అక్షర

చక్కని సైన్సు పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికతకు
చిరునామా-సైన్స్
(సైన్స్ వ్యాసాల సంపుటి)
133పేజీలు,
వెల: 100 రు.
రచయిత: డా.నాగసూరి వేణుగోపాల్
ప్రతులకు: నవచేతన
పబ్లికేషన్స్, హైదరాబాద్
**
తెలుగులో విజ్ఞానశాస్త్ర సంబంధమైన పుస్తకాలు చాలా తక్కువ. అడపా తడపా తెలుగులో ఏవో కొన్ని విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పుస్తకాలు వస్తూ వున్నాయి. ఐతే వీటికి ప్రజాదరణ ఎంత వుందో వాటి అమ్మకాలను చూస్తే ఇట్టే అవగతమవుతుంది. అలాంటిది 2012-13 ప్రాంతంలో ఇదివరకే ఒక దినపత్రికలో వచ్చిన సైన్సుకు సంబంధించిన వ్యాసాలను ఒక సంపుటిగా తేవడం నిజంగా సాహసమే.
సైన్సు అక్షరాస్యత అవసరం ఏమిటి, పాపులరా కాదా, ఎలా రాయాలి. ఎలాంటి టెక్నాలజీ కావాలి, ప్రజల భాషలో శాస్త్ర విజ్ఞానం, సైన్స్ పదావళి ఎలా వుండాలి, తెలుగు సైన్స్ దీపం చిన్నదేం కాదు, గణాంక శాస్తస్రంవత్సరం, సంగీతానికి టెక్నాలజీ తోడు, సైన్సుకి సమాజానికీ లంకె ఏమిటి, అంగారక యాత్రలో భారత్-ఇలా ఈ 133 పేజీల పుస్తకంలో 42 వ్యాసాలున్నాయి. తెలుగుజాతి గర్వించదగ్గ విజ్ఞాన శాస్తవ్రేత్తలు నాడూ వున్నారు, నేడు ఉన్నారు. రచయిత అన్నట్టు వారికి సంబంధించిన ఒక డైరక్టరీ వెలువడాల్సిన అవసరం ఎంతోవుంది. అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా అందరికీ అందుబాటులోకి తేవడానికి మనకు ఒక తెలుగు సైన్సు అకాడమీ కూడా ఎంతో అవసరం. ఈ విషయాన్ని కూడా ఈ సంకలనంలోని వ్యాసాలు చెబుతున్నాయి.
ఒకట్రెండు ముద్రారాక్షసాలు తప్పలేదు. ఐతే ఏ వ్యాసానికి ఆ వ్యాసం ఆలోచింపచేస్తుంది. ఇవన్నీ మనకు సైన్సు మీద మక్కువ కలిగిస్తాయి కూడా. ఆలోచన చేయగలవారంతా ఎంతో ఆదరించిన వ్యాసాలే ఇవి. ఇవన్నీ 2012-13 ప్రాంతంలో రాసినా వాటి విషయ ప్రాముఖ్యత తగ్గలేదు. చదవడానికి హాయిగానే వుంది. రచయిత లోగడ ఇదే సైన్స్‌వాచ్ అనే సంకలనాన్ని వెలువరించారు. అది ఎంతో ఆదరణ పొందింది. ఈ పుస్తకం కూడా ఆదరణ పొందుతుందనే అనిపిస్తోంది.

-వి.