
ప్రతులకు: ప్రముఖ
పుస్తక శాలలు
**
కొందరు చారిత్రక రచన చేస్తారు. మరికొందరు ఆత్మకథ రాసుకుంటారు. కానీ శారదా అశోక్‌వర్ధన్ రెండూ కలిపి రాసారు. అంటే ‘నా సిరిచుక్క సికింద్రాబాద్’ అనే పుస్తకం చారిత్రకతో కూడిన స్వీయకథ. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగి చదువుకున్న శారదా అశోక్‌వర్ధన్ తన పుట్టుకనుంచి నేటివరకు సికింద్రాబాద్‌తోపాటు తాను ఎలా ఎదిగిందీ విడమరిచి చెప్పారు. ఇటువంటి రచనలు అరుదుగా వుంటాయి. 1806 నుంచి సికింద్రాబాద్‌గా నగరం పిలువబడింది.
సికింద్రాబాద్ పేరు ఎలా వచ్చింది?
లష్కర్ అంటే ఏమిటి?
ఇప్పటి బోట్స్‌క్లబ్ చరిత్ర ఏమిటి?
ఒకప్పటి ఈస్ట్‌మారేడ్‌పల్లి, మహేంద్ర హిల్స్ వివరాలేమిటి?
సికింద్రాబాద్‌లో పుట్టిన లబ్ధప్రతిష్టులెవరు?
టాంగాలు రిక్షాల గురించి, జేమ్స్ స్ట్రీట్ గురించి ...ఇలా అలనాటి మధుర జ్ఞాపకాలను విశేషాలను పూసగుచ్చినట్టు తెలిపారు. వీటితోపాటు శారదా అశోక్ వర్ధన్ గారి జీవిత పయనం తెలుసుకుంటాం. వీరి జీవిత యానం పూల బాట కాదు. కష్టాలు, బీదరికం అధిగమించి బాలభవన్ సంచాలకులుగా రచయిత్రిగా ఎలా ప్రసిద్దికెక్కారో అరటిపండొలిచిపెట్టినట్టు వెల్లడించారు. నిరాశా నిస్పృహలనుంచి విత్తనంలోంచి మొక్క వచ్చినట్టు అంచెలంచెలుగా ఎదిగినతీరు స్ర్తిలకి గుణపాఠం! ముఖ్యంగా నేటి యువతులు చదివి ఆత్మవిశ్వాసాన్ని పొందాలి. కథలు, నవలలు, బాలసాహిత్యం, నాటికలు...ఇలా ఈమె రచనలు బహుముఖీనం. ముళ్లబాటను పూలబాటగా మార్చుకున్న శారదగారి అనుభవాలు స్పూర్తిదాయకం. దాదాపు అరవై సంవత్సరాల సాహితీ గమనం చేసినా తాను పుట్టిన సికింద్రాబాద్‌ను ‘సిరిచుక్క’గా భావించడం ఆవిడ సంస్కారానికి చిహ్నం. ఇది అందరూ నేర్చుకోవాలి. భాగ్యం, ఆదృష్టం, సాహితీ సంపద వంటి అర్ధాలు ‘సిరిచుక్క’కి అన్వయించుకోవాలి. చరిత్రకారులకి ఈ రచన ఉపకరిస్తుంది. పదవి, సంపదలకోసం వెంపర్లాడుతున్న యువతీ యువకులకి సందేశాన్నిస్తుంది. మొత్తంమీద చారిత్రక, సందేశాత్మక స్వీయ కథారచన ‘నా సిరిచుక్క సికింద్రాబాద్’.

-ద్వా.నా.శాస్ర్తీ