అక్షర

ప్రేమతత్వామృతం.. రాధా మాధవీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాధా మాధవీయం
-పింగళి పాండురంగరావు
వెల: రూ.
ప్రతులకు: అన్ని
ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
శ్రీకృష్ణుడే పరమాత్మ. ఆయన నుండి ఉద్భవించినదే ఈ చరాచర జీవకోటి. ఆయననుంచి విడివడినప్పుడు పునః శ్రీకృష్ణునితో సంయోగపరచేదీ, సంయోగ పరచగలిగేదీ, రాధాదేవి మాత్రమే. అందువలననే ఎందరో మహాత్ములు, బృందావనంలో ‘రాధే-రాధే’అంటూ పరిభ్రమిస్తూ వుంటారు. సంయోజ్ఞిక. ఆద్యురాలు శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఆహ్లాదికాశక్తీ- సమస్తమూ రాధాదేవియే. రాసలీల గురించి రాధకు తెలుసు. శ్రీకృష్ణునికి తెలుసు. ఆ రాధాకృష్ణుల అనుగ్రహానికి పాతృలైన వారిలో ఏ స్వల్పసంఖ్యాకులకు మాత్రం అల్పంగానైనా ఆ జ్ఞానం ఏర్పడుతుంది. ఆ అరుదైన రాసతత్త్వవేత్తలలో అరుదైనవాడు శ్రీశుతుడు మాత్రమే. కేవలం రాధికా కరుణాక్షటాక్షం వలన మాత్రమే శ్రీశుతుడు అంతటి అర్హతను పొందగలిగాడు.
‘‘శుతా!’’ కృష్ణంవద, కృష్ణంవద. రాదేతి మావద’’ (కృష్ణుడే నీకు నిజమైన జనకుడు ఆయననే కీర్తించు. ఆయన నామానే్న స్మరించు.) అంటూ - శ్రీకృష్ణ కృప కలిగేలా ఆశీర్వదించింది శ్రీశుతుని. కేవలం రాధాదేవి కృప కలిగినంతమాత్రానే భగవద్దర్శనం లభ్యవౌతుందంటారు. అటువంటిది ఆమూల ప్రకృతి దర్శన, స్పర్శనలే కలిగినవారి అదృష్టం అనన్య సామాన్యం.
‘రాధామాధవీయం’ వ్రాయాలన్న భావన కలగటము, ఆ భావనే అక్షర సుమార్చనలతో శ్రీరాధాకృష్ణుల పాద పద్మములను అర్చించటమూ, అర్చనల తాలూకు అనుభూతులను, సర్వులకూ అందజేయాలనే తలపుకలగటమూ, కార్యరూపం దాల్చటమూ, కేవలమూ, శ్రీకృష్ణకృపామూర్తులకు మాత్రమే లభ్యమయే అరుదైన వరము.
శ్రీకృష్ణతత్త్వాన్ని అర్థంచేసుకోగలగటం అందరికీ సాధ్యంకాదు. అందులోనూ రాధాకృష్ణ తత్త్వాన్ని అవగాహన చేసుకుని, ఆ ప్రకృతి పురుషులను ఏకాత్మ స్వరూపులుగా అంతర్యామిలో దర్శించగలగటము అందరికీ అసాధ్యమైన విషయము. ఐతే సుసాధ్యం చేశారు..
‘‘సృష్టికి ఆధారం రాధాదేవి. బోజ స్వరూపుడు శ్రీకృష్ణుడు. కృష్ణునిలోని శోభ రాధ. ఆమెలో కలిసినప్పుడే శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు తేజోరూపులు. రాధ మూల ప్రకృతి. కృష్ణుడు మూల పురుషుడు. ఇద్దరూ మహాభావస్వరూపులు. భగవత్ తత్త్వానుభూతికి సాధనమైన లోకోత్తర మహాతత్వంగా దీనిని గ్రహించాలి అంటారు రచయత.
‘‘నమామి హరిః వరమ్’’
కేవలం కృష్ణపరమాత్మకు మాత్రమే వందనం చేసి ఊరుకోకూడదు. శ్రీకృష్ణాయ రాధాకృష్ణాయ నమః ‘శ్రీ అంటే రాధ. రాధ సమేతుడైన శ్రీకృష్ణపరమాత్మకు నమస్కరిస్తున్నాను-’అన్న భావనే అద్వైతసిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ ప్రేమామృత సందేశం మధుర భక్త్భివనాత్మకమై ‘రాధామాధవీయం’లో అక్షరాక్షరానా అక్షయంగా కన్పిస్తూనే వుంటుంది.
కొన్ని సంవత్సరాలుగా కల్పనాజగత్తులో స్వప్నానుభూతులలో అనిర్వచనీయమైన సందేశాలను అందుకుంటూ అందుకు ‘సాక్షిగా’ తన హృదయంలో ప్రతిష్టించుకున్న అజ్ఞాత మనోహరిని తనదేవిగా భావించి, రాధాకృష్ణుల పరమైన, దివ్యానుభూతులను అందుకుంటూ, తన హృదయ సాక్షిపరంగా ఈ అద్వైతామృతాన్ని అందించిన తీరు నభూతో నభవిష్యతి. ఇంద్రాది దేవతా, ఋషులూ, మహనీయులూ, గోలోకంలో అడుగుపెట్టడంకోసమే తపస్సులుచేస్తూ వుంటారు. సమస్త జీవులూ, కఠోర తపస్సుచేశాకే గోలోకప్రాప్తిని పొందుతారు. అక్కడినుండి శ్రీకృష్ణ సన్నిధానాన్ని చేరుకుంటారు. అందుకు కొన్ని యుగాలు పడుతుంది. ఐతే సుదీర్ఘకాలం గోలోకంలో వుండటంవలన శ్రీకృష్ణసాయుధ్యం పొందుతారు.
రాధాదేవి కృప కలిగినంత మాత్రానే శ్రీకృష్ణ్భగవానుని దర్శనం అవుతుందన్నది అక్షరాలా యదార్థం.
భాగవతము ప్రేమశాస్తమ్రు ప్రేమ పంచమ పురుషార్ధము. కృష్ణప్రేమలో దేహభావాన్ని విస్మరించగలిగితే మధురప్రేమ సిద్ధించినట్టే. పరమాత్మ ప్రేమనే తన రస స్వరూపంగా చెపుతూ వుంటారు.
ఈ గ్రంథంలో రాధామాధవుల ప్రేమతత్త్వామృతాన్ని అనేకవిధాలుగా సేకరించి మనకందించారు.
పరమ పురుషుడు కృష్ణునిగా జన్మించిన తరువాత ఒకరోజున ఆయన దోచాడుతూ వెదురుపొదల వైపునకు రావటం జరిగింది. అప్పుడు, అక్కడే వున్న రాధ ఒక వెదురుబొంగును తృంచి మురళిగా చేసి శ్రీకృష్ణుని చేతికి అందించింది. రెండుకాళ్ళపైన నిలబడి మురళిని తీసుకున్నాడా పరాత్పరుడు. పరాశక్తి అయిన రాధ, పరమపురుషుడైన శ్రీకృష్ణుని, భూమిపైన నిలబెట్టటమనే తత్వార్థాన్ని మనం గ్రహించవలసి వుంటుంది. శ్రీకృష్ణుని పెదాలపైన రవళించిన మురళీ గానంతో సకలజగత్తూ పారవశ్యం పొందుతుంది. తన రాసలీల వేళలలో ఆయన వినిపించే వేణుగానం మాత్రం కేవలం అధికార యుతులైన గోపికలకు మాత్రమే వినిపిస్తుంది. అది పారవశ్యంతో కూడిన శుద్ధచైతన్యాన్ని జాగృతం చేస్తుంది. ఆ చైతన్య స్వరూపమే రాధిక. ఆ చైతన్య శ్రవంతియే రాధాకృష్ణుల అద్వైత రసామృత వర్షిణి.
రచయితపరమైన అద్వైతభావనలు అత్యద్భుతాలు. ‘‘కృష్ణుని ప్రేమించటమంటే - నిన్నునువ్వు ప్రేమించటం. ఆ సమయంలో నేను అనే వస్తువునందు కృష్ణుని ఆరోపించుకో. అంతర్యామిగా ప్రతిష్టించుకో ఆత్మప్రేమను కృష్ణప్రేమగా మార్చుకో. రెండూ ఒకటే కనుక వెంటనే నీకు గోలోకప్రాప్తి కలుగుతుంది. కృష్ణ ప్రేమ ఒక్కటే- కైవల్యదాయకం అన్న భక్తిసూత్రాలను గౌరాంగునిపరంగా ఈ రచనలో రచయిత సందర్భోచితంగా ప్రస్తావించారు.
భక్తుడు భగవంతుని గురించి ఎంతగా పరితపించిపోతాడో భగవానుడు కూడా భక్తునికోసం అంతగా- సర్వదా తపనపడుతునే వుంటాడు. అందుకు నిదర్శనంగా భీష్ముని భక్తితత్పరతను గురించే- ఉద్ధవుని ద్వారా- రాధాగోపికల నిజభక్తి తత్పరతను గురించే మధురభక్తి భావనలోని అద్వైతపరమైన అమృతత్త్వాన్ని గురించే.
రాధామాధవుల అన్యోన్య ప్రేమానురాగాలను హృద్యంగా రచించి గానం చేసిన జయదేవుని గీతగోవిందంలోని నిజ భక్తితత్త్వాన్ని గురించే పాండురంగారావుగారు భక్తులకందించిన తీరు అత్యద్భుతం.
ఈ గ్రంథంలో వివేకానంద వాణినీ, సద్గురు శివానందమూర్తిగారు రచించిన ‘కృష్ణలీలామృతాన్నీ’ సుప్రసిద్ధత్వ పండితులూ శ్రీకృష్ణ భక్తులూ అయిన శ్రీ ధారారామనాధశాస్ర్తీగారు రచించిన కృష్ణం వందే జగద్గురుంలోని రాధామాధవీయ జోత్నల గురించీ హృద్యంగా ప్రకటించిన తీరు వందనీయం.
గీతానందం, శ్రీమద్భగవద్గీత, కవయిత్రి మీరా, క్షేత్రయ్య, భక్తజయదేవ, గీతగోవిందం, స్వీయ రచనలుగా ప్రచురించి ఇప్పటికే లబ్దప్రతిష్టులయారు రచయిత.
ఆధ్యాత్మికత అడుగంటిపోతున్న ఈరోజుల్లో శ్రీకృష్ణలీలలకు వక్రభాష్యాలు చెప్పే ప్రబుద్ధులున్న ఈ కాలంలో ‘రాధామాధవీయం’ గ్రంథాన్ని అందించిన పింగళి పాండురంగారావుగారు ధన్యులు.

-కె.వి.కృష్ణకుమారి