అక్షర

తెంగ్లీషు భాషలో గాడ్ ఫాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాడ్ ఫాదర్
పేజీలు: 240
వెల:. రు.200
రచయిత: మూర్తి.కే.వి.వి.ఎస్
ప్రతులకు: నవచేతన
పబ్లికేషన్స్, హైదరాబాద్
**
1969లో తొలిసారిగా 450 పేజీల పుస్తక రూపంలో వచ్చింది గాడ్‌ఫాదర్ అనే నవల. ప్రజాదరణ పొంది, 1972లో సినిమాగా రూపుదిద్దుకుంది. మరింతమందికి చేరువైంది.కాబట్టి అలాంటి నవలకు తెలుగు అనువాదం (కనీసం సంక్షిప్త అనువాదం) అని చూడగానే నాబోటి సామాన్య పాఠకులు వెంటనే చదివేద్దాం అని ఆశపడక మానరు. ఐతే పుస్తకం చేతపట్టగానే మనకు ‘ఇది యమ సభా, మయ సభా, అయోమయ సభా?’ అని అదేదో తెలుగు సినిమా డైలాగులాగా, ‘ఇది అనువాదమా, లిప్యంతరీకరణా, సంకరమా?’ అని ఆశ్చర్యపోవాల్సి వుంది ఈ పుస్తకం చూస్తే. ఎందుకంటే సాధారణంగా ఒక భాషలో రాసిన ఒక నవలను అచ్చతెలుగులోకి రాస్తే అది ఆ భాషకు తెలుగు అనువాదం అవుతుంది. ఏదో ఒకటో రెండో ఇంగ్లీషు పదాలు దొర్లితే అవి కూడా తెలుగు లిపిలో వుండేలా చూసుకుంటారు. అలా కాకుండా ఇంచుమించు ప్రతి వాక్యంలో ఇంగ్లీషు తెలుగు పదాలను ఆయా భాషల లిపులతోనే కలబోసి వండితే, అది తెలుగు అనువాదం ఎలా అవుతుందీ...అని ఈ పుస్తకం కైగొన్నవారికి అనుమానం రాకమానదు.
సంక్షిప్త అనువాదం-సవివర పరిచయం అనే ఫార్మేటు ఎవరు కనిపెట్టారో, అదేమిటో మనకు తెలీదు. కానీ ముందుమాటలో అమరేంద్రగారు అలాంటి ఫార్మేటులో ఈ పుస్తకాన్ని ఎంతో బాగా రాసారని అవసరానికి మించి పొగిడినట్టు అనిపిస్తుంది. ఐతే ఒకటి మాత్రం నిజమేమో. ఇది విశ్వామిత్ర సృష్టేననిపిస్తోంది. సంకర తెంగ్లీషు భాషను ప్రవేశపెట్టి, అందులో ఒక ఇంగ్లీషు నవలను అందించడం మరి ముందుమాటలో ఆయన అన్నట్టు ఇది నిజంగా విశ్వామిత్ర సృష్టే! కాక మరేమిటి?
2015లో ఈ పుస్తకం తొలి ముద్రణ జరిగింది. దానిని న్యూయార్కుకు చెందిన పుట్నాం సోదరులు వెలువరించారు. అది బాగా ఆదరణ పొందింది కాబట్టి మలిముద్రణ ఇండియాలో జరిగింది. మొదటి ముద్రణ కేవలం అమెరికా తెలుగువారికోసం ఉద్దేశించిందై వుండాలి. అమెరికా తెలుగువారుకాబట్టి, వారికి తెలుగూ, ఇంగ్లీషు బాగానే వచ్చి వుంటాయి కాబట్టి పర్వాలేదు. నాబోటి పల్లెటూరి పాఠకులకు ఇంగ్లీషు రాకపోతే మాత్రం ఇలాంటి పుస్తకాలను ఆస్వాదించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇందులో ముద్రా రాక్షసాలు చాలానే వున్నాయి. చాలాచోట్ల వత్తులు, ఒత్తుల డబ్బాలో పెట్టి మరిచిపోయినట్టు తెలుస్తోంది.
‘‘ఇంత వైవిధ్యం ఉన్న నవలను జిగీ బిగీ చెదరకుండా, వివరాలు వదలకుండా, వాతావరణాన్ని పలచ చేయకుండా, సాంధ్రత కోల్పోకుండా తెలుగులోకి తీసుకురావడం అందులోను సంక్షిప్తంగా-సాధ్యమా?’ అంటే సాధ్యమే అని నిరూపించారు మూర్తిగారు అని ముందుమాటలో అన్నారు. ఇది కొంతే సత్యం. ఎందుకంటే ఏ వాక్యం కూడ ఇంగ్లీషు పదం లేకుండా రాయలేదు. కొన్ని వాక్యాల్లో ఇంగ్లీషు పదాలు యథాతథంగా ఇంగ్లీషులో వుంచి, మధ్యలో తెలుగు పదాలు వాడి, తిరిగి ఇంగ్లీషు పదాలను లిప్యంతరీకరించి వాడారు.
ఇదిలావుంటే వెనుకమాటలో విజయకుమార్ గారన్నట్టు, ‘మహామహులైన అనువాదకుల గ్రంథాలతో పరిచయం, ద్విభాషా జ్ఞానం-అన్నిటికీ మించి విశేష సాహితీ పాటవం వుంటే తప్ప, ఇలాంటి అనువాదం సాధ్యపడదు.’’ నిజమే. ఆఖరుకు ఈ నవలను చదవాలంటే తెలుగు ఇంగ్లీష్ భాషలు రెండూ వచ్చి వుండాలి. లేకపోతే ఇబ్బందే. నవచేతన పబ్లికేషన్స్‌నుంచి ఇలాంటి పుస్తకం వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానను.

-వి.వి.వేంకటరమణ