అక్షర

‘ఇన్‌ఫెక్షన్స్’ గుట్టు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌ఫెక్షన్స్
రచన: కె.ఉమాదేవి
పేజీలు: 155
వెల: రు.140/-
ప్రతులకు:
విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ
**
‘ఇన్‌ఫెక్షన్స్’కి దూరంగా ఉందాం! అందుకు ఇన్‌ఫెక్షన్స్ లాంటి గ్రంథాలకి దగ్గరగా వుందాం. ఇన్‌ఫెక్షన్ అనే మాటను మనం అతి తరచు వింటుంటాం, చూస్తుంటాం. అనుభవిస్తుంటాం కూడా! ఇన్‌ఫెక్షన్ అంటే ఏమిటి? ఎన్ని రకాలుగా మనకి వస్తుంటాయి? కారణాలేమిటి? అవి రాకుండా ఎలా జాగ్రత్తపడాలి లాంటి విషయాలపట్ల పరిపూర్ణ అవగాహన వుంటే మనం ‘ఇన్‌ఫెక్షన్’ అనేది దరికి చేరకుండా బతకవచ్చు. ఇందుకు సహకరించే సమాచారంతో డా.కె.ఉమాదేవిగారు ‘ఇన్‌ఫెక్షన్’ అనే గ్రంథాన్ని తీసుకువచ్చారు.
మన శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులు అనేకం వున్నాయి. ఇవి కంటికి కనిపించకపోయినప్పటికీ శరీరానికి మాత్రం బోలెడంత హాని కలిగిస్తాయి. వీటిలో బాక్టీరియా, వైరస్ ముఖ్యమైనవి. ఇవే కాకుండా మైక్రో ప్లాస్మా, ప్రోటోజోవా, మెటాజోవా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్స్ ముఖ్యమైనవి అంటారు డా.కె.ఉమాదేవిగారు. ఇన్‌ఫెక్షన్స్ వచ్చినపుడు దేహ పరిస్థితి ఎలా వుంటుంది? ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే వ్యాధులేమిటి? బాక్టీరియా, ఫంగస్,వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఎన్ని రకాలు? లక్షణాలేమిటి? వాటి బారినుంచి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లాంటి వివరాలు పొందుపరిచారు. అంతేకాదు వ్యాధి నిర్ధారణ పరీక్షలు-రక్త, మల, మూత్ర పరీక్షల వివరాల్ని ఆఖరులో ఇచ్చారు. ఈ విషయాలు అన్నింటినీ చదివి మనల్ని మనం ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అనారోగ్యాలు కలిగిన తర్వాత చికిత్సకోసం పరిగెత్తడంకన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సరైన పద్ధతి. అందుకు తోడ్పడే ఇలాంటి గ్రంథాలు అందరూ చదవాలి. డా.కె.ఉమాదేవిగారికి, ప్రచురించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కి అభినందనలు. ఇలాంటి ఆరోగ్య అవగాహన పెంచే గ్రంథాలు వస్తుండాలి. వాటిని చదివి అందరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

-వేదగిరి రాంబాబు