అక్షర

సుభాషిత విస్ఫోటనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విస్ఫోటనం’
కవిత్వం
గొట్టిపర్తి యాదగిరిరావు
పేజీలు: 55, వెల: రూ.50/-
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ప్రతులకు: రచయిత: 8297277795
--

నీరూ, గాలీ, ఆకాశం అందరివి, ఆకలి - ఆలోచనలు మాత్రం ఎవరికి వారివే అంటాడు కవి గొట్టిపర్తి యాదగిరిరావు. లక్ష్యం మానవ కళ్యాణమే అయినా సాధనకు భిన్న భిన్న ఆలోచనలు. ప్రపంచంలోని ఇన్ని సిద్ధాంతాలకు, రాద్ధాంతాలకు ఆలోచనలే కారణం.
నేటి మనిషి ఆలోచనలను వడబోస్తూ, రాజకీయ రంగుల వెనుక హంగులను బయటపెడ్తూ తనదైన సుతిమెత్తని అభివ్యక్తితో వెలువడ్డ గొట్టిపర్తి యాదగిరిరావు కవితా సంకలనం ‘విస్ఫోటనం’.
31 కవితలున్న ఈ సంకలనంలో మినీ కవితలే అధికం. సరళమైన భాష, శైలిలో ఉన్నందున చదవడమూ సులభమే. సాధారణంగా అందరికీ అనుభవంలోకి వచ్చే వ్యక్తిగత, సామాజిక అంశాలపై అల్లిన ఈ కవితలు మొదటి చూపులోనే ఆకట్టుకుంటాయి. సాంద్రత, గాఢత, సంక్లిష్టతలకు దూరంగా ఉన్న ఈ కవితలకు లక్ష్యం సామాన్య మానవుడే. కవి అనుభవంలోకి వచ్చిన సమకాలీన సమస్యలను సగటు పాఠకుడికి తెలిపే క్రమంలో ఈ కవితలు సాగుతాయి.
విలువలకు పట్టంకట్టవలసిన ‘మనిషి రహదారి వీడి అడ్డదారి పట్టినప్పుడు జీవితం నరకప్రాయం అవుతుంది’అని జీవిత సత్యం, పాటించాల్సిన విలువలను గుర్తుచేస్తారు కవి ‘విలువలు’ కవితలో.
మనసు చిత్రం గీయ ప్రయత్నించిన కవిని ‘ఎదురుగాఉన్న తెల్లని కాగితం తెలిపింది, మలినం లేని నీ మనసు నాలా తెల్లగా ఉంటుందని’. సమాధాన పరిచింది.
‘మట్టి స్పర్శ’లో మైమరచిపోతాడు కవి. ‘ఈ మట్టిని స్పృశిస్తుంటే అమ్మ మనసు స్పృశించినట్లుంది, తప్పటడుగుల నుండి తలకొరివి వరకు భారాన్ని మోసి తనలో చోటిస్తుంది’ అంటూ మనిషే మట్టి ఆ మట్టే మనిషి అని తీర్మానిస్తాడు.
రైతు కష్టాలతో, కడతేరుటతో బాధపడిన కవి-‘డబ్బాలో అడుగున మిగిలిన పురుగుల మందు కడుపు నింపలేదు, కాని తెల్వని లోకాలకు తీస్కపోయింది’ అని వ్యధ చెందుతాడు.
‘అధికారం విర్రవీగి సామాన్యులపై కర్రపెత్తనం సాగిస్తున్నప్పుడు కవి సైనికుడి కలం అణుబాంబు అవుతుందన్న’ నిజం చెప్పే విస్ఫోటనమిది.

-బి.నర్సన్