అక్షర

చిన్న కథల్లో చిక్కటి భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న వయసులోనే స్వర్గస్తుడైన ఒకప్పటి మహారచయిత సింగరాజు లింగమూర్తి రాసిన కథల సమాహారం ఈ పుస్తకం. ఇందులో ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడిన 24 కథలతోపాటు, ఒక నాటిక కూడా ఉంది.
1950, 60ల నాటి సామాజిక పరిస్థితులను ఈ కథలు ప్రతిబింబిస్తాయి. రిస్ట్‌వాచీలు, రేడియోలు వంటివి ఆనాటి మధ్యతరగతి ప్రజానీకానికి విలాస వస్తువుల కిందనే లెక్క. ఈ అంశాన్ని అద్భుతంగా చిత్రించిన కథ ‘అల్లుళ్ళ కోరికలు’. అయితే ఇందులో గడియారం గొలుసు అనడంలో స్పష్టత లేదు. (పే.45)
ఉద్యోగాలు చేసే ఆడవాళ్లమీద, లేనిపోని అభాండాలు వేస్తూ కాలక్షేపం చేసే వాళ్లను ఎండగట్టే కథ ‘సమాజం- సరళ’. మధ్యతరగతి మనుషులమీద సమాజం పోకడను రచయిత విశే్లషించిన తీరు బాగుంది.
అసలు సిసలు స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితంలో అనుభవించిన కష్టాలను ‘ఆత్మవంచన’ కథలో చూడవచ్చు.
జీతాలు తక్కువ- అవసరాలెక్కువ అన్నట్లుండేది 1960 నాటి పరిస్థితి. జీతాలు సరిపోక, అప్పులు చేసి బతుకు బండిని లాగించే వాళ్ల దుస్థితిని వివరించే మంచి కథ ‘్ఫస్టు భాగోతం’.
ఇటువంటిదే మరో కథ ‘తెగిన జోడు’. కొత్త చెప్పులు కొనాలంటే డబ్బులు సరిపోక, తెగిన చెప్పులను మళ్లీ మళ్లీ కుట్టించుకోవడం అప్పట్లో సాధారణంగా జరిగేది. కథ బాగుంది.
పండక్కు అల్లుడొస్తున్నాడంటే మామగార్లకు గుండెల్లో రాయి పడ్డట్లుండేది, వెనుకటి రోజుల్లో. మామగారిని కష్టపెడుతుంటాడని, జామాతా దశమగ్రహః అని అంటుండేవారు. ఆ వివరాలను అందించే కథ ‘శుభగ్రహం’. ఈ కథలో మనస్తత్వాల విశే్లషణ ప్రశంసనీయంగా ఉంది.
పుస్తకం చివరలో ఇచ్చిన ‘ముసలమ్మ మనసు’ నాటికలో సున్నితమైన హాస్యం ఉంది.
చిన్న కథలోనే అద్భుతమైన భావాన్ని ఒలికించడం ‘నీతిచంద్రిక’ కథలో కనిపిస్తుంది. రిక్షా తొక్కి జీవనం సాగించే వ్యక్తి, ఉచితంగా డబ్బులిస్తానంటే వద్దనటం ఇందులో ఇతివృత్తం. కథ బాగుంది.
ఈ పుస్తకంలోని కథలు చదివినప్పుడు, సామాజిక పరిస్థితులను రచయిత బాగా అధ్యయనం చేసిన సంగతి బోధపడుతుంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ కథలన్నీ ప్రయోజనకరంగా ఉన్నాయి.

-ఎం.వెంకటేశ్వర శాస్ర్తీ