అక్షర

వినూత్న ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తిలా పుణ్యం’
అమ్మమ్మే గోదావరి
ప్రవాహం కథలు
యర్రమిల్లి త్రయం
పుటలు: 60
వెల: రూ.120
ప్రతులకు: నవోదయా
బుక్‌హౌస్, హైదరాబాద్

తెలుగు సాహిత్యంలో కథలు/ కథానికల పాత్ర విశిష్టమైనది. ఇతర ప్రక్రియలకన్నా కథలకే పాఠకాదరణ ఎక్కువగా లభిస్తోందనడం అతిశయోక్తి కానేరదు. కథా సంకలనాలు విరివిగా వెలువడుతుండడం కూడా పాఠకాదరణ ఉందన్న విషయాన్ని ధృవీకరిస్తుంది. కథాసంకలనాలు ఒకే రచయితవి, ఒక ప్రాంత రచయితవి, ఒక జిల్లాకి చెందిన రచయితలవి అనేక రకాలుగా విభజించవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన సోదరి, ఇద్దరు సోదరులు రాసిన కతలు, ‘అమ్మమ్మే గోదావరి ప్రవాహం కథలు’ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. యర్రమిల్లి విజయలక్ష్మి రాసిన ఎనిమిది కథలు, యర్రమిల్లి సూర్యనారాయణ మూర్తి కలం నుంచి వచ్చిన ఎనిమిది కథలు, యర్రమిల్లి ప్రభాకరరావు రచించిన ఎనిమిది కథలు, వెరసి ఇరవై నాలుగు కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
నదికీ, నరులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఇతివృత్తంగా కలిగి ఉన్న కథ ‘ప్రవాహం’. చిన్నతనంలో అమ్మమ్మతో కలిసి గోదావరికి రోజూ వెళ్లిన జ్ఞాపకాలు మనవరాలి మదిలో చెరగని ముద్రగా స్థిరపడతాయి. అమ్మమ్మ కాలధర్మం చెందినా, గోదావరిలోనే అమ్మమ్మని చూడగలిగానన్న తృప్తి మనవరాలికి కలగడం కథలోని కొసమెరుపు.
పిల్లలు అమెరికాలో తల్లిదండ్రులు పల్లెటూరిలో ఉండడం అనేక కుటుంబాలలో గమనిస్తున్నదే. మీరు అమెరికా వచ్చేయండి.. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకొంటాము అని చెప్పే కొడుకు అసలు ఉద్దేశం మనవల పెంపకం బాధ్యత అప్పగించాలనుకోవడం. భార్యాభర్తలిద్దరిలో ఒకరికి వెళ్లాలని, ఇంకొకరికి ఉండిపోవాలనీ అనిపించడం, పరస్పర విరుద్ధ భావాల వల్ల కలిగే అశాంతి తదితర అంశాల చుట్టూ తిరిగిన కథ ‘ఏటిలోని కెరటం’. ఈ రెండు కథలూ యర్రమిల్లి విజయలక్ష్మి రచించినవి. ‘తిలాపాపం’ అన్న మాట అందరికీ సుపరిచితమే. కాని ‘తిలా పుణ్యం’ అన్న ప్రయోగం వినూత్నంగా అనిపిస్తుంది. కథలో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తిలాదానం స్వీకరించిన కథానాయకుడికి కలిగిన మధురానుభవం ఏమిటో చివరి వాక్యం చదివితే కాని తెలియదు. ఆనందం వచ్చినా, దుఃఖం కలిగినా కన్నీళ్లే వస్తాయి మనుషులకి. మొసలి కన్నీటిని జంతువుని ఆహారంగా తీసుకున్న తర్వాతే కారుస్తుంది. ‘మొసలి కన్నీరు’ అన్న నానుడి అందుకే వచ్చిందేమో. సామాన్య ప్రజల కష్టాలు చూసి కన్నీరు కార్చే రాజకీయ నాయకులు కోకొల్లలు. మొసలి ప్రకృతి ధర్మంగా కన్నీరు కారిస్తే, రాజకీయ నాయకుల కన్నీరు ధనార్జన కోసమేనన్న అంశం చుట్టూ అల్లబడిన కథ ‘కన్నీరు’. తిలా పుణ్యం, కన్నీరు కథలు జయసూర్య కలం నించి వెలువడ్డాయి.
మరణించిన తర్వాత ఆస్తి వారసులకు దక్కుతుంది సాధారణంగా. కాని సంతానం లేని అవ్వ తన ఆస్తి అయిన జమ్మిచెట్టుని ఎలా సద్వినియోగం చేసింది అన్నది తెలుసుకోడానికి ‘వారసత్వం’ కథ చదవాలి.
కూచిపూడి నాట్యాచార్యుడైన దీక్షితులు రాజుగారి ఎదుట నాట్యం ప్రదర్శించడానికి శిష్యులతో సహా రాజధాని చేరుకుంటాడు. ప్రయాణంలో ఎదురైన క్రూరుడైన అధికారి ఆగడాలని రాజుగారి దృష్టికి తీసుకెళ్లడానికి నాట్యకళనే వినియోగించడం ‘దీక్ష’ కథ ఇతివృత్తం. ‘వారసత్వం’ ‘దీక్ష’ కథల రచయిత శాంతి ప్రభాకర్.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు రచయిత(త్రు)లు కథలు రాయడం, బహుమతులు గెలుచుకోవడం ముదావహం.

-పాలంకి సత్యనారాయణ