అక్షర

కాకతీయులపై చారిత్రక నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతాపరుద్రుడు (చారిత్రక నవల).. రచన: ఎస్.ఎం.ప్రాణ్‌రావు
వెల: రు.150/- ప్రతులకు: నవోదయ ఇతర ప్రముఖ గ్రంథ విక్రయ కేంద్రాలు.

**
భారతదేశ చరిత్రలో కాకతీయుల కాలం ఒక స్వర్ణయుగం. సమస్త లలిత కళలు ఇక్కడ వికసించాయి. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందింది. ముఖ్యంగా గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుల పాలనా కాలం చాలా ప్రశస్తమైనది. వీటిపై లోగడ కొంత ప్రామాణిక పరిశోధన జరిగింది. చారిత్రక నవలలు కూడా వచ్చాయి. రుద్రమదేవి-గణపతిదేవుడు సప్తపర్ణి, మాలిక్ కాఫర్ వంటివి ప్రశస్తికెక్కిన చారిత్రక నవలలు ఇప్పుడు ఎస్.ఎం.ప్రాణ్‌రావుగారు శ్రమించి కాకతీయులపై పరిశోధన చేసి ‘‘ప్రతాపరుద్రుడు’’అనే నవలను వెలువరించారు. ఇందులో 1300-1323 నాటి చారిత్రక నేపథ్యం ఉంది. అప్పటి సాంఘిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఆధారంగా నవలా రచన జరిగింది. సందర్భోచితంగా బుచ్చారెడ్డి వంటి కొన్ని కల్పింత పాత్రలను కథాకథనం కోసం వాడుకున్నా సాధ్యమైనంతవరకు చరిత్రను ప్రతిబింబించే రీతిలోనే నవల రచన సాగింది. చారిత్రక నవలా రచన ఒక యోగం- ఒక యాగం- చరిత్రను తెలియనివాడు చరిత్ర హీనుడవుతాడు. ప్రాణ్‌రావు చరిత్రక నవలలు వ్రాయటం ఇది మొదట కాదు. లోగడ వారు వ్రాసిన రచనలు జనాదరణాన్ని పొందాయి. ఈ నవల కూడా అలాగే ప్రజామోదాన్ని పొందగలదని ఆశిద్దాము. వచన రచన సరళంగా ఉండటంలో సామాన్య పాఠకులు కూడా చదువుకొని ఆనందింపవచ్చు. ఆచార్య వై.వైకుంఠం, ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగార్ల వంటి ప్రముఖులు ప్రశంసాపత్రాలు కూడా నవలకు ముందు రచయిత చేర్చారు. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఇలా అన్నారు. ‘‘మృచ్ఛకటికలోని వసంత సేన, వేయి పడగలలోని గిరిక ఈ రెండు పాత్రలకు కొంత పోలిక కలిగిఉన్న ఉత్తమ స్ర్తి చేతనకు మాచద్దేవి రూపొందింది. ఈమె ప్రసక్తి మనకు శ్రీనాధుని క్రీడాభిరామంలో కన్పడుతుంది. 204వ పుటలో రచయిత ఒక పాత్రలో ఇలా అనిపించారు. ‘‘యుద్ధం చేస్తే ప్రాణంపోతుంది. సంధిచేస్తే మానమూ సంపదలూ పోతాయి. కాబట్టి రెండింటికీ భేధం లేదు. నలభైవేల మంది మంగోలులను ఊచకోత కోయించిన అల్లాఉద్దీన్ క్రౌర్యం. దేవాలయాలను ధ్వంసంచేసిన మాలిక్ కాఫర్ ముష్కరత్వం, శత్రువు సమీపించినా వదలని ఓరుగల్లు సైనికాధికారుల అనైకమత్యం- ఎనె్నన్నో చారిత్రకాంశాలు మనం ఇలాంటి చారిత్రక నవలలో దర్శించి వర్తమాన కాలంలో అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదని పాఠాలూ గుణపాఠాలూ నేర్చుకోవాలి.

**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-ముదిగొండ శివప్రసాద్