అక్షర

సందేశాత్మకమైన చిట్టిపొట్టి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరి వెంకటరావుగారి కలంనుండి వెలువొందిన బాల సాహిత్యం కథల సంపుటి ‘తేలుకుట్టిన దొంగ’ చక్కగా బొమ్మలతో అందంగా వుంది. చిన్న చిన్న కథలు, పిల్లలకు చక్కగా అర్థమయ్యే కథలు 18 ఉన్నాయి ఇందులో. అందులో తేలుకుట్టిన దొంగ కూడా ఒక కథ. ఆ కథపేరే పుస్తకానికి పెట్టారు రచయిత. చిన్న చిన్న కథలు, చక్కటి చిత్రాలు, పిల్లలను ఆకర్షిస్తాయి. ఈ గ్రంథాన్ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. రచయిత మంచి చెయ్యి తిరిగిన వారవడంవల్ల సులువైన భాషలో పిల్లలకోసం అద్భుతంగా రాసారు. నైజం, మూఢనమ్మకాల గురించిన కథ, బావకు తగ్గ మరిది, కనువిప్పు కథలు బాగున్నాయి. పిల్లలచేత చదివించాలి. ధర కూడా అందుబాటులో ఉంది. 40 రూపాయలు. ప్రజాశక్తిబుక్‌హౌస్, నవ తెలంగాణ బుక్‌హౌస్‌లో ఈ గ్రంథం లభిస్తుంది.

-శారదా అశోక్‌వర్ధన్