అక్షర

మనసుకు కొంగ్రొత్త మనవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసా ఎటులోర్తునో...
(నవల)
అనురాధ (సుజలగంటి)
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
వెల: రు.100
**
వారం రోజులలో మరణిస్తానని తెలియగానే ప్రాయోపవేశం తలపెట్టి చివరి రోజులని భాగవత శ్రవణంతో గడిపిన పరీక్షిత్తు మసలిన కాలంనుంచి మనం ఎంత దూరం నడిచి వచ్చామో ఈ నవల చదివితే అర్ధమవుతుంది. మానసకి నయం కాని జబ్బు వుందనీ ఆమె ఇక ఎక్కువ కాలం బతకదనీ తెలుస్తుంది ఆమె భర్త మహీధర్‌కి, పద్దెనిమిదేళ్ల కూతురు రవళికీ.
బాధాకరమే అయినా భగవన్నిర్ణయాన్ని అంగీకరించక తప్పదని అనుకుంటాడు మహీధర్. ఆ విషయం వెంటనే మానసకి చెప్పవద్దనీ, ఆమెకి తీరని కోరికలు ఏమైనా వుంటే తీర్చి వున్న నాలుగురోజులు ఆనందంగా గడిపి వెళ్లిపోయేలా చూడాలనీ భావిస్తాడు. ఆ మాటే కూతురితోను అంటాడు. అక్కడివరకు మామూలుగా నడుస్తుంది నవల.
ఇక అక్కడినుంచి కథ మలుపు తిరుగుతుంది. సహజంగా సాధారణంగా కనిపించే మహీధర్ వ్యక్తిత్వాన్ని అధిగమించి కొన్ని విశిష్టమైన వ్యక్తిత్వాలనీ వ్యక్తులనీ ఆవిష్కరిస్తుంది. మరణానికి చేరువవుతున్న తల్లికి ‘ఆనందం‘ కలిగించడం కోసం ఆ తల్లికీ తండ్రికీ చెప్పకుండా రవళి చేసే పరిశోధనలు, సాహసాలు, ఊహాగానాలు, నిర్ణయాలూ ఈ నవలయొక్క ప్రత్యేకతలు ప్రశస్తతలు.
‘తన మరణం దగ్గరలోనే ఉందన్న విషయం తెలిసి జీవించే పరిస్థితి ఏ జీవికీ కలగకూడదని నా అభిప్రాయం’ వంటి గంభీరమైన రవళి ప్రతిపాదనలు, తల్లి టీనేజిలో వున్నప్పుడు ఎవరినో ఇష్టపడిందన్న విషయం యాదృచ్ఛికంగా తెలియగానే ‘అమ్మ మనసులో ఎక్కడో అసంతృప్తి వుండి వుంటుందని నా అనుమానం’ అని తన స్నేహితుడితో రవళి చేసే ప్రకటనలు, అసలా విషయం తానెపుడో మరిచిపోయానని చెప్పే తల్లిని తాను ఆమెకన్నా బాగా అర్ధం చేసుకున్నానని భావించి ఆమె మరణించేలోపు ఆమెని ఆమెకి ఇష్టమైన వెనె్నల రాత్రిలో ఆమెకి నచ్చిన వాళ్ల వూరి కొబ్బరితోటలో ఆమె స్నేహితుడితో ఒక్కసారి కలపాలని రవళి చేసే ప్రయత్నాలు-ఇవీ ఈ నవలలోని విశిష్టాంశాలు.
ఇంకా ఈ నవలలో ఇటువంటి విశేషాలతో పాటు మధ్య మధ్యలో సంక్రాంతి మీదా సంగీతంమీదా లఘు వ్యాసాలు, గోత్రాలు ప్రవరల గురించిన వివరాలు కూడా అదనంగా లభిస్తాయి.

-శ్రీ