అక్షర

వాస్తవికతను ప్రతిబింబించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివాన (కథలు)
రచన: గన్నవరపు
నరసింహమూర్తి
వెల: రు.150/-
కాపీలకు: చినుకు
పబ్లికేషన్స్ విజయవాడ
**
సాహిత్యం కాల్పనికమే అయినా సామాజిక స్పృహ, వాస్తవికత ఉన్న కథా సాహిత్యం ప్రజారంజకమవుతుంది. వాస్తవికత ఉట్టిపడే కథల్లో పాఠకుడు తన్ను తాను సాక్షాత్కరింపచేసుకుంటాడు. కథల్లో చెప్పబడిన సంగతులు ఎక్కడో ఊహాలోకంనుండి దిగుమతి కావించబడినవి కాకపోవడంవల్ల రోజూ తాను గమనిస్తున్నవే అవడంవల్ల ‘రీడబిలిటీ’ పెరుగుతుంది.
దాదాపు 200 కథలు వ్రాసి, మూడు కథా సంపుటాలు లోగడ ప్రచురించిన గన్నవరపు నరసింహమూర్తిగారి ‘గాలివాన’ నాలుగో కథా సంపుటి. ఇందులోని కథలన్నీ ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో ప్రచురించబడి ప్రజామోదం పొందినవే! భావ, భాషా సారళ్యత వీరి కథల్లో కనిపిస్తాయి. ప్రతి కథలోనూ ఓ అంతర్లీన సందేశం ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. తనలోకి తాను చూసుకుంటూ, తానున్న పరిసరాల్ని పరిశీలిస్తూ మధ్యతరగతి జీవితాల్ని వాళ్లతాత్వికతను మనకు పరిచయం చేసారు. అందుకే వీరు లోగడ ‘గంథం చెట్టు’ రాసినా ఇప్పుడు ‘గాలివాన’ రాసినా వీళ్లే కనపడతారు. ‘స్వేచ్ఛ’ కథలోని ఆనంద్, సుమతి; తిండి లేకుండా జీవించగలడేమో కాని పద్యం పాడకుండా వుండలేని ‘చరమాంకంలో’ రాఘవ; ‘చేదునిజం’ (పే.37)లో మోహన్ దీపలు ఈ కోవకు చెందుతారు.
రెండు జీవితాల్ని పోల్చి చూపి చివరకు ఏది మంచిదో పాఠకుల ఊహకు వదిలిపెడతారు నరసింహమూర్తిగారు. ‘స్వేచ్ఛ’ కథలో మనుషుల దాంపత్యాన్ని లయన్ సఫారీలోని సింహాల దాంపత్యాన్ని పోల్చి చూపి మనుషులు ఎక్కడ గాడి తప్పుతున్నారో సంజ్ఞా ప్రాయంగా చెబుతారు. అమెరికా జీవితం, స్వదేశ జీవితంతో పోల్చి చూపే దూరపు కొండల్లో కూడా ఇదే విషయం గమనించగలుగుతాము.
ఈ కథల్లో మరో ప్రత్యేకత కథలకు ఇచ్చిన ‘టైటిల్స్’. కథ మొదలు పెట్టేలోపే కథలో రచయిత ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాడో తెలుస్తుంది. ‘పిచ్చుకమీది బ్రహ్మాస్త్రం’, ‘చరమాంకం’ వాలుజడ లాంటి శీర్షికలతోనే కథను ఊహించుకోగలము. తాను పనిచేస్తున్న పరసరాలు ‘అభయారణ్యం’, మరియు ‘ఎర’ లాంటి కథల్లో కనిపిస్తాయి. రచయితకు సంగీతంమీద వున్న పట్టుని ‘గురుదక్షిణ’లో గమనించగలము.
ఎన్నో కథల్లో మంచి మంచి వాక్యాలు (సమాంతర రేఖలు, వార్నీ, తూర్పు పడమర) పాఠకుల్ని ఆకట్టుకునేలా వున్నాయి.
ఎన్నుకున్న విషయం సాధారణమే అయినప్పుడు కథనంలో నవ్యత ఉంటే కథలు రాణిస్తాయి. కథనం, శైలి మీద మరికొంత శ్రద్ధ వహిస్తే ఇంకా బాగుండే కథలు.

-కూర చిదంబరం