అక్షర

కొంత అస్పష్టత.. కాస్త హాస్య చతురత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవర్షిణి
(చెన్నై ఆకాశవాణిలో ప్రసారమైన కథలు)
రచన: షణ్ముఖశ్రీ
వెల: రు.55/-
ప్రతులకు:- ములుగు కుమారస్వామి సాకేత్ అపార్ట్‌మెంట్సు ఫ్లాట్ నెం.301,
ఇం.నెం.2-2-315, శివంరోడ్,
న్యూనల్లకుంట, హైదరాబాదు- 044
88978 53339

‘ఆకాశవర్షిణి’ పుస్తకంలోని 9 కథలనూ చెన్నై ఆకాశవాణి కేంద్రంవారు ప్రసారం చేశారని రచయిత తెలిపారు. పుస్తకానికి ఉపోద్ఘాతంగా రచయిత రాసిన పాత సంగతులు, కీర్తిశేషులయిన కొందరు ప్రముఖులను స్మరించుకోవటానికి పనికొస్తాయి.
సమాజంలో కనిపించే దైనందిన సంఘటనలను విశే్లషిస్తూ, రచయిత సలహాలూ, సూచనలూ ఇవ్వటం కథలలో కనిపిస్తుంది.
ఆర్థికస్థితి బాగున్న కుటుంబాలలో భార్యలు కాలక్షేపానికి ఉద్యోగాలు చెయ్యటం అభిలషణీయం కాదని తెలియజెప్పే కథ ‘కార్యేషు రంభ’. ఆధ్యాత్మికంగా పురోగమించామని అహంకరించటం కన్నా, సాటి మనుషులను అవసరానికి ఆదుకోవటం నేర్చుకోవాలని ‘ఈగోల గోల’ కథ సందేశం ఇస్తుంది.
అత్తాకోడళ్ల మధ్య ఏర్పడే మనస్పర్థలకు కారణాలను ‘సతీ ఉక్కుబాయి’ కథ వివరిస్తుంది. ‘ఎవరి హద్దులలో వాళ్లుంటేనే ముద్దు’ అని తన ఉపన్యాసంలో, కోడలు అత్తగారికి బోధిస్తుంది ఈ కథలో. సహజత్వానికి దూరంగా ఉన్నట్లుగా ఈ కథ కనిపిస్తుంది.
‘శీఘ్రమేవ కళ్యాణప్రాప్తి రద్దు’ కథ చివరలో పెళ్లిళ్ల విషయంలో అవలంబించవలసిన సర్దుబాటు ధోరణిని గురించి మంచి సూచనలున్నాయి.
‘తిండితులు’ కథలో కఫై, జఫై అని రెండు పాత్రలు కనిపిస్తాయి. పాత్రల పేర్లు సరిగా లేనప్పుడు మంచి కథ కూడ పేలవంగా తయారవుతుందని చెప్పటానికి ఈ కథ ఒక ఉదాహరణ.
‘దీపం దర్శయామి’ కథలో పొదుపు ఆవశ్యకతను గురించి కొత్తరకంగా చెప్పటం కనిపిస్తుంది. ‘లకపిక మక’ కథలో స్పష్టత లోపించింది. కథలన్నిటిలోనూ, రచయిత హాస్యరసం ప్రవేశపెట్టే ప్రయత్నంచేశారు.

- ఎం.వి.శాస్ర్తీ