అక్షర

అద్దంలో మహిళా నేతల అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంలో
మహిళా నేతల అంతరంగం
ఆంధ్రప్రదేశ్
రాజకీయాలలో మహిళలు
1952-2016
-డాక్టర్ షేక్ హసీన
వెల: రూ.300లు.
పేజీలు: 358
ప్రతులకు : విశాలాంద్ర, ప్రజాశక్తి అన్ని
పుస్తక కేంద్రాలలో

ఆడవాళ్లకు రాజకీయాలేమి తెలుసు అని ఎగతాళి చేసిన ఈ దేశానికి దాదాపు పదిహేనేళ్లకుపైగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేశారు. వారసత్వంగా వచ్చిన రాజకీయం అని కొట్టిపారేయవచ్చు. రాజకీయరంగంలో నాయకురాలిగానూ, ప్రజాప్రతినిధిగా రాణించాలంటే అందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చే ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఇవి మహిళకు పెట్టని ఆభరణాలు. అయినప్పటికీ ఈ రాజకీయ రంగంలో ఆమె అంతంగా రాణించలేకపోతుంది. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తు వేసే సత్తా చాటుకోవాలంటే సాంఘీక, రాజకీయ విషయ పరిజ్ఞానం ఎంతైనా అవసరం. ఇది లేకపోవటం వల్లే చుట్టూ ఉన్నవారిపై ఆధారపడటం, కొందరైతే సంతకాలకే పరిమితమవ్వటం బాధిస్తుంది. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించటం వల్ల వందలాది మంది మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులుగా రాణిస్తున్నారు. ఇందుగలడు అందులేడన్నట్లు స్థానిక ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరగటం వల్ల సేవా దృక్పథంతో స్వతంత్రంగా అడుగు ముందుకు వేసే మహిళల ముందుర కాళ్లకు బంధాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా మన దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒక స్పీకర్‌ను, ఒక రాష్టప్రతిని, నలుగురు ముఖ్యమంత్రులను ఇలా వేళ్లమీద లెక్కపెట్టగలిగేవారినే ఆదర్శంగా చూపించుకోవాల్సిన అఘాయిత్యం ఏర్పడింది. స్వాతంత్రోద్యమ కాలంలో ఆనాటి మహిళలకు ఎలాంటి రాజకీయ విద్యనేర్పింది లేదు. కాని ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసి దేశ బానిస సంకేళ్లను చేధించారు. కాని ఏడు దశాబ్దాల స్వాతంత్రం తరువాత మహిళలు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో మరింతగా రాణించి రాజకీయ సాధికారిత సాధించకపోతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చట్టసభలలో 33శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రాకపోవటమే.
ఇటువంటి పరిస్థితులలో మహిళా సాధికారితపై కలాలు, గళాలు గొంతెత్తుతున్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ షేక్ హసీన కలం నుంచి ‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మహిళలు’’ అనే పుస్తకం వెలువడం ముదావహం. ఈ పుస్తకంలో 1952 నుంచి 2016 మధ్యగల మహిళా రాజకీయ నేతల గురించి కూడా ప్రస్తావించటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజకీయ చరిత్రను మిళితం చేసి పార్టీల పరిస్థితిని వివరించారు. ఆయ పార్టీలు మహిళలకు ఇస్తున్న ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించారు. ఒక్కొక్క జిల్లాను ప్రామాణికంగా తీసుకుని అందులో ఉన్న నియోజకవర్గాల్లో ఎంత మంది మహిళలు ఉన్నారో తెలియజేస్తూ గణాంక సమాచారం ఇవ్వటంతో పాటు ఆయా మహిళా నేతల మనోభిప్రాయాలను చక్కగా వివరించారు. వారి వ్యక్తిగత ఇష్టాలను, అభిరుచులతో పాటు రాజకీయాల్లో వచ్చిన నేపథ్యాన్ని వివరించటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా అడుగు ముందుకు వేయాలంటునే ఎవ్వరూ కూడా ఈ రంగంలో వివక్షతను ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించకపోవటం గమనార్హం. రోజా వంటి నేతలు ఒకరో ఇద్దరో రచయిత్రి అడిగిన ఇంటర్య్వూలలో చెప్పటం జరిగింది. అలాగే ఇష్టమైన నేతల ప్రస్తావన వచ్చిన సందర్భంలోనూ ఆయా పార్టీల అధ్యక్షులు, తండ్రులు, భర్తల గురించే ప్రస్తావించారు. శోభా నాగిరెడ్డి వంటివారు మాత్రమే ముగ్గురు మహిళా నేతలను ప్రస్తావించారు. కొంతమంది తల్లులను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పటం జరిగింది. ఏదిఏమైనప్పటికీ ఆధునిక మహిళానేతల అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ పుస్తకంలోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా రాజకీయ నేతల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. స్వపక్షం, విపక్షం అనే భేదం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించి తపనపడుతున్న విషయం అవగతమవుతుంది.

-ఆశాలత